చెన్నైలో పోలీసుల సైకిల్ గస్తీ
కేకే.నగర్: చెన్నైలో పోలీసుల గస్తీ నిర్వహించేందుకు ప్రభుత్వం సైకిళ్లను అందజేసింది. సుమారు 250 సైకిళ్లతో చెన్నైలో గల అన్ని ప్రాంతాల్లో పోలీసులు గస్తీ పెంచారు. హెడ్లైట్, సైరన్లు ఏర్పాటు చేసిన ఈ సైకిళ్లు పోలీసులకు ఎంతో అనువుగా ఉన్నాయి. చిన్నపాటి సందుల్లో కూడా వెళ్లే పోలీసులు గుడిసె ప్రాంతాల్లోని నేరాలను, నిందితులను సులభంగా అరెస్టు చేస్తున్నారు.
టి.నగర్ సహాయ కమిషనర్ శరవణన్, కేకేనగర్ ప్రాంతంలో సైకిల్ గస్తీలను పర్యవేక్షించి పోలీసులను ప్రోత్సహించారు. గుడిసె ప్రాంతాల్లోని ప్రజల వద్ద పోలీసులు పని తీరు గురించి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. సైకిల్ గస్తీల వలన పోలీసులు ఎలాంటి సమస్య జరిగినా వచ్చి పరిష్కరిస్తున్నారని ప్రజలు తెలిపారు.