పొలాన్నే కాన్వాస్‌గా మార్చి.. సరికొత్త ఆర్ట్‌కి ప్రాణం పోసిన రైతు!
కొన్ని కళలను కళ్లారా చూడాల్సిందే తప్ప వాటికి కొత్త అర్ధాలు చెప్పలేం. కానీ, తన కళతో యువతకు ఏది ముఖ్యమో వివరిస్తున్నారు కేరళలోని వాయనాడ్‌కు చెందిన ప్రసీత్కుమార్ తయ్యిల్ అనే వ్యక్తి. ఇంతకీ ఏం చేశాడా అంటారా.. ఫొటో చూడండి... ఇంకా అర్ధం కాలేదు విషయమేంటో స్వయంగా తెలసుకోండి. వాయనాడ్‌లోని సుల్తాన్ బతేరీకి చెందిన ఒక రైతు తన వరి పొలాన్ని కాన్వాస్‌గా మార్చేశాడు. వివిధ రకాలైన వరి రకాల నారు ఉపయోగించి క్లిష్టమైన శివుని రూపాన్ని ఆవిష్కరించాడు. యువతను వ్యవసాయంవైపు మళ్లించేందుకు ఈ కళను సృష్టించాను అని చెబుతున్నాడు. ఆ రైతు పేరు ప్రసీద్ కుమార్ తయ్యిల్. వరి పొలంలో వరి కళకు ప్రాణం పోసిన ఈ రైతును అభినందించకుండా ఉండలేం. పంట పొలాలతో కళను సృష్టించడాన్ని పాడీ ఆర్ట్ అంటారు. ఇన్‌స్టాలేషన్‌లో టాన్బో ఆర్ట్ లేదా రైస్ పాడీ ఆర్ట్ అని పిలువబడే జపనీస్ కళారూపం ఇది. దీనిని వ్యూహాత్మక పద్ధతిలో నాటిన వేలాది వరి నారు పెరిగి, ఆ తర్వాత రెమ్మల ద్వారా ఓ రూపం కనిపిస్తుంది. అరుదైన వరి వంగడాలను సంరక్షించడమే ధ్యేయంగా! ఈ కళాత్మక వెంచర్ కోసం తన 10 ఎకరాల వరి పొలంలో 30 సెంట్ల భూమిని అంకితం చేశాడు శ్రీ కుమార్. తన ప్రయత్నం కేవలం సౌందర్యానికి సంబంధించినది కాదని చెబుతున్నాడు. ‘అరుదైన స్థానిక వరి జాతులను సంరక్షించడం, వాటిని ప్రచారం చేస్తూనే, వ్యవసాయం ఒక ఆచరణీయ వృత్తిగా యువతకు అవగాహన కల్పించడం లక్ష్యం‘ అంటున్నాడు. ఆర్ట్‌కి నాలుగు రకాల వంగడాలువరి కళతో పాటు కుమార్ వ్యవసాయంలో ఎన్నో అద్భుతాలను పండిస్తుంటాడు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి సేకరించిన ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందిన 100 రకాల వరి వంగడాలతో పంటలు పండించాడు. ఈ కళాకృతి కోసం మాత్రం నాలుగు విభిన్న వరి రకాలను ఉపయోగించాడు: నాజర్ బాత్ రకానికి ఊదా ఆకులతో, రక్తశాలి, చిన్నార్, జీరకసాల, ముదురు– లేత ఆకుపచ్చ ఆకులతో ఉంటాయి. పర్యాటకులకు ఆకర్షణ మంత్రకుమార్ మాట్లాడుతూ– ‘ఆధునికతరం వ్యవసాయం నుండి డిస్కనెక్ట్ అయినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా వరి సాగులో తరచుగా అధిక ఖర్చులతో తక్కువ రాబడి వచ్చేదిగా భావిస్తుంటారు. అయితే, మూడు దశాబ్దాలుగా జపాన్, చైనాలోని రైతులు వరి కళ వంటి వినూత్న పద్ధతులను ఆవలంబిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. సాంప్రదాయ వ్యవసాయ రాబడితోపాటు గణనీయమైన అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. సహజ సౌందర్యంతో వయనాడ్ దేశంలోనే ప్రముఖ టూరిజం హాట్‌స్పాట్‌గా మారుతోంది. జిల్లాలోని రైతులు తమ వరి పొలాలకు పర్యాటకులను ఆకర్షించగలిగితే, వారు మరిన్ని మెరుగైన ఆర్థిక ఫలితాలను సాధిస్తారు అని ఆయన చెప్పారు. కిందటేడాది విద్యార్థులు, రైతులు, పర్యాటకులతో సహా 10,000 కంటే ఎక్కువ మంది సందర్శకులు తన సైట్‌ను సందర్శించారని శ్రీ కుమార్ చెబుతున్నాడు.అంతేకాదు, ఈ వంగడాల ద్వారా ఆకర్షణీయమైన అదనపు ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్నాడు. ఇప్పటికి పది సార్లు కుమార్ తన పొలాల్లో వరి కళాకృతిని రూపొందించాడు. ఈ ప్రాజెక్ట్ దాదాపు రూ.20,000 ఖర్చుతో కూడుకున్నది. ప్రారంభ రూపురేఖలను ముందగా నేలపైన గీసుకని, ఆ తర్వాత 36 మంది కార్మికులతో కూడిన బృందంతో ఈ ఆర్ట్‌ను సాధించాడు కుమార్. (చదవండి: ఈసారి వెకేషన్‌కి పోర్బందర్ టూర్..బాపూజీ ఇంటిని చూద్దాం..!)