Outlander
-
ఆ కారు ధర భారీగా తగ్గింది..
సాక్షి, న్యూఢిల్లీ : గత ఏడాది లాంఛ్ అయిన మిట్సుబిషి అవుట్ల్యాండర్ ఎస్యూవీ ధర భారత్‌లో భారీగా తగ్గింది. అవుట్ల్యాండర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ రూ 31.95 లక్షలు కాగా ప్రస్తుతం భారత్‌లో ఇది రూ 26.93 లక్షలకే అందుబాటులో ఉంది. రూ 5 లక్షల వరకూ ధర తగ్గిన ఈ ఎస్యూవీ మరికొన్ని అత్యాధునిక ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. న్యూ 7 ఇంచ్ టచ్‌స్ర్కీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్ వంటి పలు ఫీచర్లను ఈ వెహికల్లో కంపెనీ జోడించింది. ఇక డ్యూయల్ జోన్ పూర్తి ఆటోమేటిక్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, ఇంజన్ పుష్ బటన్ స్టార్ట్, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ర్టిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ర్టానిక్ పవర్‌స్టీరింగ్ వంటి ఇతర ఫీచర్లను న్యూ మోడల్లోనూ జోడించారు. ఇక సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే డ్రైవర్‌తో పాటు ప్రయాణీకులను కవర్ చేసేలా ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, యాక్టివ్ స్టెబిలిటీ కంట్రోల్, సెక్యూరిటీ అలారం వ్యవస్థ, బ్రేక్ అసిస్ట్ సిస్టం వంటి పలు ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో పొందుపరిచారు. -
ఆకర్షణీయమైన ప్రీమియం ‘అవుట్‌లాండర్’
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ సంస్థ మిత్సుబిషి నుంచి భారత మార్కెట్లోకి ప్రీమియం విభాగానికి చెందిన ఎస్యూవీ ‘అవుట్‌లాండర్’ విడుదలైంది. భారత్‌లో ఈ సంస్థకు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న హిందుస్తాన్ మోటార్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఎంఎఫ్‌సీఎల్) బుధవారం దీన్నిక్కడ విడుదలచేసింది. 4–వీల్ డైవ్, సీవీటీ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్, సెవెన్ సీటర్ కలిగిన ఈ నూతన వెర్షన్ అవుట్‌లాండర్ ధరను రూ.31.95 లక్షలుగా నిర్ణయించినట్లు సంస్థ ప్రకటించింది. 2.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారులో ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఆపరేషన్ వ్యవస్థ వంటి అనేక అధునాతన ఫీచర్లు ఉన్నట్లు తెలిపింది. ఈ నూతన కారు ప్రీమియం విభాగంలోనే బెంచి మార్కుగా నిలుస్తుందని విశ్వసిస్తున్నట్లు హెచ్‌ఎంఎఫ్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉత్తమ్ బోస్ అన్నారు. -
ఈ ఏడాదే భారత్‌కు మాంటెరో
వచ్చే ఏడాది ఔట్‌ల్యాండర్ హిందుస్తాన్ మోటార్స్ సీఈవో విజయన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌కు చిన్న కార్లను తీసుకొచ్చే ఆలోచనేదీ లేదని హిందుస్తాన్ మోటార్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఈవో పి.విజయన్ తెలిపారు. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలపైనే (ఎస్యూవీ) ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నామని పేర్కొ న్నారు. ఇక్కడి బంజారాహిల్స్‌లో మిత్సుబిషి షోరూంను ప్రారంభించిన సందర్భంగా ప్రైడ్ మిత్సుబిషి ఎండీ ఎం.సురేష్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏటా 28-30 వేల వాహనాలు అమ్ముడవుతున్న స్పోర్ట్స్ యుటిలిటీ-4 విభాగంలో మిత్సుబిషి పజెరో స్పోర్ట్స్ ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకుందని, ఏటా దేశీయంగా 3 వేల యూనిట్లు విక్రయిస్తున్నట్టు తెలిపారు. హిందుస్తాన్ మోటార్స్, మిత్సుబిషి మధ్య సాంకేతిక, మార్కెటింగ్ ఒప్పందం ఉంది. మరో రెండు మోడళ్లు..: హిందుస్తాన్ మోటార్స్ మిత్సుబిషికి చెందిన మాంటెరో, ఔట్‌ల్యాండర్ మోడళ్లను భారత్‌లో తిరిగి ప్రవేశపెడుతోంది. మాంటెరో ఈ ఏడాదే మార్కెట్లోకి రానుంది. దీని ధర రూ.60 లక్షల వరకు ఉండొచ్చని విజయన్ తెలిపారు. ఇక వచ్చే ఏడాది జూన్‌కల్లా ఔట్‌ల్యాండర్‌ను డీజిల్, పెట్రోల్ వర్షన్లలో ప్రవేశపెడతాం. దీని ధర రూ.25 లక్షలుండొచ్చని పేర్కొన్నారు.