The Pakistan team
-
పాకిస్థాన్ ఘనవిజయం
248 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమి అబుదాబి: టెస్టుల్లో పాకిస్థాన్ జట్టు తన హవాను కొనసాగిస్తోంది. ఇటీవలే ఆసీస్‌పై 2-0తో సిరీస్ గెలిచిన ఉత్సాహంతో ఉన్న మిస్బా సేన తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టును కూడా నెగ్గింది. 480 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ చివరి రోజు గురువారం తమ రెండో ఇన్నింగ్స్‌లో 70.3 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో పాక్ 248 పరుగుల భారీ తేడాతో నెగ్గి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. మూడో టెస్టు 17 నుంచి దుబాయ్‌లో జరుగుతుంది. యాసిర్ షాకు మూడు వికెట్లు, రాహత్ అలీ, ఇమ్రాన్ ఖాన్, జుల్ఫికర్ బాబర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఈ విజయంతో మిస్బా పాక్ తరఫున అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా నిలిచాడు. గతంలో ఇమ్రాన్, జావేంద్ మియాందాద్ సంయుక్తంగా 14 మ్యాచ్‌లు నెగ్గగా మిస్బా కెప్టెన్సీలో ఇది 15వ టెస్టు విజయం. -
భారీ స్కోరు దిశగా పాక్
షెహజాద్ సెంచరీ న్యూజిలాండ్‌తో టెస్టు అబుదాబి: ఓపెనర్లు అహ్మద్ షెహజాద్ (126 బ్యాటింగ్), మహ్మద్ హఫీజ్ (96)లు సత్తా చాటడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టులో పాకిస్థాన్ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆదివారం ప్రారంభమైన మొదటి టెస్టు తొలి రోజు ఆటముగిసే సమయానికి... పాకిస్థాన్ వికెట్ నష్టానికి 269 పరుగులు చేసింది. టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి వికెట్‌కు 178 పరుగులు జోడించిన ఓపెనర్లు పాక్‌కు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. 96 పరుగులు చేసిన హఫీజ్ అండర్సన్ బౌలింగ్‌లో ఆవుటై కొద్దిలో సెంచరీని కోల్పోయాడు. షెహజాద్‌తో పాటు అజహర్ అలీ (46 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.