osamabin laden
-
వార్నీ.. మంచం కింద ఇంత పెద్ద సొరంగమా..!
సాధారణంగా పాత సినిమాలు, పురాతన కథల్లో సొరంగ మార్గాల గురించి చదవడం, చూడటం చేశాం. శత్రువులు దాడి చేసినప్పుడు తప్పించుకోవడం కోసం, వేరే రక్షణ చర్యల్లో భాగంగా రాజుల కాలంలో ఇలా సొరంగాలను ఏర్పాటు చేసుకునేవారు. ఇక ప్రస్తుత కాలంలో కూడా అప్పుడప్పుడు.. అక్కడక్కడ ఈ సొరంగ మార్గాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది. ఇక్కడ ఓ వ్యక్తి ఏకంగా తన బెడ్ కింద నుంచి ఓ కిలోమీటర్ పొడవు సొరంగం తవ్వాడు. వీడియో చూసినవారు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు. ఓ వ్యక్తి బెడ్ని తెరవడంతో వీడియో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత మెట్లు, అలా ఓ మార్గం కనిపిస్తుంది. ఇక లోపలంతా పచ్చని లైట్ ఉండి.. సొరంగంలోని దృశ్యాలను చూపిస్తాయి. ఇది చూసిన నెటిజనులు ‘‘ఒసామా బిన్ లాడెన్ దాక్కున్న సొరంగం ఇదేనా ఏంటి’’.. ‘‘ఈ వీడియోని చూస్తే.. ఒళ్లు గగుర్పొడుస్తుంది.. సైకిక్ ప్యాలేస్గా ఉంది’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: రూ.90 లక్షల ప్లాట్ కొని.. సొరంగం తవ్వి! -
వైరల్ వీడియో: వార్ని.. మంచం కింద ఇంత పెద్ద సొరంగమా..!
-
'బిన్ లాడెన్' పోలీసుపై వేటు
'అచ్చం అల్ కాయిదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ లా ఉన్నావ్' అని తనను అవమానించిన అధికారిపై కోర్టుకు వెళ్లి, భారీ నష్టపరిహారాన్ని పొందిన వెస్ట్ మిడ్ లాండ్ పోలీసు పీ.సీ.తారీఖ్ దోస్త్ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఓ క్రిమినల్ కేసులో సాక్షులను బెదిరించారనే ఆరోపణలు రుజువుకావడంతో సర్వీసు నుంచి డిస్మిస్ అయ్యారు. వెస్ట్ లాండ్ పోలీసు విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేస్తోన్న తారీఖ్.. ఒక క్రిమినల్ కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులను బెదిరించారని, మరో చిన్నారిని భయభ్రాంతులకు గురిచేశారని కేసు నమోదయింది. దీనిని విచారించిన బర్మింగ్ హమ్ మెజిస్ట్రేట్ కోర్టు.. మంగళవారం తుది తీర్పును వెలువరిస్తూ తారీఖ్ ను దోషిగా నిర్ధారించింది. సెప్టెంబర్ 16న శిక్ష ఖరారుకానుంది. కోర్టు తీర్పు వెలువడిన కొద్దిసేపటికే తారీఖ్ ను డిస్మిస్ చేస్తున్నట్లు పోలీసు శాఖ ప్రకటించింది. తాను ఒసామాలా ఉన్నానని అధికారి అన్నట్లు ఫిర్యాదుచేసి 2009లో మొదటిసారి వార్తల్లోకి వచ్చిన తారీఖ్ అప్పటి నుంచి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ వార్తల్లోని వ్యక్తిగా ఉన్నారు. చివరికిప్పుడు బెదిరింపుల ఆరోపణల్లో ఇరుక్కుని ఉద్యోగం పోగొట్టుకున్నారు.