paralyzed
-
మనిషి నడవగలుగుతున్నాడు..అద్భుతం చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ!
సరిగ్గా 12 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంతో మంచానికి పరిమితమైన తాను తిరిగి ఇక నడవలేనని అనుకున్నాడు. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాయి. ఎలా అంటారా? నెదర్లాండ్‌లోని లైడెన్‌లో నివాసం ఉంటున్న గెర్ట్ జన్ ఓస్కామ్ (Klara Sesemann) 2011లో సైక్లింగ్ చేసే సమయంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మెడ విరగడంతో శరీరంలోని ఇతర భాగాలకు సంబంధాలు తెగిపోవడంతో అతని శరీరం చచ్చుబడిపోయింది. దీంతో అతను నడవలేడు, కూర్చోలేడని చికిత్స చేసిన డాక్టర్లు తేల్చి చెప్పారు. డాక్టర్లు చెప్పినట్లుగా ఓస్కామ్ కొన్ని సంవత్సరాలు అలాగే మంచానికే పరిమితమయ్యాడు. కానీ అనూహ్యంగా సైన్స్, టెక్నాలజీ అద్భుతం చేయడంతో ఇప్పుడు సాధారణ మనిషిలా నడుస్తున్నాడు. ఓస్కామ్ బ్రెయిన్, వెన్నుముక, పాదాలలో ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్స్‌ను అమర్చండంతో సాధ్యమైందని డాక్టర్లు చెబుతున్నారు. చదవండి👉 ఇంట్లో ఇల్లాలు, ఇంటింటికీ తిరిగి సబ్బులమ్మి.. 200 కోట్లు సంపాదించింది! సైన్స్ టెక్నాలజీ ఓస్కాముకు ఎలా ప్రాణం పోసింది నివేదిక ప్రకారం.. స్విట్జర్లాండ్‌కు చెందిన లాసాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జోసిలిన్ బ్లాచ్ బ్రెయిన్ ( న్యూరోసర్జన్) పై పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల ముఖ్య ఉద్దేశం ఏదైనా ప్రమాదంలో బ్రెయిన్ సమస్య తలెత్తిన వారికి మళ్లీ పునర్జన్మనిచ్చేలా టెక్నాలజీ సాయంతో బ్రెయిన్ ఇంప్లాంట్ చేయనున్నారు. ఇందుకోసం డిజిటల్ బ్రిడ్జ్ పేరుతో పరికరాన్ని సైతం తయారు చేశారు. అయితే జూలై 2021లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓస్కామ్పై లౌసాన్‌లోని ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్లు టెక్నాలజీకల్ డివైజ్ (Brain implants)ను అమర్చారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ జోసెలిన్ బ్లాచ్ మాట్లాడుతూ ఈ బ్రెయిన్ ఇంప్లాంట్ పరిశోధనలు ప్రారంభ దశలో ఉన్నాయని, ఓస్కామ్ తరహా బ్రెయిన్ సమస్యలు, పక్షవాతం ఉన్న రోగులకు చికిత్స అందించే ఈ ప్రక్రియ అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని అన్నారు. చదవండి👉 హైదరాబాద్‌లో ఆ ఏరియా ఇళ్లే కావాలి.. కొనుక్కునేందుకు ఎగబడుతున్న జనం? బ్రెయిన్ ఇంప్లాంట్ ఆపరేషన్ ఎలా జరిగింది ముందుగా ప్రొఫెసర్ బ్లోచ్...ప్యారలైజ్తో బాధపడుతున్న జాన్ పుర్రెలో 5సెంటీమీటర్ల వ్యాసార్ధంలో రెండు గుండ్రటి రంద్రాలు పెట్టి.. ఆ రంద్రాల సాయంతో ప్రమాదాలతో బ్రెయిన్లోని కదలికల్ని నియంత్రించే బాగాన్ని కత్తిరించారు. అనంతరం వైర్లెస్ రెండు డిస్క్ ఆకారపు ఇంప్లాంట్లను (డిజిటల్ బ్రిడ్జ్) బ్రెయిన్లో అమర్చారు. అవి జాన్ ఏం చేయాలని అనుకుంటున్నాడో తెలుసుకొని అతను తన తలకు పెట్టకున్న హెల్మెట్‌లో ఉన్న రెండు సెన్సార్లకు సిగ్నల్స్ అందిస్తాయి. దీంతో ముందుగా ప్రోగ్రామ్ చేయబడి బ్రెయిన్ ఇంప్లాంట్ సాయంతో జాన్ కదిలేలా చేస్తోంది. ఇలా బ్రెయిన్‌తో పాటు వెన్నుపూస,పాదలలో ఇంప్లాంట్ చేయడంతో నడిచేందుకు సాధ్యమైంది. కొన్ని వారాల శిక్షణ తర్వాత అతను వాకర్ సహాయంతో నిలబడి నడవగలడని సైంటిస్ట్‌లు గుర్తించారు. ప్రాజెక్ట్‌కి నాయకత్వం వహించిన లౌసాన్‌లోని ఎకోల్ పాలిటెక్నిక్ ఫెడరేల్ (EPFL)కి చెందిన ప్రొఫెసర్ గ్రెగోయిర్ కోర్టిన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో అతని కదలికలు వేగవంతం అవుతాయని చెప్పారు. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను ఓస్కామ్ మాట్లాడుతూ 40 ఏళ్ల వయస్సులో నడుస్తున్నందుకు ఆనందంగా ఉన్నాను. ‘ నన్ను నేను పసిబిడ్డగా భావిస్తున్నారు. మళ్లీ నడవడం నేర్చుకుంటున్నాను.ఇది సుదీర్ఘ ప్రయాణం. ఇప్పుడు నేను నిలబడి నా స్నేహితుడితో కలిసి టీ తాగ గలుగుతున్నాను. ఆ ఆనందం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను అని సంతోషం వ్యక్తం చేశారు. చదవండి👉 రూ.2000 నోట్లను వదిలించుకోవడానికి వీళ్లంతా ఏం చేశారో చూడండి! -
మంచంపైనే ఉండి కోట్ల సంపాదన.. సంకల్పం ఉండాలంతే!
రోడ్డు ప్రమాదంతో మంచానికి పరిమితమైన కేరళలోని కాసరగడ్ జిల్లాకు చెందిన 47 ఏళ్ల వ్యాపారి.. కోట్ల విలువైన కలప బిజినెస్‌ను చేస్తున్నారు. మంచానికే పరిమితమైనా సరే.. తన ఎడమ చెవికి ఎయిర్ పాడ్ తగిలించుకుని బిజినెస్‌ను పర్యవేక్షిస్తున్నారు. కలపకు సంబంధించిన టింబర్ డిపోల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసుకొని, వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. టీఏ షానవాస్ స్వస్థలం కాసరగోడ్ జిల్లాలోని ఈస్ట్ ఎలేరి పరిధిలో ఉన్న కంబలోర్. వ్యాపారంలో తీరిక లేకుండా ఉన్న సమయంలో 2010, మే 6న అనుకోకుండా ఓ ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించడంతో ఆయనకు స్పైనల్ కార్డ్ దెబ్బతిందని, ఆపరేషన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారమని డాక్టర్లు సూచించారు. దీంతో నాలుగు నెలలు ఆయన ఐసీయూలో మంచానికే పరిమితమయ్యారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఆపరేషన్ చేసి ఆస్పత్రిలోనే 5 నెలలు ఉంచారు. ఆయన మెడ భాగంలో స్టీల్ రాడ్ వేయడంతో మెడ కొంచెం కదిలించడానికి వీలవుతోందని వైద్యులు తెలిపారు. 9 నెలల తర్వాత తన వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించాలని ఆసుపత్రిలోనే నిర్ణయించుకున్నారు. తన భార్య సాయంతో ఓ లారీ కలప కొని వ్యాపారం ప్రారంభించారు. లాభాలు రావడంతో మరలా కలప కొని అమ్మడం ప్రారంభించారు. ఇలా వ్యాపారం మళ్లీ గాడిలో పడింది. అయితే ఇదంతా కూడా ఆయన మంచం మీది నుంచే పర్వవేక్షణ చేశారు. ఇప్పుడు షనవాస్ ఆఫ్రికా, మలేషియా, మాల్దీవుల నుంచి కూడా కలప తెప్పిస్తున్నారు. కేరళలో భవన నిర్మాణాలకు అవసరమైన కలప విక్రయిస్తున్నారు. అయితే జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మనం వాటిని స్వీకరించాలని అంటున్నారు షాన్వాస్. వ్యాపారం విజయవంతంగా కొనసాగించడంలో తన కుటుంబ సభ్యులు, మిత్రుల సహకారం ఎంతో ఉందని తెలిపారు. -
స్పందనతో సొంతిల్లు
-
భారం తగ్గించండి...
విజయనగరం : చిత్రంలో కనిపిస్తున్న దంపతుల పేర్లు సొంటి వెంకటరావు, సత్యవతి. వీరిది జామి మండలంలోని ఆండ్ర గ్రామం. వెంకటరావుకు పక్షవాతం రావడంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. అసలే నిరుపేద కుటుంబం. పోషణ భారంగా మారింది. భర్తను, పిల్లలను పోషించే బాధ్యత సత్యవతిపై పడింది. పనికెళ్తే భర్తను చూసుకునేవారు లేకపోవడంతో జీవనానికి కటకటలాడుతున్నారు. పింఛన్ వస్తే ఆసరా దొరుకుతుందని ఆశించారు. ఇప్పటికే పలు సార్లు దరఖాస్తుచేసినా మంజూరు కాలేదు. ఇరుగుపొరుగువారి సలహా మేరకు కలెక్టర్ కార్యాలయానికి తన భర్తను ఎత్తుకుని వచ్చింది. తన వేదనను కలెక్టర్ వివేక్‌యాదవ్‌కు వివరించింది. పింఛన్ ఇచ్చి భారం దించాలంటూ ప్రాథేయపడింది. కలెక్టర్ బాబు ఏం చేస్తారో వేచిచూడాల్సిందే. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం -
సివిల్ ఆస్పత్రికి చికిత్స చేయరూ!
చిట్యాల : మండల కేంద్రంలోని వైద్య విధానపరిషత్ సామాజిక వైద్యశాల జిల్లా విభజనకు ముందు ప్రసూతి ఆపరేషన్లలో రాష్ట్ర స్థాయిలో రికార్డు సాధించింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్‌రెడ్డి నేతృత్వంలో 190 రోజుల్లో 175 ప్రసూతి ఆపరేషన్లు ఆస్పత్రి నిర్వహించి వైద్యులు రికార్డు నెలకొల్పారు. రోగులకు, గర్భిణీలకు మెరుగైన వైద్యసేవలందిస్తూ భూపాలపల్లి నియోజకవర్గంలో ఆదర్శ ఆస్పత్రిగా పేరు గడించింది. కష్టాలు మొదలు.. ఆస్పత్రికి గత నెల 20 నుంచి కష్టాలు మొదలయ్యాయి. గత నెల 19న స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి వెలిశాల పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఈ క్రమంలో చిట్యాల సివిల్ ఆస్పత్రిలో పని చేస్తున్న నలుగురు డాక్టర్లను డిప్యూటేష¯ŒS పై ఎందుకు పంపావని జిల్లా కో ఆర్డినేటర్ ఆకుల సంజీవయ్యను అడిగారు. దీంతో డిప్యూటేషన్లను రద్దు చేయాల్సింది పోయి మరుసటి రోజు మరో డాక్టర్‌ను జనగాంకు డిప్యూటేష¯ŒS పై పంపారు. మొత్తం నూతన జిల్లాల్లో ఏ ఆస్పత్రి సూపరింటెండెంట్ పోస్టును ఎత్తివేయలేదు. కానీ చిట్యాల సివిల్ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ పోస్టును జిల్లా కో ఆర్డినేటర్ రద్దు చేసినట్లు వైద్యశాఖలో చర్చ జరుగుతోంది. పాత జిల్లాలో పది సివిల్ ఆస్పత్రిల్లో చిట్యాల ఆస్పత్రి పేరు లేకపోవడంతో వచ్చే నిధులు రాకుండాపోయాయనే విమర్శలు వినబడుతున్నాయి. గర్భిణులను వెనక్కి పంపిన వైనం.. సివిల్ ఆస్పత్రిలో ప్రసూతి ఆపరేషన్లు చేసే డాక్టర్ పద్మను సివిల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా జయశంకర్ జిల్లా కో ఆర్డినేటర్‌గా నియమించారు. ఈక్రమంలో బుధవారం ఆరుగురు గర్భిణులు ప్రసూతి కోసం ఆస్పత్రికి వచ్చారు. ఇప్పటి వరకు 100కు పైగా ప్రసూతి ఆపరేషన్లు చేసిన డాక్టర్ పద్మ ఇప్పుడు చేయలేనని నిరాకరించారు. ఒక ఆపరేష¯ŒSకి అనస్తీషియా డాక్టర్‌కు రూ.1200 లు ఇవ్వలేనని చెప్పడంతో ఆరుగురు గర్భిణులు వెనక్కి పంపడం మండల కేంద్రంలో చర్చనీయాంశమైంది. స్పీకర్ మధుసూదనాచారి, జిల్లా కలెక్టర్ మురళి చిట్యాల సివిల్ ఆస్పత్రిని సందర్శించి అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేసి, ఆస్పత్రికి సూపరింటెండెంట్‌ను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. వైద్యసేవలు, ప్రసూతి కాన్పులు జరిగేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.