సాక్షి, చెన్నై : తమిళనాడు తిరుచ్చిలోని మారియమ్మ దేవాలయంలో శుక్రవారం ఓ ఏనుగు భీభత్సాన్ని సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చిలోని మారియమ్మ ఆలయంలో పూజలు జరుగుతుండగా ఒక్కసారిగా ఏనుగు దూసుకొచ్చింది. భయంతో భక్తులు ఆలయం బయటకు పరుగులు తీశారు. దాడిలో ఏనుగు తొక్కడంతో ఓ భక్తుడు అక్కడికక్కడే మృతిచెందాడు. చనిపోయిన భక్తుడిని గజేంద్రన్‌గా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment