ఫుట్పాత్ చిన్నారిపై టాక్సీలో అత్యాచారం
దాదాపు 20 నెలల క్రితం కోల్కతాలోని పార్క్స్ట్రీట్లో ఓ దారుణం ఎలా జరిగిందో మళ్లీ అలాంటి సంఘటనే మరోసారి జరిగింది. ఫుట్ పాత్ మీద నివసించే కుటుంబంలోని ఓ పదమూడేళ్ల చిన్నారిని కారులోకి లాగి దారుణంగా అత్యాచారం చేశారు. ఈ దారుణం పార్క్స్ట్రీట్కు అత్యంత సమీపంలోని రఫీ అహ్మద్ కిద్వాయ్ రోడ్డులో జరిగింది. ఈ సంఘటనతో సంబంధమున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
టాక్సీ డ్రైవర్ కోసం, అత్యాచారం చేసిన మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 2012 ఫిబ్రవరిలో కొందరు యువకులు ఓ ఆంగ్లో ఇండియన్ యువతితో స్నేహం చేసినట్లు నటించి ఆమెపై అత్యాచారం చేశారు. ఈ దారుణంతో అప్పట్లో కోల్కతా నగరం అట్టుడికింది. ఈ కేసుపై ఇప్పటికీ కోర్టులో విచారణ సాగుతోంది. కానీ ప్రధాన నిందితుడు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.