laxmidevi
-
దారిద్య్రాన్ని తొలగించే పూర్ణవల్లీ తాయారు
పూర్ణవల్లీదేవినే పూర్ణవల్లీ తాయారు. ఆమె దరిద్రాన్నీ ఆకలినీ కరువునీ రూపుమాపే తల్లి. తమిళనాడులోని ఉత్తమ కోవెలలో ఈ దేవి కొలువై ఉంది. ఈమె లక్ష్మీదేవి అవతారం. బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకున్న మహాదేవుడు తాను ఖండించిన బ్రహ్మ తలను భిక్షాపాత్రగా చేసుకుని బ్రహ్మహత్యాపాతకం నుండీ బైటపడటానికి భిక్షను యాచించాడు. ఆ పాత్రలో ఎవరెంత భిక్షేసినా మరుక్షణం ఆ పాత్ర మాయమైపోయేది. తన పాపాన్ని పోగొట్టుకోవడానికి పరమశివుడు పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ, ఉత్తమర్ కోవెలకు వచ్చాడు. అక్కడ లక్ష్మీదేవి ఆ పాత్రను నింపింది. కానీ ఆశ్చర్యంగా ఆ పాత్ర మాయమవలేదు. పరమేశ్వరునికే ఆమె భిక్ష వేసి ఆయనను బ్రహ్మ హత్యాపాతకం నుండి విముక్తుణ్ని చేసింది పూర్ణవల్లీ దేవి. అందుకే ఆ ప్రాంతాన్ని భిక్షాంధర కోవెల (బిచ్చందర్ కొయెల్) అంటారు. ఇక్కడ శ్రీమహావిష్ణువు పురుషోత్తమునిగా దర్శనమిస్తాడు. -
వివాహిత ఆత్మహత్య
ముదిగుబ్బ: చిన్నకోట్లకు చెందిన లక్ష్మీదేవి (28)అనే వివాహిత ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... లక్ష్మీదేవి, నాగరాజు దంపతులు ధర్మవరం పట్టణంలో నివాసం ఉంటూ మగ్గం పనులు చేసుకునేవారు. కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న లక్ష్మీదేవి ఇటీవల పుట్టినిల్లు అయిన ముదిగుబ్బ మండలం చిన్నకోట్లకు వచ్చింది. ఆదివారం కడుపునొప్పి భరించలేక ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏఎస్ఐ రహీం కేసు నమోదు చేసుకున్నారు. -
క్షణికావేశానికి నిండు ప్రాణాలు బలి
- ప్రేమ విఫలమైందని యువకుడు.. - సంతానం కలగలేదని వివాహిత - నగరంలో వేర్వేరు చోట్ల ఆత్మహత్య అనంతపురం సెంట్రల్: క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయానికి రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నిండు నూరేళ్లు గడపాల్సిన జీవితాలు పాతికేళ్లు కాగానే అర్ధంతరంగా ఆగిపోయాయి. నగరంలో వేర్వేరు చోట్ల ఓ వివాహిత, ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే...కళ్యాణదుర్గం రోడ్డులోని గణేష్‌నగర్‌లో నివాసముంటున్న లక్ష్మీదేవి (24), రవికుమార్ దంపతులు. పెళ్లయ్యి ఐదేళ్లయినా సంతానం కలగకపోవడంతో మనస్తాపానికి గురైన లక్ష్మీదేవి ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. టూటౌన్ ఎస్ఐ శ్రీనివాసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరిలించారు. లాడ్జిలో యువకుడు ధర్మవరం పట్టణంలో శాంతినగర్‌లో నివాసముంటున్న నాగభూషణం కుమారుడు పరమేష్(24) బీటెక్ వరకు చదువుకున్నాడు. ఉద్యోగాన్వేషణలో భాగంగా రెండు రోజుల క్రితం అనంతపురం వచ్చాడు. శనివారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని లాడ్జిలో రూం అద్దెకుతతీసుకున్నాడు. అదే రోజు రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం లాడ్జి నిర్వాహకులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఉద్యోగం రాకపోవడంతో పాటు ప్రేమలో కూడా విఫలమవడంతో మనస్తాపం చెంది అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. త్రీటౌన్ ఎస్ఐ నారాయణరెడ్డి కేసు నమోదు చేశారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
చిలమత్తూరు: చిన్నపల్లికి చెందిన ఎరికల లక్ష్మీదేవి (45) అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. స్థానికులు, ఎస్ఐ జమాల్‌బాషా తెలిపిన మేరకు.. ఎరికల రామకృష్ణ భార్య ఎరికల లక్ష్మీదేవికి కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేదు. గ్రామాల్లో సంచరిస్తుండేది. శనివారం సాయంత్రం చిన్నన్నపల్లి నుంచి జాతీయ రహదారి దాటి కాలి నడకను దిగువపల్లి తండా వైపు బయల్దేరింది. ఆదివారం ఉదయం లేపాక్షి హబ్ కార్యాలయం వెనుక బావిలో శవమై తేలింది. ఆమె వద్దనున్న సెల్‌కు కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా.. గొర్రెల కాపరి లిఫ్ట్ చేసి.. బావిలో శవం తేలియాడుతోందని సమాచారం అందించాడు. హుటాహుటిన వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందిందా.. లేక ఆత్మహత్య చేసుకుందా అనేది తెలియడం లేదు. ఎస్ఐ జమాల్‌బాషా కేసు నమోదు చేసుకున్నారు. -
వివాహిత దారుణ హత్య
శెట్టూరు (కళ్యాణదుర్గం) : భర్త చేతిలో భార్య దారుణహత్యకు గురైంది. మద్యానికి డబ్బు ఇవ్వలేదన్న కోపంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. శెట్టూరు మండలం బుడ్డయ్యదొడ్డిలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. హతురాలి తల్లిదండ్రులు గొల్ల బసమ్మ, వీరనాగప్ప, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బుడ్డయ్యదొడ్డికి చెందిన గొల్ల లక్ష్మీదేవి (32)కి 14 ఏళ్ల కిందట కళ్యాణదుర్గం మండలం ముదిగల్లుకు చెందిన ధనుంజయతో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. మూడేళ్ల కిందట వీరు బుడ్డయ్యదొడ్డికి వచ్చి వేరుగా కాపురం ఉంటున్నారు. సమీపంలోని కర్ణాటక ప్రాంతంలో గల ఒక డాబాలో ధనుంజయ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొన్ని రోజులుగా ఇతను మద్యానికి బానిసయ్యాడు. మద్యానికి డబ్బు ఇవ్వాలని భార్యతో తరచూ గొడవపడేవాడు. తాగొచ్చాక వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా డబ్బు విషయంలో గొడవపడ్డాడు. ఆమె డబ్బు ఇవ్వకపోవడంతో బయటకెళ్లిపోయి పూటుగా మద్యం తాగి వచ్చిన ధనుంజయ.. అర్ధరాత్రి సమయంలో నిద్రలో ఉన్న భార్య లక్ష్మీదేవి తలపై బండరాయి వేసి పరారయ్యాడు. తల్లి అరుపులు విన్న కుమారుడు అజయ్ (12), కుమార్తె గాయత్రి (10) ఉలిక్కిపడి లేచారు. రక్తపుమడుగులో పడిఉన్న తల్లిని చూసి ఏడుస్తుండటంతో బంధువులు, ఇరుగుపొరుగువారు వచ్చి హుటాహుటిన కళ్యానదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే లక్ష్మీదేవి మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రికి వెళ్లిన అమ్మ తిరిగి వస్తుందని ఎదురు చూస్తున్న పిల్లలు.. ఇక అమ్మ తిరిగిరాదని తెలిసి కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. బుధవారం సాయంత్రం సీఐ శివప్రసాద్, ఎస్ఐ శ్రీకాంత్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బంధువులు, స్థానికులను విచారణ చేశారు. -
మహిళ దారుణ హత్య
పుట్లూరు : మండలంలోని బాలాపురం ఎస్సీ కాలనీలో లక్ష్మీదేవి(40) అనే మహిళ(దివ్యాంగురాలు) గురువారం దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికుల కథనం మేరు.. భర్త రంగనాయకులు ఎనిమిదేళ్ల కిందట అనారోగ్యంతో మరణించగా, అప్పటి నుంచి తన ఇద్దరు పిల్లలతో పాటు అత్తతో కలసి ఉంటోంది. కూలీ పనులకు వెళ్లి కుమారుడు దస్తగిరిని పాలిటెక్నిక్ చదివిస్తుండగా, కుమార్తె కుళ్లాయమ్మకు నెల రోజుల కిందట వివాహం కూడా చేసింది. గురువారం ఉపాధి పనులకు వెళ్లి వచ్చిన ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా గాయపరచి సెల్‌ఫోన్ చార్జింగ్ వైరు, రైస్ కుక్కర్ వైర్లను గొంతుకు బిగించి దారుణంగా హత్య చేశారు. గమనించిన స్థానిక కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. తాడిపత్రి రూరల్ సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి, ఎస్ఐ సురేశ్‌బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుమారుడు దస్తగిరి ఫిర్యాదు మేకరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశానికి పోలీసులు జాగిలాన్ని రప్పించారు. అది లక్ష్మీదేవి ఇంటి నుంచి బాలాపురం బస్‌షెల్టర్ వద్దకు వెళ్లి ఆగిపోయింది. క్లూస్ టీం సహాయంతో హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాల కోసం అన్వేషించారు. కాగా ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పి.చింతలపల్లికి చెందిన ఓ వ్యక్తి తరచూ ఎస్సీ కాలనీకి వచ్చి వెళ్లేవాడని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. కాగా హత్య జరిగిన అనంతరం అతడు గ్రామంలో లేకపోవడంతో పాటు ఫోన్ పని చేయకపోవడంతో అనుమానాలకు బలం చేకూర్చుతోంది. -
సంతానం కలగలేదని వివాహిత ఆత్మహత్య
కంబదూరు : సంతానం కలగలేదని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. రాంపురానికి చెందిన మధుతో లక్ష్మిదేవి(24)కి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. సంతానం భాగ్యం కలగలేదని ప్రతిరోజూ బాధపడుతుండేది. ఇక పిల్లలు పుట్టరేమోనని జీవితంపై విరక్తి చెంది బుధవారం ఉదయం ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ నరసింహుడు కేసు నమోదు చేసుకున్నారు. -
పండుగ రోజు దారుణం
అందరూ వినాయక చవితి పండుగ సంబరాల్లో మునిగి ఉన్నారు. అంతలోనే ఓ దారుణం వెలుగు చూసింది. ఓ వివాహిత మహిళ కిరాతకంగా హత్యకు గురవడం కలకలం రేపింది. వివాహేతర సంబంధం పెట్టుకునే వ్యక్తే ఆమెను చంపి ఉంటాడని ఊరు ఊరంతా కోడైకూసింది. తన అవసరాలకు డబ్బు ఇవ్వలేదన్న అక్కసుతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలతెలవారుతుండగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆత్మకూరు : ఆత్మకూరు మండలం మదిగుబ్బ ఎస్సీ కాలనీకి చెందిన పెద్దన్న అలియాస్ సన్నప్పయ్య భార్య ఎనుముల లక్ష్మిదేవి(35) సోమవారం తెల్లవారుజామున దారణ హత్యకు గురైంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం... లక్ష్మిదేవి, సన్నప్పయ్యకు వివాహమై పదిహేనేళ్లవుతోంది. అయితే వారికి పిల్లలు పుట్టలేదు. పిల్లల కోసం ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేదు. జుట్టు పట్టుకుని ఈడ్చుకువచ్చి.. ఈ నేపథ్యంలో లక్ష్మిదేవి అదే గ్రామానికి చెందిన ఎర్రిస్వామితో సన్నిహితంగా ఉంటోంది. భర్త తన సంపాదనను తెచ్చి భార్యకిస్తే, ఆమె ప్రియుడికి ఇచ్చేది. ఈ నేపథ్యంలోనే ఎర్రిస్వామి తనకు డబ్బు అవసరముందని, తెచ్చివ్వాలని లక్ష్మిదేవిని ఆదివారం డిమాండ్ చేశాడు. ప్రస్తుతానికి తన వద్ద డబ్బు లేదని ఆమె బదులిచ్చింది. దీంతో అతనిలో ఆవేశం కట్టలు తెచ్చుకుంది. అందరూ చూస్తుండగానే ఆమె జుట్టు పట్టుకుని న డి వీధిలోకి ఈడ్చుకువచ్చాడు. అందరూ చూస్తుండగానే కసితీరా కొట్టాడు. ఆ తరువాత సోమవారం తెల్లవారుజామునకల్లా ఆమె మృతదేహమై పడి ఉంది. భర్త ఫిర్యాదుతో... భార్య మృతదేహాన్ని చూసిన పెద్దన్న నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు గ్రామానికి చేరుకుని లక్ష్మిదేవి మృతదేహాన్ని పరిశీలించారు. ఇంట్లోని చెక్కతో బలంగా కొట్టడంతోనే ఆమె మరణించినట్లు గుర్తించారు. హతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసుల అదుపులో నిందితుడు? లక్ష్మిదేవి హత్యకు సంబంధించి అనుమానితుడైన ఆమె ప్రియుడు ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. తమదైన శైలిలో అతన్ని విచారించినట్లు సమాచారం. -
తల్లిని కాపాడిన తనయులు
గుత్తి : భూ తగాదాలతో మనస్తాపం చెంది మెడకు ఉరితాడు తగిలించుకుని ఆత్మహత్య చేసుకోబోతున్న తల్లిని సరైన సమయంలో తనయులు వచ్చి కాపాడారు. బాధితులు, పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. గుత్తిలోని బీసీ కాలనీలో లక్ష్మీదేవి(32) నివాసముంటోంది. ఈమె భర్త పక్కీరప్ప ఐదేళ్ల క్రితం గుండెపోటుతో మరణించాడు. పక్కీరప్పకు, ఆయన సోదరులకు కలిసి ఉమ్మడిగా మూడు ఎకరాల భూమి ఉంది. తన భర్త వాటా తనకు ఇవ్వాలని లక్ష్మీదేవి బావలను అడుగుతూనే ఉంది. అయితే వారు ఇవ్వడానికి నిరాకరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో లక్ష్మిదేవి సోదరులు మంగళవారం గుత్తికి వచ్చి ఇదే విషయంపై చర్చించారు. అప్పటికీ వారు ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెంది ఇంటికి వెళ్లిపోయిన లక్ష్మీదేవి గవాక్షానికి తాడుతో ఉరి వేసుకునేందుకు ప్రయత్నించింది. తల్లి ఆవేశంగా వెళ్లిపోవటాన్ని చూసిన తనయులు కుమారస్వామి (4వ తరగతి), కులశేఖర్ (7వ తరగతి)లు మిద్దెపై నుంచి గవాక్షాన్ని కడ్డీతో పగులగొట్టి లోపలికి వెళ్లి తల్లి మెడకు వేసుకున్న ఉరితాడును తొలగించి కిందకు దించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పసి వేదన
ఇంటికి లక్ష్మీదేవీ రూపంగా భావించుకునే ఆడపిల్లల పుట్టుక ఇప్పుడు భయానక మవుతోంది. కనికరం లేని కొందరు తల్లిదండ్రులు పుట్టిన పాపాయిలు ఈ లోకం చూడకుండానే కాటికి పంపేస్తున్నారు. అదీ దారుణంగా. సభ్య సమాజం తలదించుకునేలా. మానవత్వం మరిచేలా. కొడంగల్‌లో జరిగిన ఈ సంఘటనే ఇందుకు సాక్ష్యం. ఎందరినో కదిలించిన వైనం. కొడంగల్, న్యూస్‌లైన్ : ‘అమ్మా..నన్నెందుకు కన్నావ్...? నేనేం నీ కడుపులోనే పుడతానను కోలేదే. నా ప్రమేయం లేకుండా ఈ భూమ్మీదకు తెచ్చిన వెంటనే నువ్వు మురుగు కాలువ పాల్జేస్తే నేను ఓ 18 గంటలు మృత్యువుతో పోరాడి మిమ్మల్నందర్నీ వదిలి వెళ్లి పోయా. అంత దానికి నన్ను 9 నెలలు ఎందుకు మోసావ్. పెంచడమే భారమనుకుంటే ఆ మాత్రం అనుభూతి కూడా నాకెందుకు’. ఇదీ ఓ పసికందు ఆత్మ ఘోష. ఎంతో గొప్పదనుకున్న బ్రహ్మముహూర్తంలో పుట్టిన ఆడపిల్ల మారని ఈ లోకం తీరుపై రువ్విన ప్రశ్నలు.గతి తప్పుతున్న సమాజానికి వేస్తున్న చురకలు. గుండెల్ని పిండేసిన ఈ సంఘటన కొడంగల్ పట్టణంలో గురువారం తెల్లవారున చోటు చేసుకుంది. స్థానిక పెద్దలు బొంకులు శంకరప్ప, బాకీ కైసర్, కానకుర్తి నర్సింహారెడ్డిలు రోజూ వారి మాదిరిగానే వాకింగ్‌కు బయలు దేరారు. వారిళ్లకు సమీపంలో ఉన్న షాబజార్ ప్రాంతంలోని మురుగు కాలువలో ఓ పసికందు తేలియాడుతూ కనిపించింది. అమ్మ పొత్తిళ్లలో వెచ్చగా పడుకోవాల్సిన ఆ చిన్నారి గడ్డగట్టించే చలిలో దుర్భర స్థితిలో కనిపించడంతో చలించి పోయారు. మానవత్వం మేల్కొంది. వెంటనే ఈవిషయాన్ని విలేకరులకు, పోలీసులకు, 108 అంబులెన్స్‌కు తెలియజేశారు. విషయం తెలుసుకొని కలాల్వాడీలో ఉంటున్న అంగన్వాడీ టీచర్లు కానుకుర్తి యాదమ్మ, బైండ్ల శశికళలు అక్కడకు చేరుకొని పసికందును తీసుకొని 108లో కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అప్పటికే ఆ చిట్టి తల్లి పరిస్థితి విషమంగా మారడంతో తాండూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అమ్మపాలుతో కడుపు నింపుకోవాల్సినా చిన్నారి మురుగునీటిని తెలీకుండానే తాగేసింది. మరోవైపు ఇన్ఫెక్షన్లు సోకి ముక్కు నుంచి నోట్లో నుంచి రక్తస్రావం ప్రారంభమైంది.కన్నవారు చేసిన ఘనకార్యానికి పాపాయి గుండె కూడా చివుక్కుమందేమో అదీ మండకొడి స్పందనలతోనే సరిపెట్టుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన వైద్యులు అత్యవసరంగా చికిత్సలందించాలంటే తక్షణమే రూ. 2వేల విలువచేసే ఇంజక్షన్ వేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే ఐసీడీఎస్ సూపర్వైజర్ జయశ్రీ తాండూరుకు చేరుకొని అక్కడి ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డితో మాట్లాడి చిన్నారికి సాయం చేయాలని కోరారు. ఆయనా చలించి ముందుకు వచ్చినా... తాండూరులోని మెడికల్ షాపులన్నీ వెతికినా ఆ చిన్నారికి కావాల్సిన ఇంజక్షన్ దొరకలేదు. అలా అప్పటి వరకూ మృత్యువుతో పోరాడిన చిట్టి ఈ లోకం పోకడ అర్ధం చేసుకొని ఇక చాల్లే అనుకొని సరిగ్గా రాత్రి 8గంటల సమయంలో కాలుని గూటికి చేరుకుంది. అమ్మే అక్కరలేదనుకున్నప్పుడు ఈ సంఘానికి తానెందుకు భారం కావాలనుకుందేమో చివరి శ్వాస వదలి శాశ్వత లోకాలకు వెళ్లిపోయింది. డాక్టర్ అంచనా ప్రకారం ఆ శిశువు గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఈ భూమిపైకి అడుగు పెట్టి ఉండవచ్చు. అంటే కేవలం 18 గంటల్లో బతుకు పాఠాలను తెలుసుకుందన్నమాట. ఉన్న కొద్ది గంటల్లోనూ తనకోసం శ్రమించిన వారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పి వీడ్కోలు పలికింది. అందరికీ కల్లు చెమర్చేలా చేసింది.