Bikers Club
-
పాత బస్తీ.. బైకర్స్ మస్తీ..
చార్మినార్ సమీపంలో జనసంచారం అరకొరగా ఉండే ప్లేస్‌ను వెదకాలంటే.. అది కేవలం అర్ధరాత్రుళ్లు తప్ప అసాధ్యం. అందుకే సిటీ బైకర్స్ తమ చిట్‌చాట్‌కు అదే టైమ్‌ను ఎంచుకుంటున్నారు. పబ్స్, కేఫ్స్‌లో చిల్ అవుట్ అవడం ఎలా ఉన్నా ఓల్డ్ సిటీలో నైట్ అవుట్ మజాయే వేరు అంటున్నారీ బైకర్స్. నగరంలో విభిన్న రకాల పేర్లతో పదుల సంఖ్యలో బైకర్స్ క్లబ్స్ ఉన్నాయి. జాయ్ రైడ్స్ నుంచి లాంగ్రైడ్స్కు, ప్రత్యేక సందర్భాల్లో సందేశాత్మక రైడ్స్‌కు సైతం పేరొందిన ఈ క్లబ్స్.. తరచూ తమ ఓల్డ్‌సిటీని చుట్టి వస్తుంటారు. ‘ఓల్డ్ సిటీలో కూర్చుని ముచ్చట్లు పెట్టుకోవడం అనేది నగరంలోని బైకర్స్‌కు ఒక సంప్రదాయంగా మారుతోంది. దీనికి తొలిసారి నగరంలో ఈ తరహా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన క్లబ్స్ కారణం’అంటూ చెప్పారు నగరంలోని ఓ బైకర్స్ క్లబ్‌కు చెందిన శ్రీకాంత్.గరమ్ చాయ్.. బన్ మస్కా..సిటీలో ఎక్కడ చాయ్ తాగినా రాని కిక్ ఓల్డ్ సిటీలో ముచ్చట్లతో కలిపి పంచుకుంటే వస్తుందంటారు వాండరర్స్ క్లబ్‌కి చెందిన లలిత్ జైన్. నగరంలోని అత్యంత పాత క్లబ్స్‌లో ఒకటైన వాండరర్స్ తరపున పర్యాటక రంగ ప్రమోషన్స్ కోసం పాత బస్తీలో తరచూ రైడ్స్ నిర్వహిస్తుంటామని చెప్పారాయన. చాయ్‌తో పాటు ఉస్మానియా బిస్కెట్, బన్ మస్కా వంటివి ఓల్డ్‌సిటీకి మాత్రమే ఫేమస్ అయిన పలు హైదరాబాదీ ఫుడ్ ఐటమ్స్‌ను ఎంజాయ్ చేసేందుకు రద్దీ లేని వేళల్లో రైడ్స్ వేస్తుంటారు బైకర్స్. వెజ్, నాన్ వెజ్రైడర్స్ అందరూ ఎంజాయ్ చేసేందుకు అవసరమైన ఫుడ్ అక్కడ దొరుకుతుందని, దీంతో ఓల్డ్ సిటీ రైడ్ అంటే రైట్ అంటామని బైకర్ సిద్ధు చెబుతున్నాడు.ఓల్డ్ ఈజ్ గోల్డ్.. పాత బస్తీ అనేది ప్రతి హైదరాబాదీకి ఒక ఎమోషన్ అంటారు రాజ్‌దూత్ బైక్ మీద రైడ్స్ చేసే నగరవాసి ఛటర్జీ. సాధారణ సమయాల్లో విపరీతమైన రద్దీ వల్ల ఆ ప్రాంతాన్ని సరిగా ఆస్వాదించలేమని, అదే బాగా పొద్దుపోయాక వెళితే.. బైక్ లైట్స్ వెలుగులో మిలమిల మెరిసే చార్మినార్ పరిసరాల్ని వదిలి రాలేమని అంటున్నారాయన. ఆయన లాగే అనేక మంది నగరానికి చెందిన మధ్య వయసు్కలు తమ యుక్త వయసులోని పిల్లల్ని తీసుకుని మరీ రాత్రుళ్లు.. బైక్స్ మీద ఓల్డ్ సిటీ టూర్ వేస్తుండడం సర్వసాధారణం.అతిథి దేవోభవ..