Orbit around the Earth
-
స్పేస్ఎక్స్: నలుగురు మనుషులు,కక్ష్యలో 3 రోజుల ప్రయాణం
అపరకుబేరుడు ఎలాన్ మస్క్ తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునే పనిలో పడ్డారు. స్పెస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో 'ఇన్స్పిరేషన్4' పేరుతో నలుగురిని కక్ష్య(orbit)లోకి పంపనున్నారు. అలా కక్ష్యలోకి వెళ్లిన ఆ నలుగురు మూడురోజుల పాటు ప్రయాణించి తిరిగి భూమిపైకి రానుడంగా ఈ స్పేస్ ప్రయాణానికి సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 15నే ప్రయాణం యుఎస్ ఎయిర్ ఫోర్స్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎయిర్ అండ్ స్పేస్ స్టడీస్ కు చెందిన స్ట్రాటజీ అండ్ సెక్యూరిటీ స్టడీస్ ప్రొఫెసర్ వెండి విట్మన్ కాబ్ ఆధ్వర్యంలో ఓ కాన్వర్జేషన్ జరుగుతుంది. ఈ కాన్వర్జేషన్ సందర్భంగా సెప్టెంబర్ 15న నలుగురు ప్రైవేట్ వ్యోమగాములు స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో ప్రైవేట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సాయంతో కక్ష్యలోకి వెళ్లేందుకు అంతరిక్ష ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారని అమెరికాకు చెందిన పైలెట్, షిప్ట్4 పేమెంట్ సంస్థ అధినేత ఐజాక్మన్ తెలిపారు. క్యాన్సర్ హాస్పిటల్ కోసమే ఐజాక్మన్ నేతృత్వంలో జరగనున్న అంతరిక్ష ప్రయాణంలో ఐజాక్మన్తో పాటు సియాన్ ప్రొక్టర్,హేలీ ఆర్సెనియాక్స్,క్రిస్టోఫర్ సెంబ్రోస్కీ లు ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొననున్నారు. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ క్యాన్సర్ రీసెర్చ్ హాస్పిటల్ ఫండింగ్ కోసమేనని తెలుస్తోంది. ఇక ఇప్పటికే స్పేస్ టూరిజంలో భాగంగా 2021,జులై 20న దిగ్గజ సంస్థ ఆమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్ష ప్రయాణం చేసిన విషయం తెలిసిందే. స్పేస్‌క్రాఫ్ట్ ‘న్యూ షెఫర్డ్’ సాయంతో వ్యోమ నౌకలో జెఫ్ బెజోస్‌తో పాటు అతని సోదరుడు మార్క్ బెజోస్, 82 ఏళ్ల వాలీ ఫంక్, 18 ఏళ్ల ఫిజిక్స్ విద్యార్థి ఆలివర్ డెమెన్ కలిసి ప్రయాణించారు. ఈ నలుగురు భూమి నుంచి సుమారు 100 కి.మీ.ల ఎత్తున ఉన్న కార్మన్ లైన్‌కు ఆవలికి తీసుకువెళ్లి సరిగ్గా 10 నిమిషాల తరువాత తిరిగి భూమిపైకి వచ్చారు. పోటాపోటీ ఎలాన్ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో నలుగురు కక్ష్యలోకి వెళ్లి 3 రోజుల పాటు ప్రయాణించి .. తిరిగి భూమిని చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. చదవండి: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్రం శుభవార్త -
ఎలుకల కోసం బోను
మనం ఇంతవరకూ ఎలుకలను పట్టుకునేందుకు ఉపయోగపడే ఎలుకల బోనులనే చూశాం. కానీ ఈ బోను ఎలుకలను పట్టుకునేందుకు కాదు.. అవి నివసించేందుకు! భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో వ్యోమగాములతో పాటు నివసించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 10 ఎలుకలను వచ్చే ఆగస్టులో అక్కడికి పంపనుంది. అందుకే అవి ఐఎస్ఎస్కు సురక్షితంగా చేరడంతోపాటు అక్కడ నివసించేందుకూ ఉపయోగపడేలా ఈ హైటెక్ బోనును కాలిఫోర్నియాలోని నాసా ఏఎంఈఎస్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఎలుకలకు కావలసిన ఆహారం, నీరు, తాజా గాలి వంటి వన్నీ ఇందులో ఉంచుతారు. వాటిని పర్యవేక్షించేందుకు విజువల్/ఇన్ఫ్రారెడ్ వీడియో సిస్టమ్ ఈ బోనులో ఉంది. అయితే వీటిని ఏదో సరదా కోసం అక్కడికి పంపడం లేదు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేమి వల్ల వ్యోమగాములు కండరాల ద్రవ్యరాశి తగ్గిపోవడం, ఎముకలు, ప్రత్యుత్పత్తి, వ్యాధినిరోధక వ్యవస్థలు బలహీనపడిపోవడం, గుండె, నాడీ సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. జీరో గ్రావిటీలో ఎలుకలను ఉంచి, వాటి శరీరంలో ఆరోగ్యపరంగా వచ్చే మార్పులను, ఆయా సమస్యల నివారణకు పరిష్కారాలను కనుగొనేందుకే నాసా వీటిని రోద సికి పంపుతోందన్నమాట.