ఎన్టీఆర్‌ ‘కంటి చూపు చెబుతోంది...’లో బాలకృష్ణ | NTR's 'jeevitha chakram' is a 'remix of Paisa vasul' for Balakrishna's song | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ ‘కంటి చూపు చెబుతోంది...’లో బాలకృష్ణ

Published Fri, Jun 16 2017 12:18 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

ఎన్టీఆర్‌ ‘కంటి చూపు చెబుతోంది...’లో బాలకృష్ణ - Sakshi

ఎన్టీఆర్‌ ‘కంటి చూపు చెబుతోంది...’లో బాలకృష్ణ

ఎన్టీఆర్‌ ‘జీవితచక్రం’లోని ‘కంటి చూపు చెబుతోంది.. కొంటె నవ్వు చెబుతోంది...’ పాటకు మ్యూజిక్‌ లవర్స్‌ లిస్ట్‌లో మంచి ప్లేస్‌ ఉంటుంది. నాడు తండ్రి హుషారుగా డ్యాన్స్‌ చేసిన ఈ పాటకు నేడు తనయుడు బాలకృష్ణ స్టెప్పులేస్తే ఫ్యాన్స్‌కి ఫీస్ట్‌ అని చెప్పాలి. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ‘పైసా వసూల్‌’ కోసం ఈ పాటను రీమిక్స్‌ చేశారు. బాలకృష్ణ చేసిన తొలి పూర్తి స్థాయి రీమిక్స్‌ సాంగ్‌ ఇదే కావడం విశేషం.

డ్యాన్స్‌ మాస్టర్‌ దినేష్‌ నృత్యరీతులు సమకూర్చగా, పోర్చుగల్‌లో బాలకృష్ణ, చిత్రకథానాయికల్లో ఒకరైన ముస్కాన్‌లపై ఈ పాటను చిత్రీకరించారు. తండ్రి పాటలో బాలకృష్ణ కనిపించడం ఇది తొలిసారి కాదు. ఆ వివరాల్లోకి వస్తే... ఎన్టీఆర్‌ నటించిన ‘జస్టిస్‌ చౌదరి’ సినిమాలోని ‘నీ తొలి చూపులోనే..’ పాటను బాలకృష్ణ నటించిన ‘నిప్పులాంటి మనిషి’లో యథాతథంగా వాడారు. అలాగే ఎన్టీఆర్‌ ‘భలే తమ్ముడు’ లోని ‘నేడే ఈ నాడే’ సాంగ్‌ని ‘అల్లరి పిడుగు’ కోసం   రీమిక్స్‌ చేశారు.

అయితే అది పూర్తి స్థాయి రీమిక్స్‌ కాదు. ఆ తర్వాత ‘ఒక్క మగాడు’ కోసం ‘చాలెంజ్‌ రాముడు’లోని ‘పట్టుకో పట్టుకో పట్టుచీర...’ పాటలోని చరణాలను మార్చేసి, పల్లవి వాడారు. ఇప్పుడు ‘పైసా వసూల్‌’ కోసం రీమిక్స్‌ చేసిన ‘కంటి చూపు చెపుతోంది...’ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. కొన్ని రోజులుగా జరిగిన ఈ చిత్రం పోర్చుగల్‌ షెడ్యూల్‌ ముగిసింది. నేడు చిత్రబృందం హైదరాబాద్‌ చేరుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఓ షెడ్యూల్‌ మొదలుపెడతారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement