parliamentary ethics panel
-
మహువా లోక్‌సభ సభ్యత్వం రద్దుకు ఎథిక్స్ కమిటీ సిఫార్సు
సాక్షి, ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యురాలిగా కొనసాగేందుకు అర్హత లేదని, ఆమెను సభ నుంచి బహిష్కరించాలని పార్లమెంటరీ ఎథిక్స్ ప్యానెల్ తేల్చి చెప్పింది. ఆమెపై వచ్చిన ఆరోపణల ఆధారంగా ఆమెను లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బుధవారం సిఫార్సు చేసింది. మహువాపై వచ్చిన నగదు సంబంధిత ఆరోపణలపై ఎథిక్స్ ప్యానెల్ పరిశీలన జరిపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. మొత్తం 500 పేజీలతో కూడిన నివేదికను ప్యానెల్ సిద్ధం చేసింది. ఆమె నివేదిక ఆమె ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంటరీ ఎథిక్స్ ప్యానెల్ సిఫారసు చేసింది. అంతేకాదు.. ఈ మొత్తం వ్యవహారంలో ఆమెపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొన్న ప్యానెల్.. కేంద్రం ఆధ్వర్యంలో కాలపరిమితితో కూడిన చట్టపరమైన దర్యాప్తునకు సిఫార్సు చేసింది. రాజకీయంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. పార్లమెంటులో ప్రశ్నలడగటానికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువాకు డబ్బులు చెల్లించినట్లు ఓ వ్యాపారవేత్త చేసిన ఆరోపణలతో పెను దుమారం రేగింది. అయితే ఈ వ్యవహారం అంతా ప్రధాని కార్యాలయం నుంచే నడుస్తోందని, తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆమె ఖండిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆమెపై నమోదు అయిన ఫిర్యాదుల ఆధారంగా.. పార్లమెంటరీ ఎథిక్స్ ప్యానెల్ విచారణ చేపట్టింది. నవంబర్ 2వ తేదీన ఎథిక్స్ కమిటీ ముందు ఆమె హాజరయ్యారు కూడా. అయితే విచారణ మధ్యలోనే ఆమె వెళ్లిపోవడం, ఆ సమయంలో ఎథిక్స్ కమిటీపై ఆమె చేసిన ఆరోపణలు.. తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. -
చెత్త ప్రశ్నలు అడిగారు: మహువా మెయిత్రా
ఢిల్లీ: ఎథిక్స్ కమిటీ సభ్యులు చెత్త ప్రశ్నలు అడిగారని టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా తెలిపారు. అనైతిక, వ్యక్తిగత ప్రశ్నలు అడిగారని ఎథిక్స్ కమిటీ సభ్యులపై మండిపడ్డారు. పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహువా మొయిత్రా, ప్రతిపక్ష ఎంపీలు విచారణ నుంచి బయటకొచ్చారు. ప్యానెల్ వ్యక్తిగత, అనైతిక ప్రశ్నలు అడుగుతోందంటూ ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు. ఏదేదో విషయాలు తీస్తూ చెత్తగా మాట్లాడుతున్నారని మహువా తెలిపారు. ‘మీ కళ్లలో నీళ్లు ఉన్నాయని అంటున్నారు. నా కళ్లలో నీళ్లు కనిపిస్తున్నాయా?’ అని మీడియా ముందు మహువా ప్రశ్నించారు. ‘వ్యక్తిగత సంబంధం’లోని అపార్థాలే తనపై క్యాష్ ఫర్ క్వేరీ కేసు నమోదుకు కారణమైనట్లు ఎథిక్స్ కమిటీకి మహువా మెయిత్రా తెలిపారు. కాగా గతంలోనూ తనపై వచ్చిన ఆరోపణల వెనుక తన మాజీ ప్రియుడు జైన్ అనంత్ దేహద్రాయ్ హస్తం ఉన్నట్లు మెయిత్రా పేర్కొన్నారు. డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారన్న కేసులో టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా నేడు ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యారు. మూడు కేంద్ర మంత్రిత్వ శాఖల నుండి ఎథిక్స్ కమిటీకి వచ్చిన నివేదికలతో పాటు ఇతర పత్రాలు, సాక్ష్యాల ఆధారంగా మహువా మొయిత్రాను ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. హోం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నివేదికలు ఎథిక్స్ కమిటీ వద్ద ఉన్నాయి. #WATCH | TMC MP Mahua Moitra arrives at the Parliament in Delhi. She is appearing before the Parliament Ethics Committee in connection with the 'cash for query' charge against her. pic.twitter.com/Hl4ZqG3eEl — ANI (@ANI) November 2, 2023 ప్రధాని మోదీ, అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా లోక్‌సభలో ప్రశ్నలు అడగడానికి టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా.. వ్యాపారవేత్త హీరానందానీ నుంచి డబ్బులు తీసుకున్నారని నిషికాంత్ దూబే ఆరోపించారు. ఈ క్రమంలో మహువాకు లంచం ఇచ్చినట్లు ఆరోపిస్తూ హీరానందానీ పేర ఓ లేఖకు కూడా చక్కర్లు కొట్టింది. వీటిని మహవా మెయిత్రా ఖండించారు. ఈ వ్యవహారంలో మహువాకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సమన్లు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె నేడు ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యారు. అయితే.. తనకు లంచం ఇచ్చినట్లు బయటకొచ్చిన అఫిడవిట్‌పై హీరానందానీని ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వాలని ఆమె ఎథిక్స్ కమిటీని కోరారు. ఇదీ చదవండి: దుబాయ్ నుంచి 47 సార్లు.. మహువా మెయిత్రా కేసులో వెలుగులోకి కీలక అంశాలు -
విజయ్ మాల్యాపై బహిష్కరణ వేటు!
న్యూఢిల్లీ : విజయ్ మాల్యాపై మరో ఎదురు దెబ్బ తగిలింది. రాజ్యసభ సభ్యుడుగా ఉన్న ఆయనను బహిష్కరించాలని పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ సోమవారం నిర్ణయించింది. ఇవాళ సాయంత్రం సమావేశమైన ఈ కమిటీ మాల్యా అంశంపై చర్చించి ,ఆయన రాజ్యసభ సభ్యత్వం రద్దు చేయాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు ఎథిక్స్ కమిటీ విజయ్ మాల్యాకు నోటీసు జారీ చేసింది. మే 3వ తేదీలోగా ఎథిక్స్ కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. కమిటీ జారీ చేసిన నోటీసుపై మాల్యా వారంలోగా సమాధానం ఇవ్వాల్సి ఉంది. కాగా మాల్యా కర్ణాటక నుంచి 2002లో కాంగ్రెస్-జనతాదళ్ మద్దతుతో రాజ్యసభకు ఎన్నిక అయిన విషయం తెలిసిందే. 2010లో ఆయన మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం ఈ ఏడాది జూలైతో ముగియనుంది. కాగా మాల్యాకు తొమ్మిదివేల కోట్ల బ్యాంకు రుణ కుంభకోణం కేసు ఓ వైపు, మరోవైపు ఆయన పాస్‌పోర్ట్ కూడా రద్దు అయిన విషయం తెలిసిందే. తాజాగా రాజ్యసభ సభ్యత్వం రద్దుకు ఎథిక్స్ కమిటీ సిఫార్సుతో ఆయనకు మరో ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు.