overaction.
-
బ్రో సినిమాలో పవన్ ఫ్యాన్స్ రచ్చ
-
కుసంస్కారం: టీడీపీ పిచ్చి పరాకాష్టకు..
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రచార పిచ్చి పరాకాష్టకు చేరింది. ఆ పార్టీ నేతలు మరోమారు తమ కుసంస్కారాన్ని బయట పెట్టారు. ఏ అంశాన్ని రాజకీయం చేయాలో, ఏది చేయకూడదో అన్న విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయారు. రెండురోజుల క్రితం భార్యాభర్తలు మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో జరిగిన శుభకార్యానికి హాజరై తిరిగి సత్తెనపల్లి వెళ్తుండగా కొందరు దుండగులు వారిని అడ్డగించి పొలాల్లోకి లాక్కుని వెళ్లి భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై లైంగిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. (చదవండి: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం?) ఈ ఘటన జరిగిన వెంటనే సత్తెనపల్లితోపాటు మేడికొండూరు పోలీసులు స్పందించారు. ఆరు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది మందికిపైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలు షాక్లో ఉండటంతో ఇప్పటి వరకూ ఆమెను విచారణ చేయలేదు. ఆమె భర్త చెబుతున్న వివరాల ఆధారంగానే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే దీన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని తెలుగుదేశం నాయకులు శనివారం ప్రభుత్వాస్పత్రి ముందు హడావుడి చేశారు ►ఇటీవల బీటెక్ విద్యార్థిని రమ్య హత్య జరిగినప్పుడు కూడా తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బృందం చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. లోకేష్ రావడం ఆలస్యం కావడంతో అప్పటి వరకూ మృతదేహాన్ని తీసుకు వెళ్లనీయకుండా అడ్డం పడటం, ఆ తర్వాత రమ్య ఇంటి వద్ద లోకేష్ బృందం చేసిన హడావుడి, గందరగోళం వారి కుసంస్కారాన్ని బయటపెట్టింది. ►ఏడు నెలల క్రితం హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించే పేరుతో రెండురోజుల క్రితం మరో నాటకానికి లోకేష్ తెరతీశారు. గురువారం నరసరావుపేట వచ్చి అనూష కుటుంబాన్ని పరామర్శించి ధర్నా చేయాలని నిర్ణయించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో ట్రయల్ ప్రారంభమయ్యే సమయంలో లోకేష్ రాజకీయం చేయడంపై ప్రజల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. సాటి మహిళ బాధను అర్థం చేసుకోకుండా.. తాజాగా మేడికొండూరు ఘటనపైనా తెలుగుదేశం మహిళా నేతలు అత్సుత్సాహం ప్రదర్శించారు. సాటి మహిళ బాధను అర్థం చేసుకోకుండా సంస్కారహీనంగా ప్రవర్తించారు. శనివారం తెలుగుదేశం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వేగుంట రాణి, ప్రధాన కార్యదర్శి షేక్ ఆషా, ఇతర నాయకులు పద్మ, వినీల, గుడిపల్లి వాణి కొంతమంది అనుచరులతో జీజీహెచ్లో బాధితురాలు ఉన్న వార్డు వద్దకు మీడియాను వెంటేసుకుని వచ్చారు. అసలే జరిగిన ఘోరంతో తీవ్ర వేదనలో ఉన్న బాధితురాలిని కలవాల్సిందేనంటూ పట్టుబట్టారు. బాధితురాలు తనను ఎవరైనా పరామర్శించాడానికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని తెగేసి చెప్పడంతో ఆస్పత్రి సిబ్బంది టీడీపీ నేతలను అనుమతించలేదు. సూపరింటెండెంట్ ఎంత నచ్చజెప్పినా వారు వినలేదు. అక్కడే కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లైంగికదాడి కేసుల్లో బాధితుల పేర్లు కూడా ప్రస్తావించకూడ దు. కానీ టీడీపీ నేతలు మీడియాతో వచ్చి ప్రభుత్వాస్పత్రి వద్ద ధర్నాకు దిగడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గోప్యత అవసరం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధితురాలి వివరాలు గోప్యంగా ఉంచడం పరిపాటి. ఈ కేసులోనూ పోలీసులు అదే పాటించారు. సమాజంలో మహిళలకు ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ‘దిశ’ మహిళలకు రక్షాబంధన్ లాంటిది. టీడీపీ నేతలు కావాలని ప్రభుత్వంపై బురదజల్లే యత్నాలు చేస్తున్నారు. ఏపీ పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారు. ఏదో ఒక ఘటనను అడ్డుపెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని టీడీపీ యత్నించడం సరి కాదు. ఆ పార్టీ నేతలు విజ్ఞతతో ఆలోచించాలి. – చెన్నంశెట్టి చక్రపాణి, రిటైర్డ్ ఎస్పీ చదవండి: రమ్య కుటుంబానికి ఐదు సెంట్ల ఇంటి స్థలం -
బాస్ డైరెక్షన్.. పోలీస్ యాక్షన్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఎన్నికల కోడ్ రాకముందే పోలీసు పాలన మొదలైంది. ఇటీవల సర్వేల పేరుతో అనేక బృందాలు జిల్లాలో తిరుగుతుండటంతో అలజడి రేగింది. ఈక్రమంలో గురువారం కూడా బెంగళూరుకు చెందిన పబ్లిక్ పాలసీ రీసెర్చ్ గ్రూప్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సర్వే నిర్వహిస్తోంది. అది కూడా వైఎస్సార్సీపీ నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి సమీపంలోనే సర్వే నిర్వహించి ప్రజల వివరాలను ట్యాబ్లో నమోదు చేసుకుంటున్నారు. సర్వే వ్యవహారంపై అనుమానం వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొందరు వీరిని ప్రశ్నించి వేదాయపాళెం పోలీసుస్టేషన్లో అప్పగించి వారిపై అనుమానంతో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వారిని విచారించకముందే ఇంటెలిజెన్స్ డీఎస్పీ చెంచుబాబు నుంచి ఫోన్లు మొదలయ్యాయి. సర్వే టీమ్లోని సభ్యులకు ఆయన నంబర్ నుంచి కూడా ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో పోలీస్స్టేషన్లో పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. సర్వే టీమ్ నుంచి ఫిర్యాదు తీసుకొని ఆగమేఘాల మీద వైఎస్సార్సీపీ కార్యకర్తలపై సీఐ నరసింహారావు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పోలీస్ స్టేషన్కు చేరుకుని సీఐతో మాట్లాడితే సాయంత్రం స్టేషన్ బెయిల్ ఇస్తామని చెప్పారు. మళ్లీ సాయంత్రం తర్వాత ఫోన్ చేసి స్టేషన్కు వెళ్లితే 7 గంటలకు అరెస్ట్ చూపి కోర్టుకు హాజరు పరుస్తామని చెప్పారు. ఆ తర్వాత రాత్రి 12 గంటల వరకు పోలీసులు స్పందిచకపోవటంతో ఎమ్మెల్యే స్టేషన్కు వెళ్లి సీఐ తీరును ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన వారికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ఎదుట హాజరుపర్చకుండా ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో రాత్రి 1గంటల సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించి మళ్లీ స్టేషన్కు తెచ్చారు. వాస్తవానికి ఎలాంటి తప్పు చేయనప్పటికీ పోలీస్ అధికారుల ఒత్తిడితో కేసులు నమోదు చేసి దాని కొనసాగింపుగా స్టేషన్లో ఉంచటంపై ఎమ్మెల్యే ఎన్నికల సంఘానికి పూర్తి ఆధారాలతో సీఐ నరసింహరావుపై ఫిర్యాదు చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యేకు నష్టం చేకూర్చేలా ప్రచారం అధికార పార్టీ నేతలు తెరతీసి నీచ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఇంటెలిజెన్స్ డీఎస్పీకి ఏం సంబంధం జిల్లాలో స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ విభాగాలు పూర్తిగా అధికారపార్టీ అనుకూలంగా పనిచేస్తున్నాయనే విమర్శ పోలీసు వర్గాల్లోనే బలంగా వినిపిస్తోంది. రెండు విభాగాలకు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన అధికారులే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జిల్లాలో ఇంటెలిజెన్స్ డీఎస్పీగా జిల్లాపై సమగ్ర అవగాహన ఉన్న చెంచుబాబును ఎంచుకున్నారు. ఇంటెలిజెన్స్ డీఎస్పీగా దాదాపు ఏడాది కాలంగా జిల్లాలో పనిచేస్తున్నారు. గతంలో జిల్లాలో ఎస్సైగా పనిచేశారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల తటస్థంగా ఉన్న రాజకీయ నాయకులను అధికార పార్టీలో చేర్పించడంలో కీలక భూమిక పోషిస్తున్నారన్న విమర్శలు ఆ శాఖలోనే వినిపిస్తున్నాయి. సర్వే బృందానికి ఇంటెలిజెన్స్ డీఎస్పీకు ఉన్న సంబంధం ఏంటనే చర్చ సాగుతోంది. ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా సర్వేకు డీఎస్పీకి ఉన్న బంధం ఏంటనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటెలిజెన్స్ బాస్ ఆదేశాలలు, అధికార పార్టీ నేతల ఆదేశాలతో డీఎస్పీ జోక్యం పెరిగిందనే ప్రచారాలు సాగుతున్నాయి. వాస్తవానికి ఎన్నికల కోడ్ రాక ముందు కుట్ర రాజకీయాలకు పోలీసులు సహకరించడం చర్చగా మారింది. -
కొనసాగిన నిర్బంధం
ఖండించిన అఖిలపక్షం నాయకుల అరెస్ట్ కాకినాడ సిటీ/కాకినాడ క్రైం : కేఎస్ఈజెడ్ పోర్టు నిర్మాణంపై తొండంగి మండలంలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం కూడా సుందర్యభవ¯ŒSపై పోలీసులు నిర్బం««దlం కొనసాగింది. ఈ చర్యలను అఖిలపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. శుక్రవారం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో సుందరయ్యభవ¯ŒSలో విలేకరుల సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధ చర్యలపై వారు ధ్వజమెత్తారు. 2013 భూసేకరణ చట్టా న్ని తుంగలో తొక్కుతున్నారని, రాజ్యాంగ హ క్కులను కాలరాస్తున్నారన్నారు. ఎన్ని ఇబ్బం దులు పెట్టినా చంద్రబాబు ఆటలు సాగనివ్వబోమని, బా బుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అఖిలపక్షం హెచ్చరించింది. సమావేశం అనంతరం నాయకులంతా సుందరయ్యభవ¯ŒS నుంచి పాతబస్టాండ్ రోడ్ మీదుగా ప్రదర్శనగా బయల్దేరారు. బలవంతపు భూసేకరణ తగదంటూ నినాదాలు చేశారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దడాల సుబ్బారావు, జిల్లా కార్యదర్శి దువ్వ శేషబాబ్జీ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంతం నానాజీ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు జె.వెంకటేశ్వర్లు, సీపీఐ నాయకులు పెదిరెడ్డి సత్యనారాయణ, ఆర్పీఐ నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు, అయినాపురపు సూర్యనారాయణ, లోక్సత్తా నాయకుడు రాజ్వర్శ, సీపీఐ (ఎంఎల్) జనశక్తి నాయకులు కర్నాకుల వీరాంజనేయులుతో పాటు 21 మందిని అరెస్ట్ చేసి స్థానిక త్రీటౌన్, పోర్టు స్టేషన్లకు తరలించారు. కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో అఖిల పక్షపార్టీల నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దాడ సుబ్బారాయుడు, బసవా చంద్రమౌళి, తదితరులు త్రీటౌ¯ŒS పోలీస్స్టేçÙ¯ŒS ఎదుట రాస్తారోకో, ఆందోళన చేశారు. అక్రమ అరెస్టులు ఆపాలి, అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని నినాదాలు చేశారు. వీరి ఆందోళనతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు.