ఆకర్షణీయమైన ప్రీమియం ‘అవుట్‌లాండర్‌’ | 2018 Canadians embrace Mitsubishi Outlander Mitsubishi | Sakshi
Sakshi News home page

ఆకర్షణీయమైన ప్రీమియం ‘అవుట్‌లాండర్‌’

Published Thu, Aug 23 2018 2:36 AM | Last Updated on Thu, Aug 23 2018 2:36 AM

2018 Canadians embrace Mitsubishi Outlander Mitsubishi - Sakshi

న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ఆటోమొబైల్‌ సంస్థ మిత్సుబిషి నుంచి భారత మార్కెట్‌లోకి ప్రీమియం విభాగానికి చెందిన ఎస్‌యూవీ ‘అవుట్‌లాండర్‌’ విడుదలైంది. భారత్‌లో ఈ సంస్థకు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న హిందుస్తాన్‌ మోటార్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఎఫ్‌సీఎల్‌) బుధవారం దీన్నిక్కడ విడుదలచేసింది.

4–వీల్‌ డైవ్, సీవీటీ ఆటోమెటిక్‌ ట్రాన్స్‌మిషన్, సెవెన్‌ సీటర్‌ కలిగిన ఈ నూతన వెర్షన్‌ అవుట్‌లాండర్‌ ధరను రూ.31.95 లక్షలుగా నిర్ణయించినట్లు సంస్థ ప్రకటించింది. 2.4 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ కారులో ఆటో హోల్డ్‌ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రిక్‌ పార్కింగ్‌ బ్రేక్, కీలెస్‌ ఆపరేషన్‌ వ్యవస్థ వంటి అనేక అధునాతన ఫీచర్లు ఉన్నట్లు తెలిపింది. ఈ నూతన కారు ప్రీమియం విభాగంలోనే బెంచి మార్కుగా నిలుస్తుందని విశ్వసిస్తున్నట్లు హెచ్‌ఎంఎఫ్‌సీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఉత్తమ్‌ బోస్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement