Mitsubishi Motors
-
ఆ కారు ధర భారీగా తగ్గింది..
సాక్షి, న్యూఢిల్లీ : గత ఏడాది లాంఛ్ అయిన మిట్సుబిషి అవుట్ల్యాండర్ ఎస్యూవీ ధర భారత్‌లో భారీగా తగ్గింది. అవుట్ల్యాండర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ రూ 31.95 లక్షలు కాగా ప్రస్తుతం భారత్‌లో ఇది రూ 26.93 లక్షలకే అందుబాటులో ఉంది. రూ 5 లక్షల వరకూ ధర తగ్గిన ఈ ఎస్యూవీ మరికొన్ని అత్యాధునిక ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. న్యూ 7 ఇంచ్ టచ్‌స్ర్కీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్ వంటి పలు ఫీచర్లను ఈ వెహికల్లో కంపెనీ జోడించింది. ఇక డ్యూయల్ జోన్ పూర్తి ఆటోమేటిక్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, ఇంజన్ పుష్ బటన్ స్టార్ట్, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ర్టిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ర్టానిక్ పవర్‌స్టీరింగ్ వంటి ఇతర ఫీచర్లను న్యూ మోడల్లోనూ జోడించారు. ఇక సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే డ్రైవర్‌తో పాటు ప్రయాణీకులను కవర్ చేసేలా ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, యాక్టివ్ స్టెబిలిటీ కంట్రోల్, సెక్యూరిటీ అలారం వ్యవస్థ, బ్రేక్ అసిస్ట్ సిస్టం వంటి పలు ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో పొందుపరిచారు. -
ఆకర్షణీయమైన ప్రీమియం ‘అవుట్‌లాండర్’
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ సంస్థ మిత్సుబిషి నుంచి భారత మార్కెట్లోకి ప్రీమియం విభాగానికి చెందిన ఎస్యూవీ ‘అవుట్‌లాండర్’ విడుదలైంది. భారత్‌లో ఈ సంస్థకు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న హిందుస్తాన్ మోటార్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఎంఎఫ్‌సీఎల్) బుధవారం దీన్నిక్కడ విడుదలచేసింది. 4–వీల్ డైవ్, సీవీటీ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్, సెవెన్ సీటర్ కలిగిన ఈ నూతన వెర్షన్ అవుట్‌లాండర్ ధరను రూ.31.95 లక్షలుగా నిర్ణయించినట్లు సంస్థ ప్రకటించింది. 2.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారులో ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఆపరేషన్ వ్యవస్థ వంటి అనేక అధునాతన ఫీచర్లు ఉన్నట్లు తెలిపింది. ఈ నూతన కారు ప్రీమియం విభాగంలోనే బెంచి మార్కుగా నిలుస్తుందని విశ్వసిస్తున్నట్లు హెచ్‌ఎంఎఫ్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉత్తమ్ బోస్ అన్నారు. -
దిగ్గజ కంపెనీ భారీ కుంభకోణం!
టోక్యో: కంపెనీకి చెందిన కార్ల కుంభకోణంలో తలెత్తిన ఆరోపణలతో జపాన్ ఆటో మొబైల్ దిగ్గజ సంస్థ మిత్సుబిషి మోటార్స్ ప్రెసిడెంట్ టెస్టురో ఐకావా రాజీనామా చేయనున్నాడు. ఫ్యూయల్ ఎకానమీ డాటా స్కామ్ వల్ల కంపెనీకి చెందిన 4 రకాల మినీ కార్ల విషయంలో భారీ అవకతవకలు జరిగాయన్ విషయం తెలిసిందే. ఐకావా రాజీనామా చేయనున్నట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. కంపెనీ సీఈవో ఒసాము మసుకో తాత్కాలికంగా ప్రెసిడెంట్ బాధ్యతలను నిర్వహించనున్నాడు. గత వారమే డైరెక్టర్లు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఫ్యూయల్ వివరాలు వెల్లడిలో కంపెనీ భారీ మోసాలకు పాల్పడడంతో గత కొన్ని రోజుల నుంచి ఈ కంపెనీపై కుంభకోణం ఆరోపణలు వస్తున్నాయి. దర్యాప్తు ప్రాథమిక నివేదికలో కుంభకోణం జరిగినట్లు రుజువైంది. జపాన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ నిస్సాన్ మోటార్స్ 34 శాతం వాటాను 200 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసి మిత్సుబిషిలో అతిపెద్ద వాటాదారుగా మారనుంది. 660 క్యూబిక్ సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండే ఇంజిన్లున్న 6.25 లక్షల మినీ వెహికల్స్ ఇంధన వినియోగం వివరాలలో లెక్కలు తారుమారయ్యాయి. ఈ కార్లను జపాన్ మార్కెట్లోనే విక్రయించారు. ఇంధనం విషయంపై పలు ఆరోపణలు రావడంతో ఇన్వెస్టిగేషన్ చేయగా, మరికొన్ని రకాల మోడల్ కార్లకు ఇలాంటి రకమైన ఇంజిన్లనే అమర్చినట్లు తేలింది. ప్రొడక్టల్ మేనేజ్ మెంట్ విభాగంలో కెరీర్ మొదలుపెట్టిన ఐకావా, ఆ తర్వాత డాటా మనిపులేషన్ యూనిట్ కు చీఫ్ గా బాధ్యతలు చేపట్టాడు. నేడు ఆ కంపెనీ జపాన్ రవాణాశాఖకు తమ నూతన నివేదిక అందించనుంది. పూర్తిస్థాయి నివేదిక అందితే ఐకావా ఆ సంస్థ నుంచి ఎలాంటి సంబంధాలు లేకుండా మిస్టుబిషి మోటార్స్ నుంచి తప్పుకుంటాడు. -
తప్పు ఒప్పుకున్న కంపెనీ...విస్తృత దాడులు
టోక్యో: జర్మనీకి చెందిన కార్ల కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ కుంభకోణం తరహాలో మరో కార్ల కంపెనీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో జపాన్ కు చెందిన మిత్సుబిషి మోటార్స్ కంపెనీ ఫ్యుయల్ ఎకానమీ డాటా విడుదలలో అక్రమాలకు పాల్పడినట్టు ఒప్పుకుంది. తప్పుడు నివేదికలు అందించినట్లు ఆ కంపెనీ అంగీకరించింది. ఈ వ్యవహారంపై స్పందించిన జపాన్ అధికారులు దాడులు నిర్వహించారు. ఒకజాకి నగరంలో ఉన్న ఆ కంపెనీ ప్రధాన ప్లాంట్‌లో గురువారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వాహన మైలేజ్ అంశంలో డేటాను తమ ఉద్యోగులు మార్చినట్లు మిత్సుబిషి సంస్థ అంగీకరించింది. సుమారు 60వేల వాహనాలకు అలా చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. దీంతో ఈ వ్యవహారాన్ని చాలా తీవ్రమైన కేసుగా పరిగణిస్తున్నామని ప్రభుత్వాధికారులు తెలిపారు. మైలేజ్ టెస్టింగ్‌లో చూపించిన తప్పుడు రిపోర్టులకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని కంపెనీని సూచించారు. ఏప్రిల్ 27వ తేదీలోగా పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అయితే సోదాల ద్వారా వెల్లడైన వాస్తవాలను పరిశీలించిన తర్వాత మొత్తం ఎన్ని వాహనాలకు తప్పుడు నివేదికలు ఇచ్చారో స్పష్టం చేయనున్నట్లు ఆ దేశ క్యాబినెట్ సెక్రటరీ తెలిపారు. కార్ల భద్రత కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.