Open international chess tournament
-
ఢిల్లీ ఓపెన్ చెస్ చాంప్ అర్జున్
సాక్షి, హైదరాబాద్: ఆద్యంతం నిలకడగా రాణించిన భారత యువతార, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ మరో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. న్యూఢిల్లీలో మంగళవారం ముగిసిన ఢిల్లీ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో వరంగల్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్ చాంపియన్‌గా అవతరించాడు. తెలంగాణకే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి మూడో స్థానాన్ని దక్కించుకోగా... తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ డి.గుకేశ్ రన్నరప్‌గా నిలిచాడు. ఇటీవల అర్జున్ జాతీయ సీనియర్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. నిర్ణీత 10 రౌండ్ల తర్వాత అర్జున్, గుకేశ్, హర్ష భరతకోటి 8.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. అర్జున్‌కు ‘టాప్’ ర్యాంక్ ఖాయమవ్వగా... గుకేశ్‌కు రెండో స్థానం, హర్షకు మూడో స్థానం లభించాయి. ఈ టోర్నీలో అర్జున్ అజేయంగా నిలిచాడు. మొత్తం 10 గేముల్లో అతను ఏడింటిలో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. విజేతగా నిలిచిన అర్జున్‌కు రూ. 4 లక్షలు ... రన్నరప్ గుకేశ్‌కు రూ. 3 లక్షల 50 వేలు.. మూడో స్థానం పొందిన హర్షకు రూ. 3 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. మంగళవారం జరిగిన చివరిదైన పదో రౌండ్ గేముల్లో అర్జున్ 58 ఎత్తుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కార్తీక్ వెంకటరామన్‌ను ఓడించగా... గుకేశ్ 58 ఎత్తుల్లో అభిజిత్ గుప్తా (భారత్)పై, హర్ష 71 ఎత్తుల్లో సేతురామన్ (భారత్)పై నెగ్గారు. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు 7.5 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. -
హరికృష్ణ గేమ్ ‘డ్రా’
స్టావెంజర్: నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ నాలుగో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. మాక్సిమి లాగ్రేవ్ (ఫ్రాన్స్)తో బుధవారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 49 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ప్రస్తుతం హరికృష్ణ నాలుగు పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. -
ఆనంద్ పరాజయం
మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ (భారత్) రెండో పరాజయాన్ని చవిచూశాడు. ఫాబియానో కరువానా (అమెరికా)తో బుధవారం జరిగిన పదో రౌండ్ గేమ్‌లో ఆనంద్ 33 ఎత్తుల్లో ఓడిపోయాడు. పదో రౌండ్ తర్వాత ఆనంద్ 5.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆరు పాయింట్లతో కరువానా, కర్జాకిన్ (రష్యా) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. -
ఆనంద్‌కు ఐదో ‘డ్రా’
మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఐదో ‘డ్రా’ నమోదు చేశాడు. ప్రపంచమాజీ చాంపియన్ వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా)తో ఆదివారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 51 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఎనిమిదో రౌండ్ తర్వాత ఆనంద్ 4.5 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఐదు పాయింట్లతో లెవాన్ అరోనియన్ (అర్మేనియా) అగ్రస్థానంలో ఉన్నాడు.