pagan
-
అన్యమత ప్రచారంపై ప్రభుత్వం సీరియస్
సాక్షి, అమరావతి: తిరుమలలో బస్ టికెట్లపై అన్యమత ప్రచార ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు టిమ్ రోల్స్ సరఫరా చేసిన అధికారులు, కాంట్రాక్టర్లుపై రవాణా శాఖ విచారణ చేపట్టింది. టీడీపీ హయాంలోని కాంట్రాక్టర్లే బస్ టికెట్ల టిమ్ రోల్స్ పంపిణీ చేసినట్లుగా అధికారులు నిర్ధారించారు. నెల్లూరు డిపో నుంచి తిరుమలకు టిమ్ రోల్స్‌ను కాంట్రాక్టర్ సరఫరా చేశారు. నివేదిక రాగానే బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమల ఆర్టీసీ డిపో మేనేజర్ వివరణ ఆర్టీసీ ద్వారా అన్యమత యాత్రా ప్రచారం జరగలేదని తిరుమల ఆర్టీసీ డిపో మేనేజర్ గిరిధర్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ టికెట్ల వెనుక ముద్రించి ఉన్నవి గత టీడీపీ ప్రభుత్వ పథకాల వివరాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని డిపోలలోని ఆర్టీసీ టికెట్ల వెనుక ఇవి ముద్రించి ఉన్నాయని, అలా గత ప్రభుత్వ పథకాలతో ముద్రించిన కొన్ని రోల్స్ తిరుమల డిపోకు వచ్చాయని వివరించారు. గత ప్రభుత్వ పథకాల గురించి ముద్రించి ఉన్న టికెట్లను వెనక్కు పంపించి వేశామని తెలిపారు. -
తిరుచ్చి ఆలయంలో ఏనుగు భీభత్సం
-
తిరుచ్చిలో ఏనుగు భీభత్సం : భక్తుడు మృతి
సాక్షి, చెన్నై : తమిళనాడు తిరుచ్చిలోని మారియమ్మ దేవాలయంలో శుక్రవారం ఓ ఏనుగు భీభత్సాన్ని సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చిలోని మారియమ్మ ఆలయంలో పూజలు జరుగుతుండగా ఒక్కసారిగా ఏనుగు దూసుకొచ్చింది. భయంతో భక్తులు ఆలయం బయటకు పరుగులు తీశారు. దాడిలో ఏనుగు తొక్కడంతో ఓ భక్తుడు అక్కడికక్కడే మృతిచెందాడు. చనిపోయిన భక్తుడిని గజేంద్రన్‌గా గుర్తించారు. -
అన్యమత గ్రంథాలతో వచ్చిన వ్యక్తి అరెస్ట్
సాక్షి,తిరుమల: తిరుమలలో గురువారం అన్యమత గ్రంథాలతో వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా లక్కిరెడ్డిపల్లికి చెందిన ఏ.శివారెడ్డి (45) తిరుపతిలో తాపీ మేస్త్రీగా పనిచేస్తుంటాడు. గురువారం ఉదయం 10 గంటలకు శ్రీవారి మెట్టు మార్గం నుంచి శ్రీవారి దర్శనానికి దివ్యదర్శనం టోకెన్ వేసుకోకుండానే తిరుమలకు నడిచి వచ్చాడు. అనుమానంతో సెక్యూరిటీ గార్డు అతన్ని తనిఖీ చేశారు. లగేజీలో అన్యమతానికి చెందిన రెండు గ్రంథాలను గుర్తించి, టూ టౌన్ పోలీసులకు అప్పగించారు. తిరుమల అశ్వినీ ఆస్పత్రిలో తాపీ పని ఉందని పిలవడంతో నడిచి తిరుమలకు వచ్చానని, తన వద్ద అన్యమత గ్రంథాలు ఉన్న మాట వాస్తవమేనని నిందితుడు శివారెడ్డి అంగీకరించారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.