
రైలు ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ
పార్వతీపురం: హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో గాయపడిన వారిని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందున్న వారిని ఆయన కలిశారు. బాధితులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అన్నివిధాలా అండగా ఉంటామని భరోసాయిచ్చారు.
బాధితులకు ఎలాంటి వైద్యం అందిస్తున్నారని వైద్యులను అడిగారు. క్షతగాత్రులకు అందిస్తున్న చికిత్స వివరాలను జగన్ కు వైద్యులు వివరించారు. బాధితులు త్వరగా కోలుకునేందుకు మెరుగైన వైద్యం అందిచాలని డాక్టర్లకు జగన్ సూచించారు.