పాకిస్థాన్ ఘనవిజయం | Pakistan's a huge success | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ ఘనవిజయం

Published Fri, Nov 14 2014 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM

పాకిస్థాన్ ఘనవిజయం

పాకిస్థాన్ ఘనవిజయం

248 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమి
 
అబుదాబి: టెస్టుల్లో పాకిస్థాన్ జట్టు తన హవాను కొనసాగిస్తోంది. ఇటీవలే ఆసీస్‌పై 2-0తో సిరీస్ గెలిచిన ఉత్సాహంతో ఉన్న మిస్బా సేన తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టును కూడా నెగ్గింది. 480 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ చివరి రోజు గురువారం తమ రెండో ఇన్నింగ్స్‌లో 70.3 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

దీంతో పాక్ 248 పరుగుల భారీ తేడాతో నెగ్గి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. మూడో టెస్టు 17 నుంచి దుబాయ్‌లో జరుగుతుంది. యాసిర్ షాకు మూడు వికెట్లు, రాహత్ అలీ, ఇమ్రాన్ ఖాన్, జుల్ఫికర్ బాబర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఈ విజయంతో మిస్బా పాక్ తరఫున అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా నిలిచాడు. గతంలో ఇమ్రాన్, జావేంద్ మియాందాద్ సంయుక్తంగా 14 మ్యాచ్‌లు నెగ్గగా మిస్బా కెప్టెన్సీలో ఇది 15వ టెస్టు విజయం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement