P. Ashok gajapatiraju
-
దేశంలో ఆధునిక విమానాశ్రయాలు
నవీ ముంబై, భోగాపురంలో ఏర్పాటు: అశోక్ గజపతిరాజు సాక్షి, హైదరాబాద్: దేశంలో నాలుగు ఆధునిక విమానాశ్రయలను నిర్మించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్ గజపతిరాజు చెప్పారు. ఈ విమానాశ్రయాల్లో రెండు ర న్‌వేలు ఉంటాయని, ఒక్కో రన్ వే పొడవు నాలుగు కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు. ఈ రెండు రన్‌వేల మధ్య ఒకటిన్నర కిలోమీటరు ఖాళీ ప్రదేశం ఉంటుందని చెప్పారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం, నవీ ముంబైలో మరో విమానాశ్రయం ఈ పద్ధతిలో నిర్మిస్తామన్నారు. మరో రెండు విమానాశ్రయాలను ఇలా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జాయింట్ వెంచర్ విధానంలో వీటిని నిర్మిస్తామని, ఒక్కో విమానాశ్రయం నిర్మాణానికి రూ.13వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. శంషాబాద్‌లో ప్రస్తుతమున్న రన్‌వేకు సమాంతరంగా మరో రన్‌వే నిర్మిస్తున్నామని చెప్పారు. తెలంగాణలోని కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారని చెప్పారు. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలపై రైట్స్ సంస్థ సర్వే చేస్తోందని, నివేదిక అందిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో 30కి పైగా చిన్న విమానాశ్రయాలున్నాయని... వీటి నుంచి విమానాలు నడిపేందుకు విమానయాన సంస్థలు నష్టాల పేరుతో వెనుకంజ వేస్తున్న నేపథ్యంలో ఆ నష్టాన్ని కేంద్రం 80 శాతం, రాష్ట్రాలు 20 శాతం భరించేలా పథకాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. -
విమానాశ్రయాల విస్తరణపై దృష్టి
సచివాలయంలో సీఎంను కలిసిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విమానాశ్రయాల విస్తరణపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి పి. అశోక్ గజపతిరాజుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించారు. అశోక్ గజపతిరాజు శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. విశాఖ విమానాశ్రయం విస్తరణకు నావికాదళం నుంచి భూమిని ఎలా తీసుకోవాలనే అంశంపై చర్చించారు. తిరుపతి విమానాశ్రయం విస్తరణకు భూమి సమస్య కాదని అభిప్రాయపడ్డారు. గన్నవరం విమానాశ్రయానికి ఒకవైపు కాలువలు, మరోవైపు జాతీయ రహదారి ఉన్నందున, ఇక్కడ విస్తరణ ఏ విధంగా చేపట్టాలో పరిశీలించాలని నిర్ణయించారు. ఈ మూడు విమానాశ్రయాలను సందర్శించి, వాటి విస్తరణ, అంతర్జాతీయ హోదాకు తీసుకోవాల్సిన చర్యలపై ఒక నిర్ణయానికి రావాలని అశోక్ గజపతిరాజును సీఎం కోరినట్లు సమాచారం. 22న ఢిల్లీకి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 22న ఢిల్లీ వెళ్లనున్నారు. 24వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతుండటంతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన ఢిల్లీ వెళుతున్నట్లు సమాచారం. 23వ తేదీ నుంచి చంద్రబాబు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. కాగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిశారు. సింగపూర్ పర్యటన విజయవంతమైంది తన సింగపూర్ పర్యటన విజయవంతమైందని సీఎం చంద్రబాబు ట్విట్టర్లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు.