Outsourcing Companies
-
ఔట్సోర్సింగ్ కార్పొరేషన్‌ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఏపీ ఔట్సోర్సింగ్ కార్పొరేషన్‌ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్సోర్స్డ్ ఎంప్లాయిస్ (ఏపీ ఆప్కాస్) వెబ్‌సైట్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు ప్లేస్మెంట్ ఆర్డర్ ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రతి ఔట్సోర్సింగ్ ఉద్యోగానికి కోడ్ నెంబర్ ఉంటుందని, ప్రతి కాంట్రాక్టును ఒక ఎంటీటీగా తీసుకోవాలని సీఎం సూచించారు. మధ్యవర్తులు లేకుండా ఉద్యోగులకు మేలు జరిగేందుకు ఔట్సోర్సింగ్ కార్పొరేషన్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కార్పొరేషన్ పరిధిలోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం వెల్లడించారు. లంచాలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండకూదని చెప్పారు. లంచాలు, మోసాలకు తావులేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇక ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి 50శాతం కల్పిస్టున్నట్టు సీఎం తెలిపారు. జిల్లాస్థాయిలో యాభైశాతం ఉద్యోగాలు మహిళలకే ఇవ్వాలని స్పష్టం చేశారు. సకాలంలో జీతాలు వచ్చేలా చూసేందుకు ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. డిసెంబర్ 15 కల్లా ఉద్యోగాల జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఇంచార్జి మంత్రి అప్రూవల్ అథారిటీగా ఉంటారని, జిల్లా కమిటీకి ఆయా కలెక్టర్లు నేతృత్వం వహిస్తారని తెలిపారు. -
‘హెచ్1బీ దుర్వినియోగాన్ని అడ్డుకోండి’
వాషింగ్టన్: అమెరికాలోని ఔట్సోర్సింగ్ కంపెనీలు హెచ్1బీ, ఎల్1 వీసాలను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవాలని ఆ దేశ చట్టసభల ప్రతినిధుల బృందం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కోరింది. ఈ మేరకు కాంగ్రెస్ సభ్యుల బృందం ట్రంప్‌కు లేఖ రాసింది. ఔట్సోర్సింగ్ సంస్థలు స్థానికులకు బదులుగా విదేశీ ఉద్యోగులను చౌకగా అమెరికాకు తరలిస్తున్నాయని ఆరోపించింది. అమెరికన్ల ప్రయోజనాలను రక్షించేందుకు బిల్లును ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. ఉద్యోగాల భర్తీ సమయంలో స్థానికులకే ప్రాధాన్యమివ్వడంతోపాటు అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించి మరొకరికి కట్టబెట్టడాన్ని ఈ బిల్లు నిషేధిస్తుందని తెలిపింది. 50 మంది కంటే ఎక్కువ ఉద్యోగులున్న అమెరికన్ ఔట్సోర్సింగ్ సంస్థల్లో 50% కంటే ఎక్కువ మంది హెచ్1బీ, ఎల్1 ఉద్యోగులుంటే కొత్తగా విదేశీయులను నియమించుకోవడాన్ని ఈ బిల్లు నిషేధిస్తుందని వెల్లడించింది. -
భారత ఐటీ ఉద్యోగులకు మరో షాక్!
హెచ్1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం అక్కడ వర్సిటీల్లో చదివినవారికే ప్రాధాన్యం వాషింగ్టన్: అమెరికా భారత ఐటీ వర్గాలకు మరో షాకివ్వనుంది. హెచ్1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ కీలక బిల్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి చట్టబద్ధత తెచ్చే దిశగా సెనేటర్లు చుక్ గ్రాస్లే, డిక్ డర్బన్ సన్నాహాలు చేస్తున్నారు. దీని ప్రకారం అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదివిన విదేశీయులకే హెచ్1బీ వీసాల జారీలో తొలి ప్రాధాన్యం ఇస్తారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పట్టభద్రులు, అధిక వేతనం పొందే నిపుణులకు కూడా అవకాశం ఇస్తారు. ‘అమెరికాలో అత్యున్నత స్థాయి శ్రామిక శక్తిని నింపడానికే ఈ ప్రతిపాదన. దురదృష్టవశాత్తూ ఇక్కడి కంపెనీలు అమెరికన్లను కాదని తక్కువ వేతనానికి వస్తున్న విదేశీయులను తెచ్చుకొంటున్నాయి. విదేశీ నిపుణుల కోసం బయటి ఉద్యోగుల కంటే ఇక్కడ చదివిన వారికే మొదట అవకాశం కల్పిస్తాం’అని సెనేటర్లు వెల్లడించారు. అలాగే 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ఔట్‌సోర్స్ కంపెనీలు అదనంగా హెచ్1బీ/ఎల్1 వీసాలున్నవారిని నియమించుకోవడానికి కూడా నిబంధనలు అనుమతించవు.