గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు
శ్రీకాళహస్తి(చిత్తూరు): గుప్త నిధులు లభిస్తాయని కొందరు వ్యక్తులు పురాతన ఆలయం సమీపంలో క్షుద్రపూజలు నిర్వహించారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లోని రాజీవ్‌నగర్ కైలాసగిరి కొండల్లో గురువారం రాత్రి జరిగింది. వివరాలు.. స్థానిక పనసకోనలో ఉన్న పురాతన శివలింగాల సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించి తవ్వకాలు జరుపుతున్నారు.
ఇది గుర్తించిన స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు పోలీసులతో సహా సంఘటనా స్థలానికి చెరుకుని విచారణ చేపడుతున్నారు. కాగా.. రెండు రోజులుగా తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు ఆ ప్రాంతంలో తిరిగారని స్థానికులు అంటున్నారు.