టీడీపీ సమావేశంలో రగడ | Fight in TDP conference | Sakshi
Sakshi News home page

టీడీపీ సమావేశంలో రగడ

Published Wed, Jul 15 2015 1:53 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM

టీడీపీ సమావేశంలో రగడ - Sakshi

టీడీపీ సమావేశంలో రగడ

టీడీపీ సీనియర్ నాయకుడిపై దాడికి సిద్ధపడ్డ కార్యకర్తలు
అర్ధాంతరంగా ముగిసిన సమావేశం

 
 తడ : టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కొంతకాలంగా మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో మంగళవారం తడ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పరసా వెంకటరత్నం అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమయంలో పార్టీ సీనియర్ నాయకుడు కామిరెడ్డి మునిరెడ్డి కార్యాలయంలోకి వచ్చి తనకు ఆహ్వానం ఎందుకు పంపలేదని వేదికపై ఉన్న నాయకులను ప్రశ్నించాడు. మునిరెడ్డి తీవ్ర స్వరంతో పార్టీ జిల్లా నాయకుడు వేనాటి పరంధామిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరసా సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

కానీ మునిరెడ్డి శాంతించకపోవడంతో కొందరు నాయకులు, కార్యకర్తలు మునిరెడ్డిని సమావేశ మందిరంలోనుంచి బయటకు లాక్కొచ్చారు. కొందరు మునిరెడ్డిపై దాడికి ప్రయత్నించడంతో పరసా జోక్యం చేసుకుని ఆయనను తన కారులో సూళ్లూరుపేటకు పంపారు. దీంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. మండలంలో నాలుగు వర్గాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం రెండు బలమైన గ్రూపులుగా మారి ఒకరి నిర్ణయాన్ని మరో గ్రూపు వ్యతిరేకిస్తూ ప్రతి విషయాన్నీ తమకు అనుకూలంగా మార్చుకునేలా చేస్తుత్న ప్రయత్నంలో భాగంగా వివాదాలు నెలకొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement