Orange County
-
భార్యపై కోపంతో బార్లో కాల్పులు.. ఆరుగురి మృతి
కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. దక్షిణ కాలిఫోర్నియా ఆరెంజ్ కౌంటీలోని ప్రముఖ బైకర్స్ బార్లో బుధవారం రాత్రి రిటైర్డ్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే మరణించగా. మరో ఆరుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు. గాయపడిన ఆరుగురిని పోలీసులు చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా కుటుంబ వివాదాల కారణంతో నిందితుడి భార్య కొంతకాలంగా అతన్ని దూరం పెట్టినట్లు ఆరెంజ్ కౌంటీ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్యను లక్ష్యంగా చేసుకుని ట్రబుకో కాన్యన్‌లోని కార్నర్ బార్లో కాల్పులకు తెగబడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 11 మందిపై కాల్పులు జరగగా.. నిందితుడు సహా ఐదుగురు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: రష్యా: యెవ్గెనీ ప్రిగోజిన్ మృతిపై బైడెన్ షాకింగ్ కామెంట్స్ Mass shooting at a bikers bar in Orange County. A retired sheriff deputy was involved shoot his wife and nine other victims . He was killed in the shoot out, pic.twitter.com/Bh7PjYsWFW — Don Salmon (@dijoni) August 24, 2023 -
ఆరెంజ్కౌంటీతో టీసీఎస్ రాజీ..
2.6కోట్ల డాలర్లు చెల్లించిన టీసీఎస్ న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల సంస్థ టీసీఎస్ అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన ఆరెంజ్ కౌంటీతో న్యాయస్థానంలో కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికింది. 2.6కోట్ల డాలర్లు (దాదాపు రూ. 175 కోట్లు) చెల్లించేందుకు ఆరెంజ్ కౌంటీ(స్థానికంగా ఓ జిల్లా)తో అంగీకారానికి వచ్చింది. ఈ మేరకు టీసీఎస్తోపాటు, ఈ సంస్థ అమెరికా విభాగం టీసీఎస్ అమెరికాలు కలిసి ఆరెంజ్ కౌంటీకి 2.6 కోట్ల డాలర్లు చెల్లించాయి. టీసీఎస్, ఆరెంజ్‌కౌంటీ సంయుక్తంగా అభివృద్ధి చేయాల్సిన ఆస్తి పన్ను నిర్వహణ విధానంపై కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్టు టీసీఎస్ అధికార ప్రతినిధి ఢిల్లీలో మీడియాకు తెలిపారు. ఆరెంజ్కౌంటీతో సుదీర్ఘ న్యాయ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని మేజిస్ట్రేట్ జడ్జి గాంధీ మధ్యవర్తిత్వంతో ఇరు సంస్థలు రాజీ కుదుర్చుకున్నట్టు టీసీఎస్ ప్రతినిధి వెల్లడించారు. వ్యాజ్యాలు రద్దవుతాయి: ఆరెంజ్‌కౌంటీ ఆటోమేటెడ్ ప్రాపర్టీ ట్యాక్స్ సిస్టమ్‌కు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడంలో విఫలమైనందుకు టీసీఎస్, దాని అమెరికా విభాగం 2.6 కోట్ల డాలర్లు చెల్లించినట్టు ఆరెంజ్ కౌంటీ ప్రకటించింది. ట్యాక్స్ సిస్టమ్ 2010లో పూర్తయినప్పటికీ దాన్ని టీసీఎస్ డెలివరీ చేయలేకపోయినట్టు తెలిపింది. కాంట్రాక్టు విలువ 64 లక్షల డాలర్లు కాగా, పరిహారం మాత్రం ఇంతకు నాలుగురెట్లుగా ఉందని పేర్కొంది. పరి హారం చెల్లించినందున టాటాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన వ్యాజ్యం రద్దు అవుతుందని, అదే విధంగా తమపై దాఖలైన పిటిషన్ కూడా రద్దు అయిపోతుందని వివరించింది. ఆరెంజ్‌కౌంటీ ఆరోపణలు ‘ప్రాపర్టీ ట్యాక్స్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసే విషయంలో మోసం, ఉద్దేశపూర్వకంగా, నిర్లక్ష్యపూరితంగా తప్పుదోవ పట్టించడం, కాంట్రాక్టును ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై 2013లో ఈ సంస్థ టాటాలకు వ్యతిరేకంగా వ్యాజ్యం దాఖలు చేసింది. దానిపై ఈ నెల 2న న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఆ వివాదంలో టీసీఎస్‌కు ఊరట
ముంబై: అతిపెద్ద ఐటి సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మూడు ఏళ్లుగా సాగుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది. సుమారు 175 కోట్లను చెల్లించేలా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆరెంజ్ కౌంటీ, టీసీఎస్ జాయింట్ డెవలప్మెంట్ ద్వారా ఆటోమేటెడ్ ఇన్ కమ్ టాక్స్ సిస్టం రిప్లేస్మెంట్ సందర్భంగా ఈ వివాదం తలెత్తింది. దీంతో 2013 లో ఆరెంజ్ కౌంటీ టీసీఎస్ పై దావా వేసింది. మూడు సంవత్సరాలు సాగిన ఈ వివాదంలో 26 మిలియన్ల డాలర్లకు (రూ.1,74, 57, 70, 000) అమెరికా ఆరెంజ్ కౌంటీ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనికి ఇరు పార్టీలు అంగీకరించామని టీసీఎస్ ప్రతినిధి మీడియాకు తెలిపారు కాంట్రాక్ట్ విలువ రూ.6.4 మిలియన్ డాలర్లతో పోలిస్తే తాజా సెటిల్ మెంట్ విలువ నాలుగు రెట్లు ఎక్కువనీ, నిజానికి తాము ఐదు రెట్లు మొత్తాన్ని టాటాకి చెల్లించినట్టు ఆరెంజ్ కౌంటీ ప్రతినిధి ఒక ప్రకటనలో చెప్పారు. అమెరికాలోని ఆరెంజ్ కౌంటీ, టీసీఎస్ ఉమ్మడి భాగస్వామ్యంతో ఆస్తి పన్ను నిర్వహణ వ్యవస్థ రీప్లేస్ మెంట్ కు కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఈ ఒప్పందం 2010లోనే ముగిసినప్పటికీ జారీ చేయలేదు. దీంతో ఆరెంజ్ కౌంటీ కోర్టుకెక్కింది. చివరికి 26 మిలియన్ డాలర్ల చెల్లించేందుకు టీసీఎస్ అంగీకరించడంతో ఈ వివాదానికి తెరపడింది .