శ్రీమఠంలో పరిమళ ప్రసాదం తయారీ మిషన్
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం యాజమాన్యం పరిమళ ప్రసాదం తయారీ కోసం ప్రత్యేకంగా మిషనరీని తెప్పించింది. పరిమళ ప్రసాదాలను భక్తులు మహా పవిత్రంగా స్వీకరిస్తారు. నెలలో కనీసం 2 లక్షల ప్యాకెట్ల వరకు ప్రసాదాలు విక్రయిస్తున్నారు. రద్దీ సమయాల్లో ఈ సంఖ్య 5 లక్షలకు చేరుతోంది. భక్తుల డిమాండ్‌కు తగ్గట్టు ప్రసాదం తయారీని వేగవంతం చేసేందుకు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ప్రత్యేక యంత్రాన్ని తెప్పించారు. పరిమళ ప్రసాదం కౌంటర్లో రెండు మిషన్లను ఏర్పాటు చేశారు. వీటిని ప్యాకింగ్ చేసి కౌంటర్లలో భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు.