పూర్ణవల్లీదేవినే పూర్ణవల్లీ తాయారు. ఆమె దరిద్రాన్నీ ఆకలినీ కరువునీ రూపుమాపే తల్లి. తమిళనాడులోని ఉత్తమ కోవెలలో ఈ దేవి కొలువై ఉంది. ఈమె లక్ష్మీదేవి అవతారం. బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకున్న మహాదేవుడు తాను ఖండించిన బ్రహ్మ తలను భిక్షాపాత్రగా చేసుకుని బ్రహ్మహత్యాపాతకం నుండీ బైటపడటానికి భిక్షను యాచించాడు.
ఆ పాత్రలో ఎవరెంత భిక్షేసినా మరుక్షణం ఆ పాత్ర మాయమైపోయేది. తన పాపాన్ని పోగొట్టుకోవడానికి పరమశివుడు పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ, ఉత్తమర్ కోవెలకు వచ్చాడు. అక్కడ లక్ష్మీదేవి ఆ పాత్రను నింపింది. కానీ ఆశ్చర్యంగా ఆ పాత్ర మాయమవలేదు. పరమేశ్వరునికే ఆమె భిక్ష వేసి ఆయనను బ్రహ్మ హత్యాపాతకం నుండి విముక్తుణ్ని చేసింది పూర్ణవల్లీ దేవి. అందుకే ఆ ప్రాంతాన్ని భిక్షాంధర కోవెల (బిచ్చందర్ కొయెల్) అంటారు. ఇక్కడ శ్రీమహావిష్ణువు పురుషోత్తమునిగా దర్శనమిస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment