బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.10 ఫ్రీ టాక్టైం
ఆక్సిజన్ సర్వీసెస్ ఇండియా ఆఫర్
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆక్సిజన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దేశంలోని ప్రతి వ్యక్తి మొబైల్కు రూ. 10 ఉచిత టాక్టైమ్ అందిస్తోంది. బుధవారం నుంచి ఈనెల 24 వరకు ఇది వర్తిస్తుందని ఆ సంస్థ చైర్మన్ ప్రమోద్ సస్రేనా పేర్కొన్నారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ కార్యాలయంలో బుధవారం ఈ సౌకర్యాన్ని చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ప్రారంభించారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రతి ఒక్క భక్తుడూ గోవిందనామ స్మరణ చేయాలనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించామన్నారు. మొబై ల్ వినియోగదారులు ఫోన్లో గోవింద అనే పదాన్ని టైప్ చేసి తర్వాత స్పేస్ ఇచ్చి ఆపరేటర్ పేరును టైప్ చేసి 9963900600కి ఎస్ఎంఎస్ చేస్తే వెంటనే రూ.10 రీచార్జ్ లభిస్తుందన్నారు. ఉదాహరణకు ఎయిర్టెల్ వినియోగదారులు GOVINDA AIRTEL అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలని కోరారు.