Parasitamal
-
దేశీయ అవసరాలు తీరాకే..!
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందని అనుకుంటున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందుపై భారత్, అమెరికాల మధ్య రగడ మొదలైంది. ఆ మందు వెంటనే తమకు పంపాలని ట్రంప్ కొంతకాలంగా డిమాండ్ చేస్తూండగా.. సోమవారం ఒకడుగు ముందుకేసి భారత్ సరఫరా చేయకపోతే ప్రతిచర్యలు ఉంటాయని హెచ్చరించారు. భారత్ అటు కర్ర విరగకుండా.. ఇటు పామూ చావకుండా అన్నట్లుగా మందుల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. క్లోరోక్విన్ కోసం ఇప్పటికే కొన్ని దేశాలు ఆర్డర్లు ఇచ్చినప్పటికీ పరిస్థితులను బట్టి ఎగుమతులు మొదలుపెడతామని, అది కూడా దేశీయ అవసరాలన్నీ తీరిన తరువాత మాత్రమే జరుగుతుందని కుండబద్దలు కొట్టింది. ‘కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మానవతా దృష్టితో తగు మోతాదులో పారాసిటమాల్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉత్పత్తికి లైసెన్సులు ఇవ్వాలని భారత్ నిర్ణయించంది. మా సామర్త్యంపై ఆధారపడ్డ ఇరుగు పొరుగు దేశాలకు మందులు అందిస్తాం’అని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. మహమ్మారి కారణంగా బాగా దెబ్బతిన్న దేశాలకూ ఈ అత్యవసర మందులు సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ సమాజం పరస్పరం సహకరించుకోవాలన్నదే భారత్ విధానమని, ఇతర దేశాల నుంచి భారతీయులను ఖాళీ చేయించే విషయంలోనూ తాము ఇదే స్ఫూర్తితో వ్యవహరించామని ఆయన వివరించారు. బాధ్యతాయుతమైన దేశంగా ముందు దేశ జనాభాకు తగ్గ మందులు ఉంచుకోవాల్సి ఉంటుందని, ఆయన స్పష్టం చేశారు. ఈ కారణంగానే పాక్షిక నిషేధం విధించామని, పరిస్థితులను సమీక్షించిన తరువాత ఎత్తివేస్తున్నామని చెప్పారు. మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం భారత్ కావడం గమనార్హం. నిస్పృహతోనే బెదిరింపు తమకు కావాల్సిన మందులు సరఫరా చేయని పక్షంలో భారత్‌పై ప్రతిచర్యలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే భారత్ ఎగుమతులపై నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేయడం గమనార్హం. గత ఆదివారమే మోదీతో జరిగిన ఫోన్ సంభాషణల్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తమకు సరఫరా చేయాలని ట్రంప్ విజ్ఞప్తి చేశారు. తాజాగా ప్రతిచర్యలు ఉంటాయన్న ట్రంప్ వ్యాఖ్య నిస్పృహతో అప్పటికప్పుడు చేసింది మాత్రమేనని భారత్ భావిస్తోంది. వైట్‌హౌస్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఒకవేళ భారత్ ఎగుమతులకు అనుమతించకపోతే ఆది వారి నిర్ణయమని, ప్రతీకార చర్యలు తప్పకుండా ఉంటాయని స్పష్టం చేశారు. -
344 ఔషధాలపై నిషేధం
► వీటి విక్రయాలు నిలిపేయాలని ఆదేశం ► మందులను వెనక్కి ఇవ్వాలని లేఖలు ► చర్యలు ప్రారంభించిన డ్రగ్స్ కంట్రోల్ శాఖ కర్నూలు(హాస్పిటల్): రోగుల ప్రాణాలను లెక్కచేయకుండా, ధనార్జనే ద్యేయంగా కొన్ని కంపెనీలు ఇష్టానుసారంగా మందులు తయారు చేసి విక్రయించడాన్ని కేంద్రం తప్పుపట్టింది. ఈ మేరకు పలు రకాల సమ్మిలిత మందులపై వేటు వేసింది. ఇందులో భాగంగా 344 రకాల ఔషధాలపై నిషేధం విధించింది. మార్కెట్లో ఉన్న ఈ మందులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలోని అన్ని మెడికల్ షాపులు, ఏజెన్సీల నుంచి నిషేధిత మందులను వెనక్కి రప్పించేందుకు ఆ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అందరికీ లేఖలు పంపింది. దుకాణాలతో పాటు నిషేధిత మందులు రోగులకు సూచించకూడదని అప్నా, ఐఎంఏ సంస్థలకూ లేఖలు రాసింది. దీంతో కర్నూలులో ఇప్పటికే అధిక శాతం మెడికల్ షాపుల్లో నిషేధిత మందులను తీసి పక్కన పెట్టేశారు. నిషేధిత మందులను ఠీఠీఠీ.ఛీటఠజఛిౌ్టటౌ.ౌటజ, ఠీఠీఠీ.ఛిఛీటఛిౌ.ఛిౌఝలో చూడవచ్చని కర్నూలు డ్రగ్ కంట్రోల్ ఏడీ కుమార్ తెలిపారు. నిషేధిత మందుల్లో కొన్ని... 1. గ్లూకోసమైన్, మిథైల్ సల్ఫోనిల్ మిథేన్, విటమిన్ డి3, మాంగనీస్, బోరోస్, కాపర్, జింక్ 2. పారాసీటమాల్, టాపెంటాడోల్, 3. సిఫిక్సిమ్, లినోజోలిడ్ 4. మెఫెడామిక్ ఆసిడ్, రానిటిడైన్, డైసైక్లోమైన్ 5. హెపారిన్, డైసైక్లోమైన్ 6. ఆమోక్సిలిన్, సిఫిక్సిమ్, పొటాషియం క్లావులానిక్ ఆసిడ్ 7. అజిత్రోమైసిన్, ఒఫ్లోక్సాసిన్, 8. టామ్సులోసిన్, డైక్లోఫినాక్ 9. ట్రామడోల్, క్లోరోజోక్సాజోన్, 10. నెమిసులైడ్, డైక్లోఫినాక్ 11. అసిక్లోఫినాక్, రాబిప్రోజోల్, 12. నెమిసులైడ్, సిట్రిజన్, కెఫిన్ 13. నాప్రోక్సిన్, 14. డైక్లోఫినాక్, ట్రమడోల్ 15. నెమిసులైడ్, డైక్లోఫినాక్