Parents of students
-
నేడు ర్యాగింగ్‌పై రౌండ్‌టేబుల్ సమావేశం
♦ సమాజంలో మార్పు కోసం సాక్షి, సాక్షి టీవీ ప్రయత్నం ♦ అన్ని వర్గాల ప్రజలు పాల్గొని అభిప్రాయాలు వెల్లడించే అవకాశం సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో ర్యాగింగ్ సంఘటనలు వరసగా జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మానసిక ఎదుగుదల లేక కొందరు, చట్టాలపై అవగాహన లేక మరికొందరు. తల్లిదండ్రుల పర్యవేక్షణ కరువై ఇంకొందరు.. ర్యాగింగ్‌కు పాల్పడుతూ ఎదుటివారి జీవితాలతోపాటు తమ జీవితాలనూ బలి చేసు కొంటున్నారు. దీనికి జిల్లాలో ఇటీవల జరిగిన విద్యార్థినులు రిషితేశ్వరి, సునీత ఘటనలే ప్రత్యక్ష ఉదహరణలు. ర్యాగింగ్ మహమ్మారికి రిషితేశ్వరి బలై తల్లిదండ్రులకు కడుపుకోతను మిగల్చగా.. తానే ర్యాగింగ్‌కు పాల్పడి ప్రిన్సిపల్ మందలించారనే మనస్థాపంతో సునీత బలవన్మరణానికి పాల్పడి తన తల్లిని ఒంటరిని చేసింది. ర్యాగింగ్‌కు ఒక్క గుంటూరు జిల్లాలోనే ఇద్దరు విద్యార్థినులు బలికాగా, మరో ముగ్గురు కటకటాల పాలై తమ జీవితాలను అంధకారం చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తన వంతుగా ‘సాక్షి’ స్పందించింది.ర్యాగింగ్‌పై విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, సమాజంలో కూడా మార్పు రావాలనే తలంపుతో సాక్షి, సాక్షి టీవీ ఆధ్వర్యంలో బుధవారం ర్యాగింగ్‌పై రౌండ్ టేబుల్ సమావేశం జరగనున్నది. సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి సారధ్యంలో ఈ రౌండ్‌టేబుల్ సమావేశం జరుగుతుంది. గుంటూరు రూరల్ సీసీఎస్ ఏఎస్పీ శోభామంజరి, ఏఎన్‌యూ మాజీ వీసీ వియన్నరావు, సీనియర్ న్యాయవాది వై.కోటేశ్వరరావు (వైకే), జీజీహెచ్ మానసిక వైద్య విభాగాధిపతి డాక్టర్ మురళీకృష్ణ, పీడీఎస్ఓ రాష్ట్ర కమిటీ నాయకురాలు వెన్నెల, ఐద్వా నాయకురాలు వరలక్ష్మిలు ముఖ్య అతిథులుగా పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. ఈ సమావేశానికి సామాజిక వేత్తలు, విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాల నేతలు, అన్ని వర్గాల ఔత్సాహికులు హాజరై తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. -
దాడులు కొనసాగుతాయి..
కలెక్టర్ కోనశశిధర్ అనంతపురం ఎడ్యుకేషన్ : ‘కొన్ని స్కూళ్ల యాజమాన్యాల వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బం దులు పడుతున్నారు...పలుమార్లు ఈ విషయాలు నా దృష్టికి వచ్చాయి.. అందుకే తనిఖీలు చేయిస్తున్నాం.. దీనిని ఆపే ప్రసక్తే లేదు.’అని కలెక్టర్ కో న శశిధర్ స్పష్టం చేశారు. విద్యా స ంస్థల్లో అధిక ఫీజులు వసూళ్లు, వసతుల లేమిపై అధికార బృందాలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై దాడులు నిర్వహించాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం నాయకులు క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ను కలిశారు. తనిఖీలు చేయడం వల్ల చాలామంది యాజమాన్యాలు ఆందోళనకు గురువుతున్నారని విన్నవించారు. దీనిపై కలెక్టర్ పైవిధంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ మన జిల్లా పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందన్నారు. తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి వారి ఆమోదం మేరకు ఫీజులు వసూలు చేయాలని సూ చించారు. జిల్లాలో ఏ ఒక్క స్కూలును ఉపేక్షించబోమన్నారు. ఇప్పటిదాకా నగరంలోనే దాడులు చేస్తున్నారని, వచ్చేవారం నుంచి జిల్లా అంతటా ఈ తనిఖీలు నిర్వహిస్తారని స్పష్టం చేశారు. అన్ని స్కూళ్లను ఒకేలా చూడమని, అక్కడి పరిస్థితులను పరి శీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం నాయకులు పోలం రంగారెడ్డి, కుళ్లాయిరెడ్డి, రవిచంద్రారెడ్డి, గోపాల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. కొనసాగిన దాడులు: నగరంలో శనివారం 18 స్కూళ్లను అధికార బృందాలు తనిఖీలు చేశాయి. ఏజేసీ సయ్యద్ ఖాజామోహిద్దీన్, డీఆర్ఓ హేమసాగర్, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఫరూఖ్ అహ్మద్, ఆర్డీఓ హుసేన్‌సాబ్, డీఈఓ అంజయ్య, ఎస్ఎస్ఏ పీఓ జయకుమార్ నేతృత్వంలో నాలు గు బృందాలు ఏర్పడి నగరంలో కలియతిరిగారు. పేరెంట్-టీచర్ అసోసియేషన్ సమావేశాల అమలు, ఆటస్థలం, మరుగుదొడ్లు, టీచర్ల నియామకం, వేతనాల మంజూరు, స్కూళ్లలో అగ్నిమాపక నిరోధక పరికరాలు, ప్రాథమిక చికిత్స కిట్లు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని స్కూళ్లకు నోటీసులు జారీ చేశారు. -
‘బడి’ దోపిడీకి అడ్డుకట్ట
ప్రైవేట్ పాఠశాలల దూకుడుకు కళ్లెం అడ్డగోలు ఫీజుల వసూళ్లకు ముకుతాడు విద్యాహక్కు చట్టం అమలుకు ఆదేశాలు కొనసాగుతున్న విద్యాశాఖ తనిఖీలు ఖమ్మం : ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, ప్రచార ఆర్భాటం, హంగులతో విద్యార్థుల తల్లిదండ్రులను ప్రలోభాలకు గురి చేసే ప్రైవేట్ విద్యాసంస్థలకు కళ్లెం వేసేందుకు జిల్లా విద్యాశాఖ పూనుకుంది. అధిక ఫీజుల వసూళ్లు, నిబంధనలకు విరుద్దంగా పాఠశాలల్లో దుస్తులు, పుస్తకాలు, ఇతర వస్తువులు అధిక ధరల అమ్మకాలకు అడ్డుకట్ట వేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. విద్యాహక్కు చట్టం అమలు చేయాలని, నిబంధనలకు లోబడి ఫీజులు వసూళ్లు చేయాలని జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. వీటిని పర్యవేక్షించాల్సిందిగా డివిజన్, మండల విద్యాశాఖ అధికారులకు జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాటించాల్సిన నిబంధనలు పాఠశాలలు తెరవడానికి ముందు ఆయూ స్కూల్ యూజమాన్యాలు గవర్నింగ్ బాడీ సమావేశం ఏర్పాటు చేయూలి. ఫీజు, ఇతర నిబంధనల గురించి చర్చించి నిర్ణయం తీసుకోవాలి. పాఠశాల నోటీస్ బోర్డుపై ఫీజు తదితర వివరాలను ఉంచాలి. గవర్నింగ్ బాడీ నిర్ణయించి ఫీజులను ప్రతి పాఠశాల పాటించాలి. గవర్నింగ్‌బాడీ డీఈవో అనుమతిపొందిందై ఉండాలి. ఆర్టీవో సూచించిన నిబంధనల మేరకు పాఠశాల బస్‌ను నడపాలి. అనుమతులు తీసుకోవాలి. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి. డీఎఫ్‌వో సూచించిన విధంగా అగ్నిప్రమాదాల నుంచి రక్షణ పొందే చర్యలను పాటించాలి. పాఠశాల బిల్డింగ్ ఆవరణలో ఫైర్‌సేఫ్టీ నిబంధనలను పాటించేలా చూడాలి. ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్‌లు లేకుండానే విద్యార్థులను చేర్చుకోవాలి. పాఠశాలలో తప్పనిసరిగా ప్రాథమిక చికిత్స కిట్‌ను ఉంచాలి. దీని నిర్వహణపై ఓ టీచర్‌కు శిక్షణ ఇప్పించాలి. పాఠశాల పరిసరాల్లో మంచినీటి వసతి కల్పించాలి. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అదనపు సెక్షన్లు నిర్వహించకూడదు. కాగితాలకే పరిమితమైన ఆదేశాలు... ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అనుసరించాల్సిన విధానాలపై ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా ఉన్నా జిల్లాలో మాత్రం అత్యధిక స్కూల్స్ వీటిని పాటించటం లేదని ఆరోపణలు వస్తున్నారుు. జిల్లాలో 2,979 ప్రభుత్వ పాఠశాలలతోపాటు, 506 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలల వసతులు, బోధన వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకొని పాఠశాల యాజమాన్య కమిటీల నిర్ణయం మేరకు ఫీజులు వసూళ్లు చేయాలి. కానీ జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ, సత్తుపల్లి, మణుగూరు వంటి పట్టణాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. నర్సరీ విద్యార్థికి రూ. 10వేలకు పైగా స్కూల్ ఫీజు, ఇదికాక అడ్మీషన్ పీజు, పెద్ద తరగతులకైతే ఐఐటీ, ఇతర ఫౌండేషన్ కోర్సుల పేరిటి రూ. 50వేల వరకు దండుకుంటున్నారు. ఇక్కడితో ఆగకుండా దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్, టై, బ్యాడ్జీల వంటివి పాఠశాలల్లోనే అధిక ధరలకు విక్రరుుస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే అడ్మీషన్ రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పాఠశాల యాజమాన్య కమిటీలు అంటే తెలియని ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇంత జరుగుతున్నా ప్రైవేట్ దూకుడుకు కళ్లెం వేయడంలో విద్యాశాఖ విఫలమవుతోందనే ఆరోపణలు వస్తున్నారుు. పాఠశాల ప్రారంభానికి ముందు హడావిడి చేసి ఆ తర్వాత మిన్నకుంటున్నాయని కూడా అభియోగాలున్నారుు. పాఠశాల పేరుకు ముందు ఐఐటీ, ఒలంపియాడ్, కాన్సెప్ట్, ఈ-టెక్నో, ఈ-శస్త్ర, కాన్వెంట్, పబ్లిక్ తదితర పేర్లను వాడకూడదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా పాఠశాలలో సిలబస్ బోధించాలి. పాఠశాలలు తప్పనిసరిగా ఆర్టీఈ చట్టం-2009ని అనుసరించాలి. పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, స్కూల్‌బ్యాగ్స్, షూస్‌ను బడిలో విక్రరుుంచొద్దు. పాఠశాల యాజమాన్యాలు క్వాలిఫైడ్ సిబ్బందినే నియమించాలి.