Pattanam Mahender Reddy
-
ప్రతి జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు
కేంద్రం సహకారంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో రూ.5 కోట్లతో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను నెలకొల్పుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఏపీ, తెలంగాణల మధ్య వాహన రాకపోకలకు సింగిల్ పర్మిట్ సదుపాయం కల్పించే అంశంపై వారంలో ఏపీ ప్రభుత్వంతో మరో దఫా చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
సబ్ స్టేషన్లకు రూ.110 కోట్లు
♦ ఇకపై లో ఓల్టేజీ సమస్య పూర్తిగా తీరుతుంది ♦ ఇప్పటికే రైతులకు 9గంటలు విద్యుత్ ఇస్తున్నాం ♦ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి చేవెళ్ల రూరల్: జిల్లాలో 50 విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు రూ.110 కోట్లు కేటాయించినట్టు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మంత్రి మహేందర్‌రెడ్డి చేవెళ్ల మండలం ముడిమ్యాలలో నిర్మించిన 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం, రేగడిఘనాపూర్‌లో కొత్తగా నిర్మించే 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం నిరంతర కరెంట్, రైతులకు 9 గంటల సరఫరాను అందిస్తున్నామని చెప్పారు. దీని వల్ల జిల్లాలోని లక్షా 10వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. 50 యూనిట్లలోపు విద్యుత్ వాడిన ఎస్సీ, ఎస్టీలకు చార్జీల మాఫీ చేశామని మంత్రి చెప్పారు. జిల్లాలోని తూర్పు డివిజన్లో 9 సబ్స్టేషన్లకు రూ.22కోట్లు, ఉత్తర డివిజన్లో 14 సబ్స్టేషన్లకు రూ.53కోట్లు, పశ్చిమ డివిజన్లో రూ.17 సబ్‌స్టేషన్‌లో రూ.34 కోట్లు కేటాయించామన్నారు. ఇంకా 37 విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలో 8 సబ్స్టేషన్లకు గాను రూ.17 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుతో వినియోగదారులకు లో ఓల్టేజీ సమస్య ఉండదన్నారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రజలు బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందరం కలిసి పనిచేస్తేనే ఆ కల నేరవేరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, విద్యుత్ ఎస్ఈ శ్రీరామలు, డీఈ దుర్గారావు, ఏఈ అశోక్‌రావు, సర్పంచులు కోరే సువర్ణ, తిప్పని రాంరెడ్డి, ఎంపీసీటీ సభ్యులు బుర్ల సుమలత, శ్రీలత, ఎంపీపీ ఎం.బాల్‌రాజ్, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు పి. వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
క్రీడల అభివృద్ధికి కృషి
♦ మహేశ్వరంలో మినీ స్టేడియం నిర్మిస్తాం ♦ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ♦ మహేశ్వరంలో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం మహేశ్వరం: క్రీడల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. క్రీడల్లో ప్రావీణ్యమున్న గ్రామీణ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. శుక్రవారం మహేశ్వరంలో జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో 27వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఖోఖో పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుఢ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు ప్రభుత్వం ఉద్యోగాలిస్తుందన్నారు. మహేశ్వరం మండలంలో కబడ్డీ, క్రికెట్, ఖోఖోలో జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు ఉన్నారని తెలిపారు. మహేశ్వరంలో మినీస్డేడియం నిర్మిస్తామని చెప్పారు. ప్రావీణ్యం ఉన్న క్రీడల్లో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి ఉన్నత స్థానానికి వెళ్లేలా సహకరిస్తామని మంత్రి మహేం దర్‌రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరంలో మినీ స్టేడియం నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. అంతకుముందు గడికోటలో జ్యోతి వెలిగించి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసరావు, జిల్లా సెక్రటరీ రామకృష్ణ, టీఆర్ఎస్ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి కొత్త మనోహర్‌రెడ్డి, తహసీల్దార్ షర్మిల, జెడ్పీటీసీ సభ్యుడు ఈశ్వర్ నాయక్, వైస్ ఎంపీపీ మునగపాటి స్వప్న, మహేశ్వరం సర్పం చ్ ఆనందం, ఉప సర్పంచ్ రాములు, టీఆర్ఎస్ నాయకులు కూన యాదయ్య, బోద జైపాల్‌రెడ్డి, తడకల యాదయ్య, అశోక్, పీఈటీలు రాాజ్కుమార్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.