Open School examinations
-
అన్ని సెట్స్ నిర్వహణ బాధ్యతలు ఎన్ఐసీకే!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్, ఐసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఏటా నిర్వహిస్తున్న నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్‌కే (ఎన్ఐసీ) మిగతా సెట్స్ బాధ్యతలను అప్పగించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి భావిస్తోంది. సోమవారం ఎన్ఐసీ అధికారులతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి భేటీ అయ్యారు. వచ్చే నెల 17 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను వచ్చే నెల 17 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ వెంకటేశ్వర శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్సెస్సీ పరీక్షలు ఏప్రిల్ 17 నుంచి మే 3 వరకు, అలాగే ఇంటర్మీడియెట్ పరీక్షలు ఏప్రిల్ 17 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. ‘అంగన్వాడీ’ నియామకానికి కమిటీలు అంగన్వాడీ టీచర్లు, సహాయకుల నియామకానికి సంబంధించి సరికొత్త నిబంధనలతో జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తూ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్‌పర్సన్‌గా, జిల్లా సంక్షేమాధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా సంబం ధిత ఆర్డీఓ, డీఎంహెచ్ఓ, ఐటీడీఏ ప్రాంతాల్లో ఐటీడీఏ పీఓ సభ్యులుగా ఉంటారు. 23న పీఆర్టీయూ–టీఎస్ విద్యా సదస్సు సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్లో ఈనెల 23న పీఆర్టీ యూ–టీఎస్ రాష్ట్ర కార్వనిర్వాహక వర్గ సమావేశం, విద్యా సదస్సు నిర్వహిం చనున్నట్లు పీఆర్టీయూ–టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డిలు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. -
అంతా.. ఓపెన్!
► ఒకరికి బదులు మరొకరు! ► ఓపెన్ స్కూల్ పరీక్షల తీరిది ► తొలిరోజు 14మంది విద్యార్థుల డీబార్ మహబూబ్‌నగర్ విద్యావిభాగం: ఓపెన్‌స్కూల్ పరీక్షల తీరులో ఎలాంటి మార్పురాలేదు.. సోమవారం తొలిరోజు ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాస్తూ రాష్ట్ర పరిశీలకుడు రాజేశ్వర్‌రావుకు పట్టుబడ్డారు. ఓపెన్ పదో తరగతి పరీక్షలకు 4,826మంది విద్యార్థులు హాజరుకావల్సి ఉండగా 4,388మంది హాజరయ్యారు. ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 7,816 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 7,181 మంది వచ్చారు. జిల్లా కేంద్రంలోని మదీనామసీద్ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని డీఈఓ విజయలక్ష్మిబాయి తనిఖీ చేశారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులను డీబార్ చేశారు. అదే విధంగా వారికి సహకరిస్తున్న ముగ్గురు ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించారు. జిల్లా స్థాయి పరిశీలకుడు బోయపల్లిలో ఇద్దరు ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించారు. అదే విధంగా జడ్చర్లలో ఒకరి బదులు ఒకరు రాస్తుండటంతో వారిని బుక్ చేయడంతో పాటు కేసునమోదుకు ప్రతిపాదించినట్లు తెలిసింది. జడ్చర్లలో ఇన్విజిలేటర్‌ను, నాగర్‌కర్నూల్‌లో ముగ్గురు విద్యార్థులను, ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో నాగర్‌కర్నూల్‌లో నలుగురు, గద్వాలలో ఇద్దరు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులను డీబార్ చేశారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని మాస్ కాపీయింగ్ ప్రోత్సహించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు. ఒకరిస్థానంలో మరొకరు జడ్చర్ల: పట్టణంలోని అక్షరస్కూల్ కేంద్రంలో ఓపెన్ పరీక్షలు రాస్తున్న ఇద్దరు విద్యార్థులు డీబార్ అయ్యారు. ముగ్గురు విద్యార్థుల స్థానంలో మరో ముగ్గురు పరీక్షలకు హాజరుకావడంతో వారిని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తల్లికి బదులుగా కూతురు పరీక్షకు హాజరుకావడాన్ని ఇన్విజిలేటర్ గుర్తించి పట్టుకున్నారు. ఇదేకేంద్రంలో ఏకంగా పుస్తకం పెట్టి పరీక్షరాస్తున్న ఇద్దరిని డీబార్ చేశారు. ఎస్ఐ జములప్ప కేంద్రానికి చేరుకుని తల్లికి బదులుగా పరీక్షరాస్తున్న కూతురితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని సాయంత్రం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు.