పారామెడికోస్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
నల్లగొండ టౌన్: పారామెడికోస్ శిక్షణను గ్రామీణ వైద్యులు సద్వినియోగం చేసుకోవాలని సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకన్న పిలుపునిచ్చారు. బుధవారం చిన వెంకట్‌రెడ్డి ఫంక్షన్హాల్లో జరిగిన సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం పదో వార్షికోత్సవ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైద్యారోగ్యశాఖ పథకాలు విజయవంతం కావడంలో గ్రామీణ వైద్యులు అందిస్తున్న సహకారం మరవలేనిదర్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్యం అందిస్తున్న గ్రామీణ వైద్యులను ప్రభుత్వం మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని అన్ని మండలాలలో సంఘం సభ్యత్వాలను పూర్తి చేసి సంఘాలన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు.
సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.బాలరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ వైద్యులకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలను అందిస్తుందన్నారు. అంతకు ముందు సంఘం జిల్లా కార్యాలయం నుంచి పట్టణంలో ర్యాలీని నిర్వహించారు. సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం జిల్లాగౌరవాధ్యక్షుడు పొనుగోటి హనుమంతరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం రాష్ర్ట గౌరవ సలహాదారు బి.వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు డిఎస్ఎన్ చారి, ప్రధాన కార్యదర్శి బొల్లెపల్లి శ్రీనివాసరాజు, కోశాధికారి జి.రాజశేఖర్‌రావు, ఉపాధ్యక్షుడు వనం యాదగిరిరావు, ప్ర చార కార్యదర్శి బ్రహ్మచారి, నర్సింహారెడ్డి, పి.వెంకటేశ్వర్లుగౌడ్, ఎ.కృష్ణారెడ్డి, ఎం.మధనాచారి, ఎ.యాదగిరి, నజీరుద్దిన్, పి.లలిత, కె.విజయేందర్‌రెడ్డి, మణికుమారి, వెంకటాచారి, ప్రభుదాస్, జహాంగీర్, వాసుదేవులు, చంద్రశేఖర్, కుతుబుద్దిన్, వీరన్న పాల్గొన్నారు.