క్షణికావేశానికి నిండు ప్రాణాలు బలి | three suicides of various situations | Sakshi
Sakshi News home page

క్షణికావేశానికి నిండు ప్రాణాలు బలి

Published Sun, Aug 6 2017 10:37 PM | Last Updated on Tue, Aug 28 2018 7:08 PM

క్షణికావేశానికి నిండు ప్రాణాలు బలి - Sakshi

క్షణికావేశానికి నిండు ప్రాణాలు బలి

- ప్రేమ విఫలమైందని యువకుడు..
- సంతానం కలగలేదని వివాహిత
- నగరంలో వేర్వేరు చోట్ల ఆత్మహత్య


అనంతపురం సెంట్రల్‌: క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయానికి రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నిండు నూరేళ్లు గడపాల్సిన జీవితాలు పాతికేళ్లు కాగానే అర్ధంతరంగా ఆగిపోయాయి. నగరంలో వేర్వేరు చోట్ల ఓ వివాహిత, ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే...కళ్యాణదుర్గం రోడ్డులోని గణేష్‌నగర్‌లో నివాసముంటున్న లక్ష్మీదేవి (24), రవికుమార్‌ దంపతులు. పెళ్లయ్యి ఐదేళ్లయినా సంతానం కలగకపోవడంతో మనస్తాపానికి గురైన లక్ష్మీదేవి ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. టూటౌన్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరిలించారు.

లాడ్జిలో యువకుడు
ధర్మవరం పట్టణంలో శాంతినగర్‌లో నివాసముంటున్న నాగభూషణం కుమారుడు పరమేష్‌(24) బీటెక్‌ వరకు చదువుకున్నాడు. ఉద్యోగాన్వేషణలో భాగంగా రెండు రోజుల క్రితం అనంతపురం వచ్చాడు. శనివారం ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని లాడ్జిలో రూం అద్దెకుతతీసుకున్నాడు. అదే రోజు రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం లాడ్జి నిర్వాహకులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఉద్యోగం రాకపోవడంతో పాటు ప్రేమలో కూడా విఫలమవడంతో మనస్తాపం చెంది అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. త్రీటౌన్‌ ఎస్‌ఐ నారాయణరెడ్డి కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement