344 ఔషధాలపై నిషేధం
► వీటి విక్రయాలు నిలిపేయాలని ఆదేశం
► మందులను వెనక్కి ఇవ్వాలని లేఖలు
► చర్యలు ప్రారంభించిన డ్రగ్స్ కంట్రోల్ శాఖ
కర్నూలు(హాస్పిటల్): రోగుల ప్రాణాలను లెక్కచేయకుండా, ధనార్జనే ద్యేయంగా కొన్ని కంపెనీలు ఇష్టానుసారంగా మందులు తయారు చేసి విక్రయించడాన్ని కేంద్రం తప్పుపట్టింది. ఈ మేరకు పలు రకాల సమ్మిలిత మందులపై వేటు వేసింది. ఇందులో భాగంగా 344 రకాల ఔషధాలపై నిషేధం విధించింది. మార్కెట్‌లో ఉన్న ఈ మందులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలోని అన్ని మెడికల్ షాపులు, ఏజెన్సీల నుంచి నిషేధిత మందులను వెనక్కి రప్పించేందుకు ఆ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అందరికీ లేఖలు పంపింది. దుకాణాలతో పాటు నిషేధిత మందులు రోగులకు సూచించకూడదని అప్నా, ఐఎంఏ సంస్థలకూ లేఖలు రాసింది. దీంతో కర్నూలులో ఇప్పటికే అధిక శాతం మెడికల్ షాపుల్లో నిషేధిత మందులను తీసి పక్కన పెట్టేశారు. నిషేధిత మందులను ఠీఠీఠీ.ఛీటఠజఛిౌ్టటౌ.ౌటజ, ఠీఠీఠీ.ఛిఛీటఛిౌ.ఛిౌఝలో చూడవచ్చని కర్నూలు డ్రగ్ కంట్రోల్ ఏడీ కుమార్ తెలిపారు.
నిషేధిత మందుల్లో కొన్ని...
1. గ్లూకోసమైన్, మిథైల్ సల్ఫోనిల్ మిథేన్, విటమిన్ డి3, మాంగనీస్, బోరోస్, కాపర్, జింక్
2. పారాసీటమాల్, టాపెంటాడోల్, 3. సిఫిక్సిమ్, లినోజోలిడ్
4. మెఫెడామిక్ ఆసిడ్, రానిటిడైన్, డైసైక్లోమైన్
5. హెపారిన్, డైసైక్లోమైన్
6. ఆమోక్సిలిన్, సిఫిక్సిమ్, పొటాషియం క్లావులానిక్ ఆసిడ్
7. అజిత్రోమైసిన్, ఒఫ్లోక్సాసిన్, 8. టామ్‌సులోసిన్, డైక్లోఫినాక్
9. ట్రామడోల్, క్లోరోజోక్సాజోన్, 10. నెమిసులైడ్, డైక్లోఫినాక్
11. అసిక్లోఫినాక్, రాబిప్రోజోల్, 12. నెమిసులైడ్, సిట్రిజన్, కెఫిన్
13. నాప్రోక్సిన్, 14. డైక్లోఫినాక్, ట్రమడోల్
15. నెమిసులైడ్, డైక్లోఫినాక్