Parasa Venkataratnam
-
టీడీపీ సమావేశంలో రగడ
టీడీపీ సీనియర్ నాయకుడిపై దాడికి సిద్ధపడ్డ కార్యకర్తలు అర్ధాంతరంగా ముగిసిన సమావేశం తడ : టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కొంతకాలంగా మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో మంగళవారం తడ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పరసా వెంకటరత్నం అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమయంలో పార్టీ సీనియర్ నాయకుడు కామిరెడ్డి మునిరెడ్డి కార్యాలయంలోకి వచ్చి తనకు ఆహ్వానం ఎందుకు పంపలేదని వేదికపై ఉన్న నాయకులను ప్రశ్నించాడు. మునిరెడ్డి తీవ్ర స్వరంతో పార్టీ జిల్లా నాయకుడు వేనాటి పరంధామిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరసా సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ మునిరెడ్డి శాంతించకపోవడంతో కొందరు నాయకులు, కార్యకర్తలు మునిరెడ్డిని సమావేశ మందిరంలోనుంచి బయటకు లాక్కొచ్చారు. కొందరు మునిరెడ్డిపై దాడికి ప్రయత్నించడంతో పరసా జోక్యం చేసుకుని ఆయనను తన కారులో సూళ్లూరుపేటకు పంపారు. దీంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. మండలంలో నాలుగు వర్గాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం రెండు బలమైన గ్రూపులుగా మారి ఒకరి నిర్ణయాన్ని మరో గ్రూపు వ్యతిరేకిస్తూ ప్రతి విషయాన్నీ తమకు అనుకూలంగా మార్చుకునేలా చేస్తుత్న ప్రయత్నంలో భాగంగా వివాదాలు నెలకొంటున్నాయి. -
టికెట్ దక్కేనా !
వలస నేతలకు ప్రాధాన్యంపై కినుక దుర్గాప్రసాద్, పరసా ఆశలన్నీ మూడో జాబితాపైనే నెల్లూరు : టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా ఓ వెలుగు వెలిగి, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న బల్లి దుర్గాప్రసాద్, పరసా వెంకటరత్నంకు పార్టీలో ప్రాధాన్యం కొరవడినట్టుంది. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్‌లో కొనసాగి వచ్చిన నేతలకు టీడీపీ టికెట్లు ఖరారవగా, పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వీరికి తొలి రెండు జాబితాల్లో చోటు దక్కలేదు. ఈ క్రమంలో వీరిద్దరికీ టికెట్లు లభించేది అనుమానమేనని టీడీపీ సీనియర్ నేతలు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఈ రోజు సమాచారం కాదని, ఆరు నెలలుగా పార్టీలో ఇదే మాట వినిపిస్తోందని చెబుతున్నారు. అయితే టీడీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్న చంద్రబాబు జిల్లాలోని రెండు ఎస్సీ రిజర్వుడు స్థానాలకు అభ్యర్థులను కేటాయించే విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆయ న ప్రకటించిన తొలి జాబితాలో కావలి శాసనసభ్యుడైన బీద మస్తాన్‌రావుకు చోటు లభించింది. రెండో జాబితాలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో పాటు కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి(ఎంపీ అభ్యర్థి) ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేర్లు ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలైన దుర్గా ప్రసాద్, పరసా వెంకటరత్నం పేర్లు రెండు జాబి తాల్లో కనిపించకపోవడంతో వారితో వారి అనుచరులు కూడా ఆందోళన చెందుతున్నారు.