breaking news
Palavaram spillway concrete works
-
పోలవరం స్పిల్వే కాంక్రీట్ పనులు ప్రారంభం
పోలవరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు స్పిల్వే కాంక్రీట్ పనులకు శంకుస్థాపన చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.59 గంటలకు ప్రాజెక్టు స్పిల్ వే కాంక్రీట్ పనులను ఆరంభించారు. 52 బ్లాకులుగా స్పిల్వే నిర్మాణం జరగనుంది. ఇక కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, వెంకయ్యనాయుడు, , నిర్మలా సీతారామన్ తదితరులను ఆహ్వానించినా వారు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. కేంద్రమంత్రులు వస్తారని కాంక్రీట్ పనుల శంకుస్థాపనను రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. అయితే వాళ్లు ఈ కార్యక్రమానికి గైర్హాజరై చంద్రబాబుకు షాకిచ్చారు. -
పోలవరం స్పిల్వే కాంక్రీట్ పనులు ప్రారంభం