కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. దక్షిణ కాలిఫోర్నియా ఆరెంజ్ కౌంటీలోని ప్రముఖ బైకర్స్ బార్‌లో బుధవారం రాత్రి రిటైర్డ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే మరణించగా. మరో ఆరుగురు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు. గాయపడిన ఆరుగురిని పోలీసులు చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా కుటుంబ వివాదాల కారణంతో నిందితుడి భార్య కొంతకాలంగా అతన్ని దూరం పెట్టినట్లు ఆరెంజ్ కౌంటీ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్యను లక్ష్యంగా చేసుకుని ట్రబుకో కాన్యన్‌లోని కార్నర్ బార్‌లో కాల్పులకు తెగబడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 11 మందిపై కాల్పులు జరగగా.. నిందితుడు సహా ఐదుగురు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
చదవండి: రష్యా: యెవ్‌గెనీ ప్రిగోజిన్ మృతిపై బైడెన్ షాకింగ్ కామెంట్స్
Mass shooting at a bikers bar in Orange County. A retired sheriff deputy was involved shoot his wife and nine other victims . He was killed in the shoot out, pic.twitter.com/Bh7PjYsWFW
— Don Salmon (@dijoni) August 24, 2023
Comments
Please login to add a commentAdd a comment