Padmanabhan
-
ముత్తు నందిని ప్యాలెస్ ఇష్టాల ఇల్లు
రాజ్ చందర్ పద్మనాభన్, నాగ జయలక్ష్మి దంపతులు తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారిలో నివసించేవారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో వీరు అనుసరించిన విధానం ఇప్పుడు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. పర్యావరణ ప్రేమికులనైతే మరీ ఎక్కువగా ఆకట్టుకుంటోంది. రెండేళ్ల కిందట గృహప్రవేశం చేసుకున్న కొత్త ఇల్లది. అయితే ఆ ఇంట్లో అడుగుపెడితే కాలం గిర్రున సినిమా రీల్‌లాగ వందేళ్ల వెనక్కి తిరిగిపోయిందా అనిపిస్తుంది. ఇంటిని చూడడానికి వచ్చిన వాళ్లను అతిథి మర్యాదలతో ముంచెత్తుతారు ఈ దంపతులు. సేంద్రియ పద్ధతిలో పండించిన దినుసులు, కాయగూరలతో సంప్రదాయ తమిళ, చెట్టినాడు వంటలను వడ్డిస్తారు. ఎర్రమట్టి, సున్నపు రాయితో నిర్మించిన ఇంట్లో భూగర్భ జలాలను పరిరక్షించే ఏర్పాటు ఉంది. బంకమట్టి నిర్మాణం కావడంతో ఎండాకాలం చల్లగా ఉంటుంది. నేచర్ ఫ్రెండ్లీ ట్రావెల్‌ను ఇష్టపడే వాళ్లు ఇక్కడ బస చేస్తుంటారు. బస చేయకపోయినా చూసి పోవడానికి వచ్చేవాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ కాలంలో ఇంటిని ఇలా ఎందుకు కట్టుకున్నారనే ప్రశ్న దాదాపుగా ప్రతి ఒక్కరి నుంచి ఎదురవుతుంటుంది. జయలక్ష్మి ప్రతి ఒక్కరికీ పూసగుచ్చినట్లు వివరిస్తుంటుంది. బాల్యంలోకి వెళ్లారాయన! ‘‘రాజ్‌చందర్ వృత్తిరీత్యా జియో డాటా అనలిస్ట్. ఆయనకు ఇష్టమైన రోజులంటే చిన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ గారింట్లో గడిపిన బాల్యమే. పైగా రాజ్ అభిరుచి, విధి నిర్వహణ కూడా పర్యావరణవేత్తలతో కలిసి పని చేయడమే. ఈ రెండు ఇష్టాలను కలుపుతూ చక్కటి ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడూ చెప్పేవారు. నాక్కూడా మా సంప్రదాయ నిర్మాణంలో ఉండే సౌందర్యం చాలా ఇష్టం. ఇద్దరి అభిరుచులూ కలవడంతో ఇంటిని ఇలా కట్టుకున్నాం. మా ఇద్దరి ఇష్టాల మేరకు ఎలా కట్టుకోవాలో ఒక ఐడియా వచ్చేసింది. ఎక్కడ కట్టాలనే విషయంలో ఒక అభిప్రాయానికి రావడం కొంచెం కష్టమే అయింది. లొకేషన్ సెర్చింగ్ మొదలు పెట్టాం. సంజీవని శకలం కన్యాకుమారికి సమీపంలో పోథయాడి గ్రామాన్ని చూసినప్పుడు కొండలు, పచ్చటి చెట్లతో ప్రదేశం బాగుందనిపించింది. ఆశ్చర్యంగా మరో విషయం తెలిసింది. అదేంటంటే... రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు వైద్యం కోసం హనుమంతుడు ఏకంగా సంజీవని మొక్క ఉన్న పర్వతం అంతటినీ ఎత్తుకొచ్చాడని విన్నాం. వైద్యం చేసిన తర్వాత ఆ పర్వతాన్ని తిరిగి తీసుకెళ్లే క్రమంలో పర్వతంలోని ఒక శకలం విరిగి కింద పడి పోయిందని, ఆ శకలమే ఈ కొండ అని చె΄్పారు స్థానికులు. వాళ్ల విశ్వాసాన్ని పక్కన పెడితే ఆ కొండమీద చుట్టు పక్కల ఉన్న మొక్కలన్నీ ఔషధ మొక్కలే. ప్రకృతితో మమేకమై నివసించడానికి మాకు ఇంతకంటే సౌకర్యవంతమైన ప్రదేశం మరోటి ఉండదేమో అనిపించింది. అంతే... 2021లో నిర్మాణం మొదలు పెట్టాం. ఒక ఏడాదిలో తమిళ, వేనాడు, చెట్టినాడు సంస్కృతుల సమ్మేళనమైన మా ఇంటి నిర్మాణం పూర్తయింది. సంప్రదాయ కళాకృతుల సేకరణ నా హాబీ. ఇంటిని తమిళ సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా మలిచాను. ఇంటి ముఖద్వారం నుంచి నేల, గోడ, మెట్లు, పై కప్పు, అలంకరణ వస్తువులు ప్రతి ఒక్కటీ తమ వైభవాన్ని తామే చెప్పుకుంటాయి. పర్యావరణ హితమైన సున్నపు పోడి ఇటుకలు, ఎర్ర మట్టి, ఆవుపేడ, ధాన్యం పోట్టు, కోడిగుడ్లు, బెల్లంతోపాటు అత్తంగుడి నది తీరాన దొరికే ఇసుకతో తయారు చేసే అత్తంగుడి టైల్స్‌ను వాడాం. పై కప్పుకి కాంక్రీట్ వాడకాన్ని తగ్గించి ఫిల్లర్ స్లాబ్ టెక్నిక్ ఉపయోగించాం. వర్షపు నీటిని నిల్వ చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, కరెంటుకోసం సోలార్ ప్యానెల్స్ పెట్టాం. ఈ మట్టి సౌధంలో 5బెడ్ రూమ్‌లు, మూడు బాల్కనీలు, మూడు లివింగ్ స్పేస్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు రెండు వందల మందికి పైగా పర్యాటకులు ఈ హోమ్ స్టేలో బస చేశారు. ఆహారం కూడా తమిళనాటప్రాంంతాల వారీగా విలసిల్లిన విభిన్నమైన రుచులుంటాయి. ఇంటి ఆవరణలో అన్ని రకాల కూరగాయలనూ పండిస్తాం. వంటగదిలో వచ్చే వ్యర్థాలనే ఎరువుగా వేస్తాం’’ అని తమ పర్యావరణ హిత భవనం ముత్తు నందిని ప్యాలెస్ గురించి వివరించింది జయలక్ష్మి. -
జీఆర్టీ జ్యువెలర్స్ బ్యాంగిల్ మేళా
హైదరాబాద్: ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ జీఆర్టీ జ్యువెలర్స్ బ్యాంగిల్ మేళా నిర్వహిస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. విస్తృత శ్రేణిలో వివిధ రకాల మోడల్ గాజులను ఆకర్షణీయమైన ఆఫర్లతో సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఈ మేళాలో భాగంగా బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు రూ.50లు, వజ్రాలు, అన్‌కట్ వజ్రాలపై 10 శాతం, వెండి ఆభరణాల ఎంఆర్పీపై పదిశాతం డిస్కౌంట్‌ను ఇస్తోంది. కస్టమర్లకు తమకు నచ్చిన డిజైన్లు, గాజులను ఎంపిక చేసుకోవడానికి ఈ మేళా నిర్వహిస్తున్నట్లు కంపెనీ ఎండీ జీఆర్ పద్మనాభన్ తెలిపారు. -
అభివృద్ధి కోసం పరిశోధనలపై దృష్టి పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక, సామాజిక శక్తిగా ఎదగాలన్న భారత్ ఆకాంక్ష నెరవేరాలంటే మౌలిక పరిశోధనలపై మరింత దృష్టి కేంద్రీకరించాల్సిందేనని పద్మభూషణ్ జి.పద్మనాభన్ స్పష్టం చేశారు. ఐటీ, అంతరిక్ష పరిశోధనల్లో దేశం ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ మానవాభివృద్ధి సూచీల్లో 129వ స్థానంలో ఉండటం, ఆరోగ్య సేవల విషయంలో ప్రపంచదేశాల జాబితాలో అట్టడుగు భాగంలో ఉండటం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్లో (నార్మ్) శనివారం ఓ జాతీయ సదస్సు ప్రారంభమైంది. ‘శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వ్యాపారాభివృద్ధి’ అనే అంశంపై నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ఇండియా (నాసి) ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో పద్మనాభన్ మాట్లాడుతూ.. దేశ వ్యవసాయ, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఐటీ, అంతరిక్ష పరిశోధనలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ ఎ.వి.రామారావు, కేంద్ర బయోటెక్నాలజీ విభాగం మాజీ కార్యదర్శి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ మంజు శర్మ, నాసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ సత్యదేవ్, నార్మ్ డైరెక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఖాతాదారులూ! కాస్త జాగ్రత్త!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు బ్యాంకులు, నియంత్రణ సంస్థ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఖాతాదారులు కూడా తమ వంతుగా పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉందని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జి.పద్మనాభన్ అభిప్రాయపడ్డారు. డిజిటల్ లావాదేవీలకు సంబంధించి అసలైన పోర్టల్స్, యాప్స్ అప్డేటెడ్ వెర్షన్లను ఉపయోగించడంతో పాటు పిన్ నంబర్లు లాంటివి ఎవరికీ వెల్లడించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే, సైబర్ సెక్యూరిటీ అనేది ఏ ఒక్క సంస్థ బాధ్యతో కాదని.. ఈ విషయంలో ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు, వివిధ ఏజెన్సీలు కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. బుధవారమిక్కడ ఐడీఆర్బీటీలో.. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సెక్యూరిటీపై 15వ అంతర్జాతీయ సదస్సు (ఐసీఐఎస్‌ఎస్) ప్రారంభించిన సందర్భంగా పద్మనాభన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సు 20 దాకా జరగనుంది. అత్యధికంగా సైబర్ దాడులకు గురయ్యే దేశాల్లో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉందని పద్మనాభన్ చెప్పారు. ‘‘కానీ సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండే విషయంలో మాత్రం 47వ స్థానంలో ఉన్నాం. ఆర్థిక సేవలను సులభంగా అందించేందుకు, లావాదేవీల ఖర్చు భారీగా తగ్గించేందుకు సైబర్ టెక్నాలజీ ఉపయోగపడుతోంది. సాధారణంగా నెట్‌వర్క్‌లోకి చొరబడిన వైరస్ తీవ్రత 220 రోజులకు గానీ బయటపడటం లేదు. దీన్ని మరింత ముందుగా గుర్తించగలిగితే సైబర్ దాడులను కొంతైనా నియంత్రించవచ్చు’’ అని ఆయన వివరించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ(ఐడీఆర్‌బీటీ) దీనికి తగు టెక్నాలజీని రూపొందించడంపై దృష్టి పెట్టా లన్నారు. బ్యాంకింగ్ టెక్నాలజీకి సంబంధిం చి ఫిన్‌టెక్ ఎక్సే్చంజీ, 5జీ యూజ్ కేస్ ల్యాబ్ మొదలైనవి ఏర్పాటు వంటి అంశాలను ఐడీఆర్‌బీటీ డైరెక్టర్ ఏఎస్ రామశాస్త్రి వివరించారు. -
మస్త్ హ్యాపీ
వెండితెరపై సెంచరీని ఎప్పుడో పూర్తి చేసిన అందాల తార రంభ ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓన్లీ సౌత్‌లోనే కాదు, హిందీ చిత్రాల్లోనూ నటించి సత్తా చాటారు. బుల్లితెరపై కూడా ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. ఇప్పుడు రంభను ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అంటే... ఆమె మూడో బిడ్డకు జన్మనిచ్చారు. 2010లో కెనడాకి చెందిన ఇంద్రకుమార్ పద్మనాభన్‌ను వివాహం చేసుకున్నారు రంభ. ఈ దంపతులకు ఆల్రెడీ లాణ్య, షాషా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్న సంగతి తెలిసిందే. ‘‘ఈ నెల 23న బేబీ బాయ్‌కి జన్మనిచ్చాను. పేరెంటింగ్ లైఫ్ చాలా బాగుంది’’ అని పేర్కొన్నారు రంభ. కాగా, 2007లో దేశముదురు, యమదొంగ చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చేసిన రంభ 2008లో కీలక పాత్ర చేసిన ‘దొంగ సచ్చి నోళ్లు’ తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు. బుల్లితెరపై మాత్రం కనిపిస్తున్నారు. -
టాటాసన్స్ లో కీలక మార్పులు
ముంబై: టాటా సన్స్ అధినేతగా సైరస్ మిస్త్రీ పై వేటు పడిన అనంతరం సంస్థలో శుక్రవారం నూతన పరిణామాలు చోటు చేసుకున్నాయి. మిస్త్రీ ఉద్వాసన తర్వాత ఒకవైపు కొత్త చైర్మన్ కోసం ముమ్మర కసరత్తు జరుగుతుండగా, మరోవైపు సంస్థ తన సంస్థాగత నిర్మాణంలో ప్రధాన మార్పులు ప్రకటించింది. కొత్త మ్యానేజ్మెంట్ టీం ను ప్రకటించింది. టాటాసన్స్ హెచ్ ఆర్ గ్రూపు హెడ్ గా ఎస్ పద్మనాభన్ ను నియమించింది. టాటా బిజినెస్ ఎక్స్ లెన్స్ గ్రూపు బాధ్యతలకు తోడుగా ఆయనకు ఈ బాధ్యతలను కట్టబెట్టింది. విదేశీ సంస్థ నిర్వహణ బాధ్యతలను ముకుంద్ రాజన్ కు అప్పగించింది. అమెరికా, సింగపూర్, దుబాయ్, చైనా లో టాటా సన్స్ విదేశీ ప్రతినిధి కార్యాలయాలు, కార్యకలాపాలు పర్యవేక్షించే అదనపు బాధ్యతను అప్పగించింది. ముఖ్యంగా టాటా సన్స్ ముగ్గురు అగ్ర కార్యనిర్వాహకులు నిర్మల్య కుమార్ ఎన్ ఎస్ రాజన్, మధు కన్నన్ రాజీనామా తర్వాత ఆ స్థానాల్లో కొత్త వారిని నియమించింది. చీఫ్ టెక్నాలజీ గ్రూపు హెడ్ గా గోపీచంద్ కాట్రగడ్డ కొనసాగుతారని, ఢిల్లీ కార్యాలయం నుంచి పబ్లిక్ అఫైర్స్ ను సంజయ్ సింగ్ పర్యవేక్షించనున్నారని తెలిపింది. టాటా బ్రాండ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ బాధ్యతల్లో హరీష్ భట్ లను నియమించింది. కాగా అక్టోబర్ 24 న టాటా సన్స్ బోర్డు చైర్మన్ గా మిస్త్రీ స్థానే తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలను రతన్ టాటా చేపట్టారు. సంస్థ నాలుగు నెలల్లో ఒక కొత్త చైర్మన్ ను నియామకంకోసం తీవ్ర వెదుకులాట సాగుతోంది. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ చైర్మన్ పదవిలో ఎవరిని నియమిస్తారనే అంశంపై స్పష్టత లేదు.