Palle cheruvu
-
సాహసాలు చెయ్యొద్దు
-
దయచేసి సాహసాలు చేయొద్దు: సీపీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరద ముంపు నేపథ్యంలో ఏదైనా అత్యవసరం ఉంటే 100 కి ఫోన్ చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. ఆయన ఆదివారం ఉదయం అధికారులతో కలిసి పల్లె చెరువు, అప్ప చెరువు, గగన్ పహాడ్, నీట మునిగిన పలు కాలనీల్లో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇబ్బందిగా ఉన్నవాళ్లని పునరావాస కేంద్రాలకు రావాలని చెప్పాం. వాతావరణ శాఖ సూచనల మేరకు రానున్న రెండు, మూడు రోజులు భారీ వర్ష సూచనలు ఉన్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. (చదవండి: హయత్ నగర్ కార్పోరేటర్‌పై దాడి) అవసరమైతే తప్ప బయటకు రాకూడదు. దయచేసి వర్షం, వరద నీటిలో వాహనదారులు సాహసాలు చేయొద్దు. వరద నీటిలో చిక్కుకునే అవకాశం ఉంది. మళ్లీ వారిని బయటకు తీసుకురావాలంటే రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగాల్సి ఉంటుంది. అందుకే ఎమర్జెన్సీ ఉంటే తప్ప జనాలు బయటకు రావొద్దు. ఇక నాలాల కబ్జాలపై అధికారులతో మాట్లాడాం. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. విద్యుత్ సరఫరా కూడా పునరుద్దరణ జరుగుతోంది’ అని సజ్జనార్ తెలిపారు. -
భారీ వరద: ఏ క్షణామైనా తెగిపోయే ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగర శివారులోని రాజేంద్రనగర్ మైలార్ దేవుపల్లి సమీపంలోని పల్లె చెరువు ప్రమాదకర స్థాయికి చేరుకుంది.. భారీ వరదలతో నిండుకుండాలా మారిపోయింది. వరద ఉధృతి క్షణక్షణం పెరుగుతూ ఉండటంతో చెరువుకట్ట ఏ క్షణామైనా తెగిపోయే ప్రమాదం ఉంది. చెరువు కట్ట తెగకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిమెంట్ బస్తాల్లో ఇసుకను నింపి కట్టకు సపోర్టుగా వేస్తున్నారు. కొంతమేర వర్షం తగ్గినప్పటికీ.. వరద తగ్గకపోవడంతో ఇప్పటికే కట్టకు చిన్నబిన్న బుంగలు పడి నీరు బయటకు వస్తోంది. చెరువులో నీటినిల్వ ప్రమాదకరస్థాయికి చేరుకోవడంతో సుభాన్ కాలనీ వాసులు భయాందోళనలో ఉన్నారు. (హైదరాబాద్ సీపీ ఇంట్లోకి వరదనీరు) గతవారం రోజులుగా వస్తున్న వరదలకు ఇప్పటికే సుభాన్ కాలనీలో ఐదు అడుగుల మేర బురద చేరింది. కార్లు, ద్విచక్రవాహనాలు బుదరలో ఇరుక్కుపోయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో కనీసం వాహనాల ఆనవాళ్లు కూడా కనిపించనంత బురద చేరింది. తమ పరిస్థితిని పట్టించుకోవడానికి ఏ ఒక్క అధికారి కూడా రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో పల్లె చెరువు సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పల్లె చెరువు జలదిగ్బంధనంలో చాంద్రాయణగుట్ట, ఫలక్ నామా ప్రాంతాలు చిక్కుకోనున్నాయి. పల్లె చెరువు ప్రాంతాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పరిశీలించారు. ఎలాంటి ప్రమాదం జరుగకముందే స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఇక్కడ పర్యటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని.. పల్లె చెరువు సమీపంలో ఎక్కడ కూడా కబ్జాలు గురైన దాఖలాలు లేవన్నారు. -
పాతబస్తీలోని పల్లె చెరువుకు గండి
-
పాతబస్తీలోని పల్లె చెరువుకు గండి
హైదరాబాద్: పాతబస్తీలో బండ్లగూడ పల్లెచెరువుకు గండి పడింది. చెరువుకు గండి పడి రోడ్డుపైకి భారీగా నీరు వచ్చి చేరడంతో నాలుగు కిలోమీటర్ల వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టుప్రాంతాలు జలమయమైయ్యాయి. ఆలీనగర్ బస్తీ ఇళ్లు నీటమునిగాయి. మోకాళ్ల లోతులో బస్సు నీట మునగడంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. స్థానికులు, పోలీసులు బస్సును ఒడ్డుకు చేర్చి ప్రయాణికులను రక్షించినట్టు తెలిసింది. దీనిపై అధికారులు సహాయక చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.