parliament bills
-
నేడు తెలంగాణ పోరు జాతర
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పునర్వైభవం దిశగా అడుగులేస్తోం ది. ప్రత్యేక రాష్ట్ర సాధన, ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ క్రెడిట్ అంశాల ప్రాతిపదికన జిల్లాలో తమ ప్రాభవాన్ని చాటేం దుకు సన్నద్ధమవుతోంది. శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో తెలంగాణ బిల్లుపెట్టాలనే డిమాండ్‌తో బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ‘తెలంగాణ పోరు జాతర’ నిర్వహించేందుకు సర్వం సిద ్ధమైంది. పార్లమెంట్లో బిల్లు పెడితే ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ మద్దతిస్తుందనే స్పష్టమైన వైఖరితోనే యూపీఏ తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకుంద నే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. దేశానికి ప్రత్యామ్నాయం నరేంద్రమోడీయేననే ప్రచారాన్ని విస్తృతం చేసింది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ బిల్లు ఆమోదమయ్యే వరకు అండగా ఉంటామని భరోసా ఇవ్వనుంది. ఏర్పాట్లు పూర్తి పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ పోరుజాతర సభను విజయవంతం చేసేందు కు జిల్లా శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సర్కస్‌గ్రౌండ్‌లో ప్రారంభమయ్యే ఈ సభకు పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీమంత్రి సీహెచ్.విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపీ జంగారెడ్డితోపాటు పలువురు హాజరు కానున్నారు. 20 వేల మంది జనసమీకరణకు ఏర్పాట్లుచేశారు. సభ విజయవంతానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావుతోపాటు ఇతర నాయకులు కృషి చేస్తున్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎడవెల్లి జగ్గారెడ్డి కుమారుడు డాక్టర్ విజయేందర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి కమలదళంలో చేరేందుకు నిర్ణయించుకున్నా రు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నామినేటెడ్ వైద్యవిధాన పరిషత్ గవర్నింగ్ బాడీ సభ్యులుగా పనిచేశారు. ఆయనతోపాటు టీడీపీ, టీఆర్ఎస్ నుంచి పలువురు నాయకు లు బీజేపీలో చేరనున్నారు. సభ ఏర్పాట్లను గుజ్జుల, అర్జున్‌రావు, విజయేందర్‌రెడ్డి పరిశీ లించారు. ఫ్లెక్సీలతో నగరం కాషాయమయం గా మారింది. అసమ్మతి సెగ బీజేపీలో రోజురోజుకూ వర్గపోరు ఎక్కువవుతుండడం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయా నియోజకవర్గాలపై ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఓ పక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషిచేసి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పునర్నిర్మాణం కోసం యత్నిస్తుంటే.. జిల్లాలో మా త్రం పరిస్థితి దిగజారుతోంది. జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన సభకు జిల్లాకు చెందిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావుతోపాటు పలువురు హాజరయ్యే అవకాశాలు లేవని పార్టీవర్గాలే చెబుతున్నాయి. ఉమ్మడిగా పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకులు సభ ఏర్పాట్లు, జనసమీకరణకు ఎవరికివారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సభ అనంతరం జిల్లా పార్టీ శ్రేణులకు వ ర్గాల పోరుపై కిషన్‌రెడ్డి హితబోధ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. -
అమరులకు వందనం
సాక్షి, నల్లగొండ : ఓ వైపు బతుకమ్మ పాటల గొంతుకలు.. మరోవైపు ‘ప్రత్యేక’ హర్షాతిరేకాలు.. అమరుల త్యాగాల స్మరణం.. మిఠాయిల పంపిణీ.. ర్యాలీల సందడి.. నృత్యాలజోరు.. నినాదాలహోరు.. ఇదీ జిల్లాలో శుక్రవారం కనిపించిన పండగ వాతావరణం. దసరా పదిరోజుల ముందుగానే వచ్చిందన్న ఆనందం జిల్లావాసుల్లో కలిగింది. తెలంగాణ నోట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయడంపై పల్లెపల్లెనా సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయం అమరవీరుల త్యాగాల ఫలితమేనని తెలంగాణ వాదులు పేర్కొన్నారు. ఇక పార్లమెంట్లో బిల్లు పెట్టడం, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం సత్వరమే జరగాలని ఆకాం క్షించారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అమరవీరులకు నివాళులర్పించారు. ట్రెజరీ కార్యాలయంలో ఉద్యోగులు స్వీట్లు పంచారు. డీఆర్డీఏ, ఐకేపీ ఉద్యోగులు మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ట్రస్మా నేతలు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేత కేక్ కట్ చేయిం చారు. జేఏసీ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడారు. అంబరాన్నంటిన సంబురాలు.. ఎంపీ రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరిలో, కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో వలిగొండలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పోచంపల్లిలో మండల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. సూర్యాపేట పట్టణంలో తెలంగాణ తల్లి, అంబేద్కర్ విగ్రహాలకు జేఏసీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. బీజేపీ నాయకు లు స్వీట్లు పంచారు. గుట్టలో యువకులు ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూర్(ఎం)లో టీఆర్ఎస్, టీడీపీ, జేఏసీల ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. కోదాడలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ముందు బాణసంచా కాల్చారు. అనంతరం స్వీట్లు పంచారు. బీజేపీ నాయకులు బస్టాండ్ వద్ద టపాసులు కాల్చారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆ తర్వాత కేక్ కట్ చేశారు. బైక్ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్, టీఆర్ఎస్వీ నాయకులు స్వీట్లు పంచారు. ఏబీవీపీ నాయకులు అమరవీరులకు నివాళులర్పించారు. మోత్కూరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు. తుంగతుర్తిలో టీఆర్ఎస్ నాయకులు మిఠాయిలు పంచారు. నూతనకల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. అర్వపల్లిలో టీఆర్ఎస్ నాయకులు మిఠాయిలు పంచారు. హుజూర్‌నగర్‌లో తెలంగాణ జేఏసీ, టీఆర్ఎస్, న్యూడెమోక్రసీ, బీజేపీ, ఉద్యోగసంఘాలు, విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. న్యాయవాద జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మఠంపల్లిలో కాంగ్రెస్, జేఏసీల ఆధ్వర్యంలో వేర్వేరుగా టపాసులు కాల్చారు. మేళ్లచెరువులో టీఆర్ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో నేరేడుచర్లలో కార్పెంటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీలు తీశారు.