Paramesh
-
పాపం పరమేశ్..!
హయత్‌నగర్: హయత్‌నగర్ ఠాణా పరిధిలో పరస్పర వాహనాలు ఢీకొట్టిన ఘటనలో పంచాయితీ వద్దన్నందుకు ఒకరి ప్రాణమే పోయింది. కారు, బైక్ ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు బైకర్‌తో గొడవపడుతున్న సమయంలో అటుగా వచ్చిన ఇద్దరు వారించి బైకర్‌ను పంపించారు. దీన్ని తట్టుకోలేక కారులోని వ్యక్తులు మధ్యవర్తిగా వ్యవహరించిన ఇద్దరిని వాహనంలో ఎక్కించుకొని పిడిగుద్దులు కురిపిస్తున్న సమయంలో అనూహ్యంగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో మధ్యవర్తిగా వ్యవహరించిన పరమేశ్ మృతి చెందాడు. మామిడి రాజు గాయపడ్డాడు. మృతుడు పరమేశ్ భార్య వనజారాణి ప్రస్తుతం గర్భిణి. ఇటీవలే అతని కూతురు అనారోగ్యంతో మృతి చెందింది. కొడుకు భరద్వాజ్ ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు మండలం గొల్నెపల్లికి చెందిన సింగపాక పరమేశ్ (29) పెద్దంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కే నగర్లో నివాసముంటూ సమీపంలో ఉన్న ప్రీమీ లామినేషన్ డోర్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని తోటి కార్మికుడు మామిడి రాజుకు చెందిన టాటా ఏస్ ఆటోలో మర్రిపల్లి వైపు వస్తున్నారు. అంతకు ముందు వారి కంపెనీలోనే పనిచేసే సూపర్వైజర్ శ్రీనాథ్ అదే దారిలో బైకుపై వెళ్లాడు. అతని బైక్ ఫతుల్లాగూడకు చెందిన కాటెపాక సతీష్, మర్రిపల్లికి చెందిన ఒంగూరు ప్రశాంత్‌లు ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది. దీంతో వారు శ్రీనాథ్‌తో గొడవకు దిగారు. వారి మద్య వాగ్వాదం నడుస్తుండగానే ఇదే మార్గంలో వెళుతున్న పరమేష్, రాజులు తమ వాహనం ఆపారు. ఆ గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. వారికి తోడుగా కొందరు గ్రామస్తులు వచ్చి నచ్చజెప్పడంతో శ్రీనాథ్ అక్కడి నుంచి వెళ్లి పోయాడు. దీంతో తమకు పరిహారం ఇవ్వకుండానే అతడిని పంపిస్తారా... అతడిని తమకు చూపించండి.. అంటూ పరమేష్, రాజులతో సతీష్, ప్రశాంత్‌లు వాగ్వాదానికి దిగారు. వారు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా కొట్టి బెదిరించి కారులో బలవంతంగా ఎక్కించుకున్నారు. కారులో వారిపై దాడి చేస్తూ పరిసర ప్రాంతంలో తిప్పారు. ఈ క్రమంలో పెనుగులాట జరగడంతో అధిక వేగంతో ఉన్న కారు కుంట్లూర్ రాజీవ్ గృహకల్ప సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న సతీష్, ప్రశాంత్‌లు కారు దిగి పారిపోయారు. పరమేశ్, రాజులు తీవ్రంగా గాయపడ్డారు. రాజు ఇచ్చిన సమాచారంతో వారి కంపెనీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా పరమేశ్ మార్గమధ్యలో మృతి చెందాడు. గాయపడ్డ రాజును ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. నిందితులు ప్రశాంత్, సతీష్‌లు డ్రైవర్లుగా పనిచేస్తూనే జులాయిగా తిరుగుతూ పలు నేరాలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రశాంత్‌పై హయత్‌నగర్ పోలీస్టేషన్లో రెండు కేసులన్నాయని సీఐ సతీష్ తెలిపారు. వారు ఓ కేసులో కోర్టుకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. నిందితులు మార్గమధ్యలో మద్యం తాగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలి.. మృతుడు పరమేశ్ కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు హయత్‌నగర్ పోలీస్టేషన్ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీస్ నాయకులు మల్లెపాక అనీల్‌కుమార్, జోగు రాములు, బీసీ సంఘం నాయకురాలు తండ ఉపేంద్రయాదవ్లు మాట్లాడుతూ.. నిందితులు కావాలనే పరమేష్‌ను హత్య చేశారని, వారిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి కఠినంగా విక్షించాలని డిమాండ్ చేశారు. -
క్షణికావేశానికి నిండు ప్రాణాలు బలి
- ప్రేమ విఫలమైందని యువకుడు.. - సంతానం కలగలేదని వివాహిత - నగరంలో వేర్వేరు చోట్ల ఆత్మహత్య అనంతపురం సెంట్రల్: క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయానికి రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నిండు నూరేళ్లు గడపాల్సిన జీవితాలు పాతికేళ్లు కాగానే అర్ధంతరంగా ఆగిపోయాయి. నగరంలో వేర్వేరు చోట్ల ఓ వివాహిత, ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే...కళ్యాణదుర్గం రోడ్డులోని గణేష్‌నగర్‌లో నివాసముంటున్న లక్ష్మీదేవి (24), రవికుమార్ దంపతులు. పెళ్లయ్యి ఐదేళ్లయినా సంతానం కలగకపోవడంతో మనస్తాపానికి గురైన లక్ష్మీదేవి ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. టూటౌన్ ఎస్ఐ శ్రీనివాసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరిలించారు. లాడ్జిలో యువకుడు ధర్మవరం పట్టణంలో శాంతినగర్‌లో నివాసముంటున్న నాగభూషణం కుమారుడు పరమేష్(24) బీటెక్ వరకు చదువుకున్నాడు. ఉద్యోగాన్వేషణలో భాగంగా రెండు రోజుల క్రితం అనంతపురం వచ్చాడు. శనివారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని లాడ్జిలో రూం అద్దెకుతతీసుకున్నాడు. అదే రోజు రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం లాడ్జి నిర్వాహకులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఉద్యోగం రాకపోవడంతో పాటు ప్రేమలో కూడా విఫలమవడంతో మనస్తాపం చెంది అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. త్రీటౌన్ ఎస్ఐ నారాయణరెడ్డి కేసు నమోదు చేశారు. -
విద్యార్థినికి ప్రేమలేఖలు
ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగింపు ఈఓ మోత్కూరు(నల్గొండ జిల్లా): విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగేలా ప్రోత్సహించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినికి ప్రేమ లేఖలు రాసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం అడ్డగూడూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడేళ్లుగా ఆర్డ్స్ అండ్ క్రాఫ్స్ టీచర్‌గా పనిచేస్తున్న గూడెపు పరమేశ్ అదే పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి తనను ప్రేమించాలంటూ ప్రేమ లేఖలు రాశాడు. గతంలో ప్రేమ లేఖలు రాసిన సందర్భంలో పరమేశ్‌ను ప్రధానోపాధ్యాయుడు మందలించాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పులేదు. గత 15 రోజుల్లో రెండుసార్లు విద్యార్థినికి ప్రేమలేఖలు రాశాడు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో వారు ఉపాధ్యాయుడిపై ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదుచేశాడు. డీఈఓ ఆదేశాల మేరకు ఎంఈఓ విచారణ జరిపారు. అనంతరం ప్రేమ లేఖలు రాసిన ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎంఈఓ అంజయ్య, ప్రధానోపాధ్యాయుడు అనంతరెడ్డి తెలిపారు. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు చెప్పారు. -
ప్రాణభయంతో పీఎస్ ఎదుట ఆత్మహత్యాయత్నం
కల్యాణదుర్గం: ప్రాణభయంతో ఓ వ్యక్తి పోలీస్‌స్టేషన్ ముందే ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండల కేంద్రంలోని పీఎస్ ఎదట జరిగింది. వివరాలు.. బ్రహ్మసముద్రం మండలం కపటలింగనపల్లి గ్రామానికి చెందిన జంగలి పరమేష్ అనే వ్యక్తి గ్రామంలోని మచ్చప్ప, కనియప్పలు నుంచి తనకి ప్రాణభయం ఉందని వారం క్రితం మండలంలోని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, బ్రహ్మసముద్రం మండల పోలీసులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో సోమవారం పరమేష్ కల్యాణదుర్గం పోలీస్‌స్టేషన్ ఎదట కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన పోలీసులు పరమేష్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బోర్ లారీ యాక్సైల్ పడి వ్యక్తి మృతి
పలమనేరు (చిత్తూరు): బోర్‌లారీ యాక్సైల్ రోడ్డుపై ప్రయాణిస్తున్న పాదచారులపై పడటంతో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈసంఘటన బుధవారం రాత్రి చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. వివరాలు.. జార్ఖండ్‌కు చెందిన పరమేష్(21), సంజీవ్(22) పలమనేరులోని ఇండస్ట్రియల్ పవర్లూమ్లో పనిచేస్తున్నారు. కాగా, బుధవారం చెన్నై-బెంగళూరు జాతీయరహదారిపై నడుస్తుండగా బోర్‌లారీ యాక్సైల్ పడింది. ఈ ప్రమాదంలో పరమేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన సంజీవ్‌ను 108లో పలమనేరు ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు రోజుల పాత్రకు 28 లక్షలా?
మూడు పదుల వయసులో కూడా కుర్రకారు హాట్ ఫేవరెట్‌గా భాసిల్లుతున్న బాలీవుడ్ తార బిపాసాబసు. గతంలో ఉన్నంత హవా ఇప్పుడు లేకపోయినా... ఖాళీగా అయితే లేరు ఆమె. ‘టక్కరి దొంగ’ తర్వాత దక్షిణాదిలో బిపాసా ఏ సినిమా చేయలేదు. ఆమెను దక్షిణాదిలో నటింపజేయాలని పలు ప్రయత్నాలు జరిగినా అవి ఫలించలేదు. ఇటీవలే అలాంటి ఓ విఫలయత్నం జరిగింది. కన్నడం నుంచి బిప్స్కి ఓ ఆఫర్ వచ్చింది. సినిమా పేరు ‘మమ్ము టీ అంగడి’. ఇందులో ఓ అతిథి పాత్ర ఉంది. రెండు రోజులు మాత్రమే షూటింగ్. దానికే 28 లక్షల రూపాయలు పారితోషికం ఇస్తామని సదరు చిత్ర దర్శక, నిర్మాతలు బిప్స్ ముందు భారీ ఆఫర్ ఉంచారట. నిజానికి అంత చిన్న పాత్రకు ఆ స్థాయి పారితోషికం ఎవ్వరూ ఇవ్వరు. కన్నడంలో హీరోయిన్లకు కూడా ఇవ్వనంత పారితోషికం అది. అయితే... అంతటి ఆఫర్‌నీ సున్నితంగా తిరస్కరించారు బిపాసా. ఈ ఆఫర్‌ని బిప్స్ తిరస్కరించడానికి కారణం పారితోషికం నచ్చకనే అని బాలీవుడ్ టాక్. తన పారితోషికం రెండు కోట్ల పై మాటేనని, తాను అతిథి పాత్ర చేస్తే యాభై లక్షలైనా ఇవ్వడం న్యాయమని బిప్స్ తన సహచరులతో ఉన్నట్లు సమాచారం. 28 లక్షలంటే సాధారణమైన విషయం కాదని, పైగా రెండు రోజుల్లో అంత మొత్తం ఇస్తామంటే వదులుకోవడం సరైన పని కాదని సన్నిహితులు నచ్చజెప్పినా బిపాసా ససేమిరా అంటున్నారట. నేను నటిస్తే ఆ సినిమాకు క్రేజ్ రాదా? అమ్మేటప్పుడు నా పేరు వాడుకోరా? అలాంటప్పుడు నాకు యాభై లక్షలిస్తే తప్పేంటట అనేది బిపాసా వాదన. బిపాసా వాదనలో కూడా నిజం లేకపోలేదు. ఏమంటారు?