కారు బీభత్సం
గచ్చిబౌలి,న్యూస్‌లైన్: డ్రైవింగ్ రాని వ్యక్తి మద్యం మత్తులో కారు నడిపేందుకు ప్రయత్నించి ఆరుగురుని గాయపరిచాడు. ఒకరి పరిస్థితి విషమంగా ఉం ది. మాదాపూర్ ఎస్సై సురేష్‌బాబు తెలిపిన ప్రకారం.. పర్వతనగర్‌లో ఉంటూ మేస్త్రీగా పనిచేసే రాములు (45) తన ఇంటి ముందు పార్కు చేసి ఉన్న ఇండికా కారును మద్యం మత్తులో స్టార్ట్ చేశాడు. 50 మీటర్ల దూరం ముందుకు దూసుకెళ్లిన కారును అదుపు చేయలేకపోయాడు. దీంతో అది వెళ్లి ఓ ఇంటి ముం దు కూర్చున్న శంకరమ్మ, బీరప్ప, పుష్పలను ఢీకొట్టింది. వారికి గాయాలయ్యాయి.
అప్పటి కీ కారు అదుపుకాక ఓ రేకుల ఇంట్లోకి దుసుకెళ్లింది. ఆ ఇంట్లో అద్దెకు ఉంటోన్న శ్యామ్‌సుం దర్, పూజ అనే పాపను ఢీకొట్టింది. వారికి తీ వ్ర గాయాలయ్యాయి. పుష్ప పరిస్థితి విషమం గా ఉండడంతో నిమ్స్‌కు తరలించారు. రాము లు కూడా గాయపడ్డాడు. అతన్ని కొండాపూర్ ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో, డ్రైవింగ్ రాకుండా కారు నడిపి బీభత్సం సృష్టించిన రాములుపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.