దేశ విదేశాల్లో పర్యటించే బైకర్స్.. కొన్ని నగరాలు, ప్రాంతాలకు తాము వస్తున్న సమాచారాన్ని తరచూ ఇచ్చి పుచ్చుకుంటుంటారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో, ఊర్లలో ఉన్న బైకర్స్ వెంటనే వారికి ఎదురేగి స్వాగతాలు పలకడం, తమ ప్రాంత విశేషాలను గురించి వారికి వివరించడం చేస్తుంటారు. అదే క్రమంలో నగరానికి వచ్చే ఇతర ప్రాంతాల బైకర్స్‌కు తప్పకుండా సందర్శనీయ స్థలం పాత బస్తీయే అవుతుంటుంది. అలా తరచూ వచ్చే బైకర్స్‌ను స్వాగతించి వారు కోరిన విందు విహారాలతో అతిథి మర్యాదలకు స్థానిక బైకర్స్ పాత బస్తీనే ఎంచుకుంటారు.తెల్లవారు ఝాము దాకా.. అర్ధరాత్రి ప్రారంభించి తెల్లవారుఝామున బ్రేక్‌ఫాస్ట్‌తో ముగించడం దాకా అక్కడే గడిపే బైకర్స్ కూడా ఉన్నారు.. బిర్యానీ, క్యారామెల్ పుడ్డింగ్, జఫ్రాన్ టీ వంటి వెరైటీలకు పేరొందిన నయాబ్ హోటల్, మసాలా బ్లాక్ టీ, జిందా తిలిస్మాత్ బ్లాక్ టీలు లభించే చౌక్ ఏరియాలోని డికాక్షన్ పాయింట్, నిహారీ, పాయా, షోర్బాలకు పేరొందిన చౌహాముల్లా ప్యాలెస్ సమీపంలోని అల్హాముదులైలాహ్ హోటల్, జ్యూస్‌లు, సలాడ్స్ అంటే గుర్తొచ్చే చారి్మనార్ దగ్గర్లోని మిలాన్ జ్యూస్ సెంటర్, సిద్ధి అంబర్ బజార్లో ఇడ్లీ దోశలతో ఆహా్వనించే ప్రహ్లాద్, అన్నపూర్ణ టిఫిన్స్.. ఇంకేం కావాలి చెప్పండి అంటున్న బైకర్స్‌కు ఆయా హోటల్స్ యజమానులు అంతా చిరపరిచితులే. దీంతో కాస్త ముందుగా చెబితే చాలు వచ్చేవారి సంఖ్యకు తగ్గట్టు ఐటమ్స్ రెడీ చేసేస్తారు.నురానీ కేఫ్ నుంచి నాసిక్ హైవేకి.. రాత్రి 12 దాటిన తర్వాత పాతబస్తీలోని నురానీ కేఫ్‌లో చాయ్ తాగి కాసేపు ముచ్చట్లు పెట్టుకోవడం రొటీన్. మరింత లాంగ్‌రైడ్ కోసం అక్కడ నుంచి నాసిక్ హైవే పై 100 నుంచి 120 కిమీ, అలాగే అక్కడి నిమ్రా కేఫ్ కూడా తరచూ మా మీటింగ్ పాయింట్ అవుతుంటుంది. రాత్రి పూట బైక్ మీద చారి్మనార్‌కు అత్యంత సమీపానికి వెళ్లడం, అక్కడి చాయ్, చాట్ ఆస్వాదించడం బాగుంటుంది. బయట నుంచి వచి్చన బైకర్స్‌ను తప్పకుండా పాత బస్తీకి తీసుకువెళతాం. – అమర్, హిందూస్థాన్ రాయల్స్ బుల్లెటీర్స్ క్లబ్స్అడ్వెంచర్ ఫీల్ కోసం.. రైడ్స్ మధురమైన జ్ఞాపకాలను పోగు చేసుకోడానికే. అందులో రాత్రి పూట రైడ్స్ ప్రత్యేకమైనవి. నైట్ రైడ్ అడ్వెంచర్ ఫీల్ వస్తుంది. మా వాండరర్స్ తరచూ ఫుడ్ రైడ్స్ నిర్వహిస్తుంటాం. రాత్రి పూట హైవే మీది దాబాల లాగే పాత బస్తీలో వెరైటీ ఫుడ్ అందించే ప్రాంతాల్లో రైడ్స్ వేస్తుంటాం. నగరం మీదుగా పర్యటించే బైకర్స్ గురించి తెలుసుకుని ఆహా్వనిస్తాం. పాతబస్తీ చరిత్రతో పాటు ఆహారాన్ని రుచిచూపిస్తాం. మళ్లీ మళ్లీ ఓల్డ్‌సిటీకి రావాలని అనిపిస్తుందంటారు. – రాహుల్.వాండరర్స్ క్లబ్ -
భార్యపై కోపంతో బార్లో కాల్పులు.. ఆరుగురి మృతి
కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. దక్షిణ కాలిఫోర్నియా ఆరెంజ్ కౌంటీలోని ప్రముఖ బైకర్స్ బార్లో బుధవారం రాత్రి రిటైర్డ్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే మరణించగా. మరో ఆరుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు. గాయపడిన ఆరుగురిని పోలీసులు చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా కుటుంబ వివాదాల కారణంతో నిందితుడి భార్య కొంతకాలంగా అతన్ని దూరం పెట్టినట్లు ఆరెంజ్ కౌంటీ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్యను లక్ష్యంగా చేసుకుని ట్రబుకో కాన్యన్‌లోని కార్నర్ బార్లో కాల్పులకు తెగబడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 11 మందిపై కాల్పులు జరగగా.. నిందితుడు సహా ఐదుగురు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: రష్యా: యెవ్గెనీ ప్రిగోజిన్ మృతిపై బైడెన్ షాకింగ్ కామెంట్స్ Mass shooting at a bikers bar in Orange County. A retired sheriff deputy was involved shoot his wife and nine other victims . He was killed in the shoot out, pic.twitter.com/Bh7PjYsWFW — Don Salmon (@dijoni) August 24, 2023 -
వావ్ వండరర్స్
15 ఏళ్ల క్రితం బైకర్స్ క్లబ్ అంటే హైదరాబాద్‌లో పెద్ద విశేషం. మరిప్పుడో... దాదాపు డజన్ పైగానే బైకర్స్ క్లబ్‌లు సిటీ వేదికగా దూసుకొచ్చేశాయి. ఈ వెల్లువకు ఊపిరి పోసింది బుల్లెట్ప్రియుల అభిరుచి. హాబీనే ఆధారంగా చేసుకొని రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్స్ స్థాపించిన ‘వాండరర్స్’ క్లబ్... దేశంలోనే అత్యధిక సంఖ్యలో సభ్యులు, అత్యంత క్రమశిక్షణ గల క్లబ్‌గా పేరొందింది. అంతే కాదు సామాజిక బాధ్యతలోనూ ‘రయ్’మంటూ దూసుకుపోతున్న ఈ క్లబ్ 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా క్లబ్ విశేషాల సమాహారం... - సాక్షి, హైదరాబాద్ డుడ్..డుడ్..డ్ శబ్దంతో అర కిలోమీటర్ దూరం నుంచే తన ఉనికిని చాటుతుంది. రోడ్డు మీదకు వెళ్లిందంటే అందరి కళ్లు తనపైకే లాగేస్తుంది. రాజసం, హుందాతనం, ఠీవి, అందం, దర్పం.. బైక్‌కి జతచేయడం అనేది మొదలు పెట్టిందే రాయల్ ఎన్ఫీల్డ్. ఒక బైక్ మనిషికి స్టేటస్ సింబల్‌గా మారడం మొదలైందీ దీనితోనే. అందుకే దీనికి అంత క్రేజ్. హైదరాబాద్ వేదికగా ఆవిర్భవించిన వాండరర్స్ క్లబ్‌కి ఈ క్రేజే ఆధారం. బైకర్స్.. మెసేంజర్స్ ఫన్, జాయ్‌ఫుల్‌గా గడిపేందుకే కాదు.. సామాజిక బాధ్యతగా రకరకాల సందేశాలనూ మోసుకుంటూ రైడ్స్ నిర్వహిస్తోందీ ఈ క్లబ్ . పొల్యూషన్, హెల్మెట్ అవేర్నెస్, సెల్యూట్ అవర్ ఆర్మీ, రక్తదానం, అనాథ పిల్లల కోసం రైడ్, హెరిటేజ్ రైడ్, పర్యావరణ పరిరక్షణ,.. ఇలా అనేక అంశాలను బేస్ చేసుకొని రైడ్లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సూసైడ్ దేనికీ పరిష్కారం కాదనే సందేశంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైడ్ చేస్తున్న సనా ఇక్బాల్ ఈ క్లబ్ సభ్యురాలే. అలాగే ప్రతినెల ఆర్టీఏ, షీటీమ్స్, ట్రాఫిక్ విభాగాలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి డిసెంబర్లో ‘నో యువర్ బైక్’ కార్యక్రమం నిర్వహిస్తారు. సభ్యత్వమిలా.. ఈ క్లబ్లో చేరడానికి ఎలాంటి ఫీజు లేదు. ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపితే.. సొంత రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం, డ్రైవింగ్ లెసైన్స్ పత్రాలను ధ్రువీకరించి రైడ్‌లో పాల్గొనేందుకు అవకాశమిస్తారు. మీటప్ అయినా, రైడింగైనా షూస్, హెల్మెట్ తప్పనిసరి. వాండరర్స్ గ్రూప్స్ అన్నింట్లోనూ ఒకే విధమైన నిబంధనలు పాటిస్తారు. వీరి ఫేస్బుక్ పేజీ ద్వారా బుల్లెట్‌కి సంబంధించిన సాంకేతిక విషయాలు, క్రయవిక్రయాలు, స్పేర్ పార్ట్స్ లభించే ప్రదేశాలు, మెకానిక్‌ల అడ్రస్‌లు.. ఇలా అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. పరుగు పద్నాలుగు.. హైదరాబాద్‌లో మొట్టమొదటి బైకర్స్ క్లబ్ ‘వాండరర్స్- బుల్లెటీర్స్ ఆఫ్ హైదరాబాద్’. 2002లో ఐదారుగురు సభ్యులతో మొదలైందీ క్లబ్. ప్రస్తుతం బీదర్, ఢిల్లీ, డెహ్రడూన్, నాందేడ్, లాతూర్, ముంబై, బెంగళూర్‌లో సైతం వాండరర్స్ గ్రూప్‌లున్నాయి. గ్రూప్‌గా బైక్ రైడింగ్‌లకు రెగ్యులర్‌గా వెళ్లడంతో మొదలై క్లబ్‌గా రూపాంతరం చెందామని గుర్తు చేసుకున్నారు దీని ఫౌండర్ లలిత్ జైన్. ‘అప్పట్లో డ్రంకన్ డ్రైవ్ ఎక్కువ. హెల్మెట్ పెట్టుకునే వాళ్లు కాదు. క్రమశిక్షణ తప్పనిసరని చెబితే కొంత మంది వెళ్లిపోయారు. రైడర్స్‌ను సివిలైజ్డ్ రైడర్స్‌గా మార్చేందుకు టైం పట్టింది. ఇప్పుడు ఇండియాలోనే క్రమశిక్షణ గల రైడర్స్ క్లబ్‌గా గుర్తింపు తెచ్చుకోవడం ఆనందంగా ఉందన్నా’రు లలిత్ జైన్. రైడ్ అంటే జోష్.. స్పీడ్ కాదు.. ‘రైడ్ అంటే జోష్. స్పీడ్ కాదు. హైవేల మీద 60-70 కి.మీ, సిటీలో అయితే 40-50 కి.మీ వేగం సరిపోతుంది. హైవేలపై 120 కి.మీ వేగంతో దూసుకు వెళ్లినప్పుడు ప్రమాదం జరిగితే ప్రాణాలతో బయటపడే అవకాశం తక్కువ. మాతో పాటు కాలేజ్ స్టూడెంట్స్‌ని రెగ్యులర్‌గా రైడ్‌కి తీసుకువెళ్తాం. హెల్మెట్ ప్రాధాన్యత, రోడ్ సేఫ్టీ, ర్యాష్ రైడింగ్, ఓవర్ స్పీడ్.. తదితర విషయాలు వాళ్లు ప్రాక్టికల్‌గా తెలుసుకుంటారు. నెలలో ఒక వారం కాలేజీ పిల్లలతో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నార’ని చెప్పారు రైడర్ అనిల్ కుమార్ రావూరి.