pannel board
-
ఎంపీ విజయసాయి రెడ్డికి కీలక బాధ్యతలు
-
వర్క్ ఫ్రమ్ హోమ్: ఉద్యోగులకు టీసీఎస్ కీలక ఆదేశాలు
సాక్షి, ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్ తన ఉద్యోగులకు మరో కీలక సమాచారాన్ని అందించింది. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి గుడ్ బై చెప్పేందుకు దాదాపు అన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయి. టీసీఎస్ కూడా తన ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పిస్తోంది. అయితే ప్రత్యేక కారణాల రీత్యా ఇంటినుంచి పని చేయాలనుకునే వారికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుంచి పనిచేయాల్సి వస్తే.. కంపెనీ అంతర్గత వైద్యుల నిర్ధారణ అవసరం అని తాజాగా వెల్లడించింది. ఆయా ఉద్యోగులు వారి రోగ నిర్ధారణలు, చికిత్సలు, ధృవీకరణ పత్రాలను కంపెనీ-ప్యానెల్ మెడికల్ కమిటీ ద్వారా ధృవీకరించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇలా కొంతమంది ఉద్యోగులకు ఇంటినుండి పని చేయడానికి అనుమతి ఇచ్చినట్టు టీసీఎస్ తెలిపింది. (Maiden Pharma వివాదాస్పద మైడెన్కు భారీ షాక్: అక్టోబరు 14 వరకు గడువు) కాగా ఇటీవల ఉద్యోగులకు ఆఫీసులకు రావాలని ఆదేశించిన టీసీఎస్. ఇపుడిక ఉద్యోగుల హాజరును పర్యవేక్షిస్తోంది. వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసులకు రావాలని ఆదేశించింది. కంపెనీ సూపర్వైజర్లు రూపొందించిన రోస్టర్ ప్రకారం, కార్పొరేషన్ తన సిబ్బందిని సెప్టెంబర్ 22న తమ కార్యాలయాలకు రిపోర్ట్ చేయాల్సిందిగా అభ్యర్థించింది. ఇప్పటికే ఆఫీసులకు వస్తున్నారని టీసీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. టీసీఎస్‌లోని 6,16,171 మంది ఉద్యోగులలో మూడింట ఒక వంతు మంది కార్యాలయం నుంచే పనిచేయడం ప్రారంభించారని సోమవారం కంపెనీ త్రైమాసిక ఆదాయ ప్రకటన సందర్భంగా చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. డిసెంబరు నుంచి రోస్టర్ ఆధారిత హాజరు తప్పనిసరిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. (మస్క్ కొత్త బిజినెస్:10వేల బాటిల్స్ విక్రయం, నెటిజన్ల సెటైర్లు) -
నా ప్యానల్లో గ్లామర్ లేదు, పని చేసేవాళ్లే ఉన్నారు
-
ఈకామర్స్‌కు షాక్: రంగంలోకి నందన్ నీలేకని
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ సృష్టికర్త, ఇన్ఫోసిస్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్, నందన్ నీలేకనికి మోదీ సర్కార్ కీలక బాధ్యతలను అప్పగించింది. డిజిటల్ మోనోపలీకి చెక్‌పెట్టే మార్గాలపై సలహా ఇచ్చే ప్రభుత్వ ప్యానెల్లో నీలేకనిని సభ్యుడిగా చేర్చింది. తద్వారా ఈకామర్స్ రంగంలో అక్రమాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సప్లయ్ చెయిన్‌ను డిజిటలైజ్ చేయడం, కార్యకలాపాలను ప్రామాణీకరించడం, మరిన్ని సరఫరాదారులను చేర్చడాన్ని ప్రోత్సహించడం, లాజిస్టిక్స్ సామర్థ్యాలు, వినియోగదారులకు విలువను పెంచుతుందని భావిస్తున్నారు. డిజిటల్ గుత్తాధిపత్యాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తొమ్మిది మంది సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ తొమ్మిది మంది సభ్యుల సలహా మండలిలో నందన్ నీలేకనిని కూడా చేర్చడం విశేషం. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) పేరుతో ఏర్పటవుతున్న ఈ కమిటీ నిబంధనల అమలును వేగంగా ట్రాక్ చేయడానికి సూచనలు ఇస్తుందని అధికారిక వర్గాలు సోమవారం తెలిపాయి. వాణిజ్య శాఖకు చెందిన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక మండలి (డీపీఐఐటీ)జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుంది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసిఐ), ప్రాథమికంగా డిజిటల్ గుత్తాధిపత్యాలను అరికట్టడమే లక్ష్యంగా ఇది పనిచేస్తుంది. ఐటీ దిగ్గజం నందన్ నీలేకనీతో పాటు, నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ ఆర్ఎస్ శర్మ, క్యూసిఐ చీఫ్ ఆదిల్ జైనుల్ భాయ్, అవానా క్యాపిటల్ వ్యవస్థాపకుడు అంజలి బన్సాల్, డిజిటల్ ఇండియా ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు అరవింద్ గుప్తా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెడ్ దిలీప్ అస్బే ఉన్నారు. ఇంకా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ హెడ్ సురేష్ సేథి, ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ చీఫ్ ప్రవీణ్ ఖండేల్వాల్, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ కుమార్ రాజగోపాలన్ ఈ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు. కాగా నందన్ నీలేకని యుఐడీఏఐ చైర్మన్ గానూ, టాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, న్యూ పెన్షన్ స్కీమ్, జీఎస్టీ సహా ఐదు కీలక ఆర్థిక రంగ ప్రాజెక్టులకు భారత ప్రభుత్వ సాంకేతిక సలహా బృందానికి నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
టెల్కోలకు భారీ ఊరట లభించనుందా?
సాక్షి, న్యూఢిల్లీ: టెల్కోల నుంచి భారీగా రూ. 92,000 కోట్లు రాబట్టుకోవడానికి సుప్రీంకోర్డు డాట్ (టెలకమ్యూనిషన్ల శాఖ)కు అనుమతించిన నేపథ్యంలో- ఆయా కంపెనీల ఆర్థిక స్థితిగతులపై సమీక్షించి, తగిన సలహాలు ఇవ్వడానికి కేంద్రం మంగళవారం ఒక సెక్రటరీల కమిటీ (సీఓఎస్)ని ఏర్పాటు చేసింది. సుప్రీం రూలింగ్ నేపథ్యంలో- టెలికం రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారే అవకాశం ఉందన్నజారే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. టెలికంకు భారీ బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్రం మొగ్గు చూపుతోందని, ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై సెక్రటరీల కమిటీ దృష్టి సారిస్తుందని వార్తలు వస్తున్నాయి. కమిటీకి క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తారు. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియాల వంటి సర్వీస్ ప్రొవైడర్లు ఎదుర్కొంటున్న ‘‘ఆర్థిక ఒత్తిడి’’ని ‘‘అన్ని కోణాల్లో’’ పరిశీలించి, తీవ్రతను తగ్గించడానికి సూచనలు ఇవ్వడానికి కమిటీ ఏర్పాటయినట్లు టెలికం వర్గాలు తెలిపాయి. ఆర్థిక, న్యాయ, టెలికం కార్యదర్శులు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కమిటీ త్వరలో సమావేశమై, ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో తన సిఫారసులను కేంద్రానికి సమర్పిస్తుందని సమాచారం. ప్యాకేజ్‌లో ఏముంటాయ్? స్పెక్ర్టమ్ చార్జీల తగ్గింపు ఉచిత మొబైల్ ఫోన్ కాల్స్‌కు ముగింపు చౌక డేటా టారిఫ్‌లకు సెలవు చెప్పడం నగదు లభ్యతలో ఇబ్బందులు తలెత్తకుండా 2020-21, 2021-22కు సంబంధించి స్పెక్ర్టమ్ వేలం చెల్లింపుల వాయిదా వేయడం. యూఎస్ఓఎఫ్ (యూనివర్షల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్) చార్జ్ని 3 శాతానికి తగ్గించడం. నేపథ్యం ఇదీ... కొత్త టెలికం విధానం ప్రకారం.. టెల్కోలు తమ సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్)లో నిర్దిష్ట వాటాను ప్రభుత్వానికి వార్షిక లైసెన్సు ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. దీనితో పాటు స్పెక్ట్రం వినియోగానికి గాను నిర్దిష్ట చార్జీలు (ఎస్‌యూసీ) చెల్లించాలి. అయితే ఈ ఏజీఆర్ లెక్కింపు విషయంలో వివాదం నెలకొంది. అద్దెలు, స్థిరాస్తుల విక్రయంపై లాభాలు, డివిడెండు మొదలైన టెలికంయేతర ఆదాయాలు కూడా ఏజీఆర్ కిందే వస్తాయని, దానిపైనే లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుందని టెలికం వివాదాల పరిష్కార, అపీలేట్ ట్రిబ్యునల్ (టీడీశాట్) గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్సు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల భారం భారీగా పెరిగిపోనుండటంతో టీడీశాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ టెల్కోలు .. సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై జూలైలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం తమ వాదనలు వినిపించింది. అప్పటిదాకా టెల్కోలు రూ. 92,000 కోట్ల మేర లైసెన్సు ఫీజులు బకాయి పడ్డాయని తెలిపింది. తాజాగా ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఏడాది జూలై నాటికి డాట్ లెక్కల ప్రకారం ఎయిర్టెల్ అత్యధికంగా రూ. 21,682.13 కోట్లు, వొడాఫోన్ రూ. 19,823.71 కోట్లు లైసెన్సు ఫీజు కింద బకాయి పడ్డాయి. చదవండి : టెలికంలో భారీగా ఉద్యోగాల కోత -
విద్యుదాఘాతంలో రైతు మృతి
నర్సాపూర్ రూరల్ : వ్యవసాయ బోరు మోటార్‌కు చెందిన ప్యానల్ బోర్డుకు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని చిన్నచింతకుంటలో సోమవారం వేకువజామున చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బ్యాగరి స్వామి (33) తనకున్న ఎకరం భూమిలో కరెంట్ కోతను దృష్టిలో ఉంచుకుని రబీలో మొక్క జొన్నను సాగు చేస్తున్నాడు. కాగా వ్యవసాయానికి షిఫ్ట్ పద్ధతిన ఒక వారం రాత్రి ఒక వారం పగలు కరెంట్ సరఫరా అవుతోంది. సోమవారం వేకువజామున 3 గంటల సమయంలో కరెంట్ సరఫరా అవుతుందని తెలుసుకుని ఆదివారం రాత్రి సుమారు పది గంటల సమయంలో ఇంటి నుంచి బయలు దేరాడు. వేకువజామున కరెంట్ సరఫరా రాగానే స్తంభం నుంచి ప్యానల్ బోర్డు లోకి విద్యుత్ సరఫరా చేసే తీగ ఊడిపోయి ఉండడంతో మోటార్ ఆన్ కాలేదు. దీంతో బ్యాటరీ సాయంతో స్తంభం నుంచి కరెంట్ సరఫరా అయ్యే తీగను ప్యానల్ బోర్డుకు బిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం అటుగా వెళ్లిన ఇరుగు పొరుగు రైతులు విషయాన్ని గమనించి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి తరలి వెళ్లారు. మృతుని భార్య వీరమణి, ఇద్దరు కూతుళ్ళు మైత్రి (5) వైష్టవి (2)లతో పాటు తల్లి పోచమ్మలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ గోపీనాథ్ తెలిపారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సంఘటన స్థలాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎంపీపీ అధ్యక్షుడు రామన్నగారి శ్రీనివాస్‌గౌడ్, గ్రామ సర్పంచ్ సరళలు కోరారు. రాత్రి కరెంటే స్వామి ప్రాణాలు తీసిందని తోటి రైతులు ఆరోపించారు. సరైన వర్షాలు పడక రైతులు బోరు బావులను నమ్ముకుని పంటలు సాగు చేసుకుంటూ అనేక కష్టాలు పడుతున్నారని దీనికి తోడు కరెంట్ సమస్యలు తోడుకావడంతో రైతుల ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.