పొన్నాల లక్ష్మయ్య
మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు తన నియోజకవర్గంలో రైలు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించడానికి టైమ్ లేదని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఆయనకు సింగపూర్లో షికారు చేయడానికి టైమ్ దొరికిందా? అని ప్రశ్నించారు.
కెసిఆర్ అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని విమర్శించారు. మెదక్ ఉప ఎన్నికలలో ప్రజలు టిఆర్ఎస్కు తగిన గుణపాఠం చెబుతారని పొన్నాల హెచ్చరించారు.