Oscar jury
-
సెక్స్ స్కాండల్.. షాక్ మీద షాక్
సాక్షి : హాలీవుడ్లో ప్రకంపనలు రేపుతున్న హర్వే వెయిన్‌స్టెన్ లైంగిక వేధింపుల ఆరోపణ పర్వం తారాస్థాయికి చేరుకుంది. మూవీ మొఘల్పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో సోషల్ మీడియాలో ఉద్యమం ఊపందుకుంది . తనకేం పాపం తెలీదని హర్వే బుకాయిస్తున్ననప్పటికీ.. వరుసబెట్టి నటీమణులు ఆయన వ్యవహారాలను వెలుగులోకి తెస్తుండటంతో ఆ సీనియర్ మేకర్ చుట్టూ గట్టి ఉచ్చు బిగుస్తోంది. ఇది చాలదన్నట్లు వరుసగా షాక్‌ల మీద షాకులు హర్వేకు తగులుతున్నాయి. ఆస్కార్ కమిటీ నుంచి అతన్ని వెలివేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. హామ్ హంక్స్, వూపి గోల్డ్బర్గ్, స్టీవెన్ స్పీల్ బర్గ్ వంటి దిగ్గజాలు ఉన్న 54 మందితో కూడిన ఆస్కార్ కమిటీ శనివారం ఓ ప్రకటన వెలువరించింది. ‘ హర్వేపై గత కొన్ని రోజులుగా లైంగిక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటి వారి వల్ల ఇండస్ట్రీ మొత్తానికి చెడ్డపేరు వచ్చి పడుతోంది. అందుకే ఆయనను కొనసాగించటం మంచిది కాదనే నిర్ణయానికి వచ్చాం. ఇది మిగతా వారికి ఓ గుణపాఠం కావాలి’ అని సంయుక్త ప్రకటనను విడుదల చేసింది. దీనిని న్యూయార్క్ టైమ్స్ పత్రిక అధికారికంగా ధృవీకరించింది. హర్వే అకాడమీ మోషన్ పిక్చర్ ఆర్ట్స్అండ్ సైన్సెస్ కమిటీ సభ్యుడిగా ఉండేవాడు. కాగా, హర్వే యవ్వారాలు వెలుగులోకి వస్తుండటంతో అతన్ని వెయిన్‌స్టెన్ కంపెనీ నుంచి వెలివేస్తున్నట్లు సోదరుడు బాబ్ వెయిస్టెన్ ప్రకటించాడు. తన సోదరుడు ఓ మృగమంటూ బాబ్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో హర్వే ఆరోపణల నేపథ్యంలో వెయిన్‌స్టెన్ కంపెనీని అమ్మబోతున్నట్లు వస్తున్న వార్తలను బాబ్ కొట్టి పడేశారు. హీరోయిన్ సోఫీ దీక్ష్తో హర్వే అకృత్యాలను వెలుగులోకి తీసుకురాగా.. అప్పటి నుంచి ఒక్కో హీరోయిన్ తమకు ఎదురైన అనుభవాల గురించి వివరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. -
ఆస్కార్ రేసు భారత చిత్రాల ఎంపిక జ్యూరీలో ఇద్దరు తెలుగు దర్శకులు
టాలీవుడ్‌కు సమున్నత గౌరవం దక్కింది. ఈసారి ఉత్తమ విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్ రేసులోకి వెళ్లే చిత్రాలను ఎంపిక చేసే జ్యూరీలోకి ఇద్దరు తెలుగు దర్శకులను తీసుకున్నారు. మొత్తం 12 మంది సభ్యులుండే ఈ జ్యూరీలో ఎన్.శంకర్, సి.వి. రెడ్డి సభ్యులుగా ఉండబోతున్నారు. ''ఇది మాకు చాలా గౌరవం. నామినేషన్ కోసం వచ్చే సినిమాలన్నింటినీ చూసి ఆనందించాలని నేను చాలాకాలం నుంచి అనుకుంటున్నా'' అని ఎన్. శంకర్ తెలిపారు. జైబోలో తెలంగాణ, జయం మనదేరా లాంటి చిత్రాలతో ఆయన ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు స్క్రీనింగ్ కోసం 15 సినిమాలను షార్ట్ లిస్ట్ చేశారు. వాటిని ఈనెల 17 నుంచి 22 వరకు ప్రదర్శిస్తారు. ఈసారి రెండు తెలుగు సినిమాలు 'మిథునం', 'శ్రీ జగద్గురు ఆది శంకర' కూడా నామినేషన్లు పొందిన విషయం తెలిసిందే. గతంలో 'పెళ్లిగోల', 'అమ్మా నాన్న కావాలి', 'మధుమతి' లాంటి చిత్రాలు తీసిన సీనియర్ దర్శకుడు సి.వి.రెడ్డి కూడా ఈ జ్యూరీలో సభ్యునిగా ఎంపికయ్యాఉ. ఆయన గతంలోనూ ఇండియన్ పనోరమా విభాగంలో సభ్యునిగా ఉన్నారు.