వివాహిత అనుమానాస్పద మృతి | woman suspicious death | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Published Sun, Jul 30 2017 9:41 PM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

woman suspicious death

చిలమత్తూరు: చిన్నపల్లికి చెందిన ఎరికల లక్ష్మీదేవి (45) అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. స్థానికులు, ఎస్‌ఐ జమాల్‌బాషా తెలిపిన మేరకు.. ఎరికల రామకృష్ణ భార్య ఎరికల లక్ష్మీదేవికి కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేదు. గ్రామాల్లో సంచరిస్తుండేది. శనివారం సాయంత్రం చిన్నన్నపల్లి నుంచి జాతీయ రహదారి దాటి కాలి నడకను దిగువపల్లి తండా వైపు బయల్దేరింది.

ఆదివారం ఉదయం లేపాక్షి హబ్‌ కార్యాలయం వెనుక బావిలో శవమై తేలింది. ఆమె వద్దనున్న సెల్‌కు కుటుంబ సభ్యులు ఫోన్‌ చేయగా.. గొర్రెల కాపరి లిఫ్ట్‌ చేసి.. బావిలో శవం తేలియాడుతోందని సమాచారం అందించాడు. హుటాహుటిన వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందిందా.. లేక ఆత్మహత్య చేసుకుందా అనేది తెలియడం లేదు. ఎస్‌ఐ జమాల్‌బాషా కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement