ఘోర ప్రమాదం
తహసీల్దార్ సహా నలుగురి దుర్మరణం
బెరైడ్డిపల్లె మండలం కై గల్ వద్ద పలమనేరు-కుప్పం రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో వి.కోట తహసీల్దార్ మురళీధర్ మరో ముగ్గురు రెవెన్యూ ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు.
బెరైడ్డిపల్లె/పలమనేరు: మదనపల్లెలో ఆదివారం నిర్వహిస్తున్న రెవెన్యూ అసోసియేషన్ ఎన్నికల్లో పాల్గొనేందుకు బొలెరోలో బయలుదేరిన వి.కోట తహసీల్దార్ మురళీధర్ (40), జూనియర్ అసిస్టెంట్ కేఆర్ హరినాథ్ (50), అటెండర్ పి.కృష్ణవేణి(26) బెరైడ్డిపల్లె మండలం కై గల్ వద్ద పలమనేరు-కుప్పం రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అలాగే ఎంఆర్ఐ టి.జాన్ సుందరం(45), డ్రైవర్ ఆనంద్(36), సీనియర్ అసిస్టెంట్ ఎన్ఆర్ బాలాజీరావు(35), ఆఫీస్ సబార్డినేట్ ఇ.స్వామినాథం పిళ్లై(37), బాలాజీరావు స్నేహితుడు లోకేష్(36) తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబాల్లో విషాదం అలుముకుంది. పోలీసుల కథనం మేరకు..
వి.కోట తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఆదివారం ఉదయం బొలెరో వాహనాన్ని మాట్లాడుకుని మదనపల్లెలో జరిగే రెవెన్యూ సంఘం ఎన్నికలకు బయలుదేరారు. కై గల్ గ్రామం దాటిన తర్వాత ముందు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో బొలెరో వాహనం వి.కోట వైపు వెళుతున్న లారీని ఢీకొంది. బొలెరో వాహనం లారీ ఇంజిన్ కిందకు దూసుకుపోవడంతో నుజ్జు నుజ్జు అరుుంది. బొలెరోలో డ్రైవర్ పక్కన కూర్చున్న వి.కోట తహసీల్దార్ రాచపూడి మురళీధర్, మధ్య వసరుసలో కూర్చున్న జూనియర్ అసిస్టెంట్ కేఆర్ హరినాథ్, అతని పక్కనే ఉన్న అటెండర్ పి.కృష్ణవేణి అక్కడికక్కడే మృతి చెందారు. వీరి శరీరభాగాలు వాహనంలోనే ఇరుక్కుపోయారుు. తీవ్రంగా గాపడిన ఎంఆర్ఐ టి.జాన్ సుందరం, డ్రైవర్ ఆనంద్, సీనియర్ అసిస్టెంట్ ఎన్ఆర్ బాలాజీరావు, ఆఫీస్ సబార్డినేట్ ఇ.స్వామినాథం పిళ్లై, బాలాజీరావు స్నేహితుడు లోకేష్‌ను స్థానికులు 108లో కుప్పం మెడికల్ కాలేజికి తరలించారు. అక్కడ ఎంఆర్ఐ జాన్ సుందరం మృతి చెం దాడు. డ్రైవర్‌కు రెండు కాళ్లు విరిగిపోయారుు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రకి తరలించారు. సంఘటనా స్థలాన్ని పలమనేరు డీఎస్పీ శంకర్, సీఐలు రవికుమార్, సురేందర్ రెడ్డి పరిశీలించారు.
ఏరియా ఆస్పత్రి వద్ద బంధువుల ఆర్తనాదాలు
మృతుల బంధువులు, రెవెన్యూ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పలమనేరు ఏరియా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను చూసి వారు చేస్తున్న ఆర్తనాదాలతో ఆస్పత్రి దద్దరిల్లింది. మృతుల కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి, జేసీ గిరీషా, తిరుపతి, మదనపల్లె సబ్కలెక్టర్లు నిశాంత్‌కుమార్, వెట్రిసెల్వి పలమనేరు వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్లు రాకేష్ రెడ్డి, సీవీ కుమార్, వి.కోట కన్వీనర్ బాల గురునాథ్, టీడీపీ ఇన్చార్జ్ సుభాష్ చంద్రబోస్ పరామర్శించారు.
అతని టైమ్ బాగుంది
వి.కోట తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఏఆర్ఐ రమ ణ కూడా అదే వాహనంలో మదనపల్లె బయలుదేరాల్సి ఉంది. ఆయన పలమనేరులో నివాసముంటున్నారు. మదనపల్లె వెళ్లేందుకు వేచి ఉండడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
వీకోట, కుప్పంలో విషాదం
మృతి చెందిన వి.కోట తహసీల్ధార్ మురళీధర్ కుప్పానికి చెందిన వారు. ఆయన భార్య వి.కోటలో టీచర్‌గా పనిచేస్తుండడంతో వి.కోటలోనే కాపురం ఉంటున్నారు. హరికృష్ణ వి.కోటకు చెందిన వారు. కృష్ణవేణి, జాన్ సుందరం కూడా కుప్పంలోనే కాపురముంటున్నారు. గాయపడిన డ్రైవర్ ఆనంద్ కుప్పం సమీపంలోని గుండ్లనారుునిపల్లెకు చెందిన వారు. బాలాజీరావు, లోకేష్, స్వామినాథం పిళ్లై వి.కోటలోనే ఉంటున్నారు. ఆ రెండు ప్రాంతాల్లో విషాదం అలుముకుంది.
ముఖ్యమంత్రి ప్రగాఢ సంతాపం
చిత్తూరు (కలెక్టరేట్): మృతి చెందిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది కుటుంబాలకు సీఎం చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, జిల్లా కలెక్టర్ సిద్దార్థ్‌జైన్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు.