parvathipuram hospital
-
నిలిచిపోయిన డయాలసిస్
పార్వతీపురం: కిడ్నీవ్యాధిగ్రస్థులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉన్న పార్వతీపు రం ఏరియా ఆస్పత్రిలోని డయాలసిస్ కేంద్రంలో సేవలు నిలిచిపోయాయి. హైఓల్టేజ్ కారణంగా ముఖ్యమైన యంత్రాలు ధ్వంసం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పటివరకు 72మంది రోగులు ఈ కేం ద్రం ద్వారా సేవలు పొందుతున్నారు. కేంద్రం ఏర్పాటు చేసి 13నెలలు అయినప్పటికీ ఇక్కడి సేవలకు ఎంతో గుర్తింపు లభించింది. గత శుక్రవారం హైఓల్టేజ్ రావడంతో డయాలసిస్ యూనిట్ వద్ద ఏర్పాటు చేసిన స్టెబిలైజర్ పాడైంది. డయాలసిస్ యంత్రాలు ధ్వంసమయ్యాయి. ఫలితంగా డయాలసిస్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో డయాలసిస్ కేంద్రం నిర్వాహకులు రోగులను పక్క జిల్లాలోని పాలకొండలో ఉన్న డయాలసిస్ కేంద్రానికి తరలిస్తున్నారు. అక్కడ వారికి సేవలు అందిస్తున్నారు. రూ. 10 లక్ష లమేర నష్టం.. ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి డయాలసిస్ కేంద్రానికి నేరుగా విద్యుత్ సరఫరాను అందించే కేబుల్‌ను కూడా డయాలసిస్ యూనిట్ నిర్వాహకులే ఏర్పాటు చేస్తున్నారు. స్టెబిలైజర్‌ను కూడా ఏర్పాటు చేశారు. అధిక విద్యుత్ సరఫరా అయిన సమయంలో వాటిని సరిదిద్ది పంపించే స్టెబిలైజర్‌లో న్యూట్రల్ వ్యవస్థ పాడవ్వడం, వైర్లు కాలిపోయి తెగిపోవడంతో ఒక్కసారిగా స్టెబిలైజర్ ద్వారా అత్యధిక ఓల్టేజీ ప్రసారం కావడంతో డయాలసిస్ కేంద్రంలోవున్న ఆరు మిషన్లకు విద్యుత్ సరఫరా జరగడంతో అందులోవున్న ఎస్‌ఎంపీఎస్ బోరŠుడ్స,(స్విచ్మోడ్ ఫవర్ సప్లై), కొన్ని హీటర్ ఫ్యూజులు కాలిపోవడంతో మిషన్లు పనిచేయకుండా పోయాయి. సుమారు రూ. 10లక్షలు ఆస్తినష్టం జరిగినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి అవసరమైన స్పేర్ పాట్స్ వచ్చిన తరువాత యంత్రాలను బాగుచేస్తామని, తరువాత రోగులకు సేవలు అందిస్తామని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షిస్తున్నాం. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి అత్యధిక ఓల్టేజీ రావడంతో మిషన్లు పాడై రూ. 10 లక్షల వరకు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం న్యూట్రల్ పాయింట్‌ను సరిచేశాం. తద్వారా సేవలు కొనసాగించడానికి పక్క కేంద్రాలనుంచి డయాలసిస్ మిషన్లను తెప్పిస్తాం. పూర్తి సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నాం. రెండు, మూడు రోజుల్లో తిరిగి సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.– డా. జి.నాగభూషణరావు,సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి న్యూట్రల్ పాయింట్ కాలిపోవడంవల్లే... డయాలసిస్ కేంద్రంలో ఏర్పాటు చేసిన స్టెబిలైజర్ న్యూట్రల్ వైర్లు కాలిపోవడంవల్లే స్టెబిలైజర్ గుండా 450 ఓల్టేజ్ ప్రవహిం చింది. తద్వారా మిషన్లోవున్న ఎస్‌ఎంపీఎస్ బోర్లు కాలిపోయాయి. కేంద్రం లోవు న్న అన్ని మిషన్లు పనిచేయకుండా పోవడంతో రోగులకు ప్రత్యామ్నాయంగా పాలకొండ డయాలసిస్ కేంద్రానికి పంపిస్తున్నాం. – జితేంద్ర, నెప్రో ఇంజనీర్ -
నరకయాతన..
పార్వతీపురం/గుమ్మలక్ష్మీపురం: ఆమె కడుపులో బిడ్డ నాలుగు రోజుల కిందటే చనిపోయింది. శస్త్రచికిత్స చేసి సమస్యను పరిష్కరించేందుకు పార్వతీపురం ఏరియా ఆస్పత్రి వైద్యులు భయపడ్డారు. వైద్యం వికటిస్తే.. మెరుగైన వైద్య సదుపాయం అందుబాటులో లేకపోవడతో విజయనగరం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. అయితే, ఆమెది నిరుపేద కుటుంబం కావడం.. అక్కడి వరకు వెళ్లేందుకు దారిఖర్చులూ లేకపోవడంతో వెనుకంజ వేసింది. విషయం పీవో దృష్టికి వెళ్లడంతో ఆయన వైద్యాధికారులను అప్రమత్తం చేశారు. ఖర్చులన్నీ భరిం చేందుకు సిద్ధపడి 108 వాహన సదుపాయం కల్పిం చి విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కడుపులో ఉన్న మృతబిడ్డతో ఆమె పడే నరకయాతన చూసేవారికి కన్నీరుతెప్పించింది. వివరాల్లోకి వెళ్తే... చాపచాయి జంగిడి భద్ర గ్రామానికి చెందిన ఆరు నెలల గర్భిణి మండంగి సింధు తన కడుపులో ఉన్న బిడ్డ కదలడం లేదంటూ నాలుగు రోజుల కిందట తాడికొండ పీహెచ్‌సీకి వెళ్లింది. అక్కడ ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారి మెరుగైన వైద్యం కోసం కురుపాం సీహెచ్‌సీకి రిఫర్ చేశారు. అక్కడకు మూడు రోజుల క్రితం ఈ గర్భిణి తన భర్త శ్యామలరావుతో కలిసి వెళ్లగా, ఆ ఆసుపత్రిలో పరీక్షించిన స్టాఫ్‌నర్స్ పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి వెళ్లాలంటూ సూచించడంతో తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. వీరి పరిస్థితిని తెలుసుకున్న తాడికొండ పీహెచ్సీ వైద్యుడు జి.ప్రభాకరరావు గర్భిణీతో పాటు కుటుంబీకులకు పార్వతీపురం వెళ్లాల్సిందేనంటూ చైతన్యపరచి ఏఎన్ఎం సహాయంతో శనివారం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి పంపించారు. ఆమెను శనివారం సాయంత్రమే పరిక్షించిన వైద్యులు సింధూ కడుపులోని బిడ్డ చనిపోయినట్టు నిర్ధారించారు. శస్త్రచికిత్స చేసి బిడ ్డను తీయాలని, ఇక్కడ ఆ సదుపాయాలు లేవంటూ విజయనగరం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. అయితే, ఆర్థిక ఇబ్బందులు కారణంగా వెళ్లేందుకు నిరాకరించారు. ఆదివారం సాయంత్రం వరకు పా ర్వతీపురం ఏరియా ఆస్పత్రిలోనే ఉండిపోయారు. ఈ విషయం ఐటీడీఏ పీఓ దృష్టికి వెళ్లడంతో ఆయన విజయనగరం ఆస్పత్రికి తరలించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. దీంతో రాత్రి 7.30 గంటల ప్రాం తంలో సింధును విజయనగరం పంపించే ఏర్పాట్లను ఏరియా ఆస్పత్రి వైద్యులు చేశారు. అయితే, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి పెద్దదే అయినా సదుపాయాలు, పరికరాలు అందుబాటులో లేకపోవడం... వైద్యం వికటిస్తే గిరిజన సంఘాలు ఆందోళనలు చేస్తుండడంతో వైద్యం అందించేందుకు వైద్యులు సైతం భయపడుతున్నారు. అందుకే.. ప్రమాదకర కేసులను విజయనగరం కేంద్రాస్పత్రికి రిఫర్ చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. -
రైలు ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ
-
రైలు ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ
పార్వతీపురం: హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో గాయపడిన వారిని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందున్న వారిని ఆయన కలిశారు. బాధితులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అన్నివిధాలా అండగా ఉంటామని భరోసాయిచ్చారు. బాధితులకు ఎలాంటి వైద్యం అందిస్తున్నారని వైద్యులను అడిగారు. క్షతగాత్రులకు అందిస్తున్న చికిత్స వివరాలను జగన్ కు వైద్యులు వివరించారు. బాధితులు త్వరగా కోలుకునేందుకు మెరుగైన వైద్యం అందిచాలని డాక్టర్లకు జగన్ సూచించారు.