Paisa vasul
-
పోటీ లేకుండాపోయింది
గతేడాది సెప్టెంబర్ చివరి వారంలో ముగ్గరు పెద్ద హీరోల సినిమాలు ఒకే వారంలో బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవుతాయనుకున్నారు. అవే.. బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందిన ‘పైసా వసూల్’, మహేశ్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ, తెలుగు బైలింగ్వల్ ‘స్పైడర్’, బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ త్రిపాత్రిభినయం చేసిన ‘జై లవ కుశ’. అనుకున్నట్లుగా అయితే.. సెప్టెంబర్ 21న ‘జై లవ కుశ’, 27న ‘స్పైడర్’, ‘పైసా వసూల్’ రిలీజ్ కావాల్సింది. కానీ.. చెప్పిన టైమ్కన్నా ముందే ‘పైసా వసూల్’ చిత్రాన్ని సెప్టెంబర్ 1న రిలీజ్ చేశారు చిత్రబృందం. ‘జై లవ కుశ’ స్టెప్టెంబర్ 21న, ‘స్పైడర్’ 27న వచ్చాయి. మొత్తం మీద పోటీ లేకుండాపోయింది. -
ఎన్టీఆర్ ‘కంటి చూపు చెబుతోంది...’లో బాలకృష్ణ
ఎన్టీఆర్ ‘జీవితచక్రం’లోని ‘కంటి చూపు చెబుతోంది.. కొంటె నవ్వు చెబుతోంది...’ పాటకు మ్యూజిక్ లవర్స్ లిస్ట్‌లో మంచి ప్లేస్ ఉంటుంది. నాడు తండ్రి హుషారుగా డ్యాన్స్ చేసిన ఈ పాటకు నేడు తనయుడు బాలకృష్ణ స్టెప్పులేస్తే ఫ్యాన్స్‌కి ఫీస్ట్ అని చెప్పాలి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ‘పైసా వసూల్’ కోసం ఈ పాటను రీమిక్స్ చేశారు. బాలకృష్ణ చేసిన తొలి పూర్తి స్థాయి రీమిక్స్ సాంగ్ ఇదే కావడం విశేషం. డ్యాన్స్ మాస్టర్ దినేష్ నృత్యరీతులు సమకూర్చగా, పోర్చుగల్‌లో బాలకృష్ణ, చిత్రకథానాయికల్లో ఒకరైన ముస్కాన్‌లపై ఈ పాటను చిత్రీకరించారు. తండ్రి పాటలో బాలకృష్ణ కనిపించడం ఇది తొలిసారి కాదు. ఆ వివరాల్లోకి వస్తే... ఎన్టీఆర్ నటించిన ‘జస్టిస్ చౌదరి’ సినిమాలోని ‘నీ తొలి చూపులోనే..’ పాటను బాలకృష్ణ నటించిన ‘నిప్పులాంటి మనిషి’లో యథాతథంగా వాడారు. అలాగే ఎన్టీఆర్ ‘భలే తమ్ముడు’ లోని ‘నేడే ఈ నాడే’ సాంగ్‌ని ‘అల్లరి పిడుగు’ కోసం రీమిక్స్ చేశారు. అయితే అది పూర్తి స్థాయి రీమిక్స్ కాదు. ఆ తర్వాత ‘ఒక్క మగాడు’ కోసం ‘చాలెంజ్ రాముడు’లోని ‘పట్టుకో పట్టుకో పట్టుచీర...’ పాటలోని చరణాలను మార్చేసి, పల్లవి వాడారు. ఇప్పుడు ‘పైసా వసూల్’ కోసం రీమిక్స్ చేసిన ‘కంటి చూపు చెపుతోంది...’ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. కొన్ని రోజులుగా జరిగిన ఈ చిత్రం పోర్చుగల్ షెడ్యూల్ ముగిసింది. నేడు చిత్రబృందం హైదరాబాద్ చేరుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఓ షెడ్యూల్ మొదలుపెడతారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్.